- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డెస్టినేషన్ ఈవెంట్స్.. వేడుకల నిర్వహణలో కొత్త ట్రెండ్!
అందరూ కలిసి సుదూర ప్రాంతాల్లో ఆనందగా గడిపే క్షణాలు కలకాలం గుర్తుంటాయనే ఉద్దేశం డెస్టినేషన్ ఈవెంట్స్ ట్రెండ్ పెరగానికి కారణమని నిపుణులు అంటున్నారు.

దిశ, ఫీచర్స్ : అది బర్త్ డే పార్టీ కావచ్చు. బ్యాచిలర్ పార్టీ కావచ్చు. పెళ్లి వేడుక కావచ్చు. ఆఫీస్ మీటింగ్ కావచ్చు. చిన్ననాటి స్నేహితుల ఆత్మీయ సమ్మేళనం కావచ్చు లేదా కొంతమంది కలిసి జరుపుకునే వర్క్ రిలేటెడ్ సమావేశమైనా కావచ్చు. ఏదైతేనేం.. అందరూ కలిసి సుదూర ప్రాంతంలో జరుపుకునే వేడుకలో ఉండే కిక్కే వేరబ్బా అంటోంది నేటి యువత. ఒకప్పుడు ఇవన్నీ ఉన్న ఊరిలోనో, నివాసిత ప్రాంతాలకు దగ్గరలోనో, పట్టణ ప్రాంతాల్లోనో ఎక్కువగా జరుపుకునేవారు జనాలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నలుగురు కలిసి జరుపుకునే ప్రోగ్రామ్ ఏదైనా, నివాసిత ప్రాంతాలకు దూరంగా, దేశ విదేశాల్లోని అందమైన ప్రాంతాల్లో, సుదూర తీరాల్లో జరుపుకోవాలనే ధోరణి ఇటీవల పెరిగిపోతోంది. దీనినే ‘డెస్టినేషన్ ఈవెంట్ కల్చర్’గా పేర్కొంటున్నారు నిపుణులు.
సుదూర ప్రాంతాల్లో ఆనంద క్షణాలు..
అందరూ కలిసి సుదూర ప్రాంతాల్లో ఆనందగా గడిపే క్షణాలు కలకాలం గుర్తుంటాయనే ఉద్దేశం, పాజిటివ్ ఎనర్జీని నింపుతాయనే ఆలోచన కూడా డెస్టినేషన్ ఈవెంట్స్ ట్రెండ్ పెరగానికి మరో కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. అది ఎలాంటి ప్రోగ్రామ్ అయినా కానివ్వండి.. చిన్న బర్త్ డే పార్టీ అయినా సరే, ఉన్నచోటనే జరుపుకోకుండా ఏ గోవాకో, కేరళకో, అండమాన్ నికోబార్ దీవులకో, హిమాచల్ ప్రదేశ్‌కో, దుబాయ్ కో, బ్యాంకాక్‌కో, థాయ్ లాండ్‌కో, స్విడ్జర్లాండ్ కో.. ఇలా దేశ విదేశాల్లోని సుదూర ప్రాంతాలకు వెళ్లి నిర్వహించుకునే డెస్టినేషన్ వేడుకలపై ఇప్పుడు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. పైగా ఇవి స్ట్రెస్ రిలీఫ్ కూడా ఇస్తాయని భావిస్తుండటంతో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
ప్రయాణం మొదలు వేడుక వరకు..
బిజీ లైఫ్‌కు దూరంగా, ప్రశాంతమైన వాతావరణంలో ఈవెంట్ ప్లాన్ చేయాలని భావించే వారు అలాంటి వెదర్ కలిగిన ప్రాంతాలకో, పల్లెటూర్లకు వెళ్లి వేడుకలు జరుపుకునే వారు. కానీ ఈ మధ్య అవి పల్లెటూర్లైనా, పట్టణాలైనా సుదూర తీరంలోని అందమైన ప్రాంతాలైతే చాలంటున్నారు చాలా మంది. ఎందుకంటే జర్నీ మొదలు కొని ఈవెంట్ వరకూ అందరూ కలిసి మెలిసి గడిపే సందర్భాలు మానవ సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని, ఇవి ఒత్తిడిని దూరం చేయడంతో పాటు స్వీట్ మోమోరీస్‌గా ఉండిపోతాయని ‘డెస్టినేషన్ ఈవెంట్స్’ ట్రెండ్ పాలోవర్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే నివాసిత ప్రాంతాల్లో కాకుండా సుదూర ప్రాంతాల్లోని, దేశ విదేశాల్లోని రిసార్టుల్లో, హోటల్స్‌లో, ఫంక్షన్ హాల్స్‌లో శుభకార్యాల నిర్వహణకు మొగ్గుతున్నారు.
బీచ్‌లు.. పచ్చిక బయళ్లు
డెస్టినేషన్ ఈవెంట్స్‌పై మొగ్గు చూపడానికి ప్రధాన కారణం అందమైన లొకేషన్లలో సరదాగా గడిపి రావచ్చు అనే ఉద్దేశమే అంటున్నారు నిపుణులు. అందుకే చాలామంది బీచ్‌లు, ఎత్తైన పర్వాతాలు, టూరిస్టు ప్రాంతాలు, లోయలు, పచ్చిక బయళ్లు గల ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుంటారు. అట్లనే లొకేషన్ ఏదైనా మీ బడ్జెట్‌కు, ఆసక్తికి సరిపడా ప్లాన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఒకవేళ డెస్టినేషన్ ఈవెంట్‌కు బడ్జెట్ మీవద్దలేకపోతే అదే తరహా అనుభూతినిచ్చే మరో ప్రాంతాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఖర్చుపై అవగాహన ముఖ్యం
సాధారణంగా డెస్టినేషన్ ఈవెంట్స్‌కు ఖర్చు ఎక్కువే. అయితేనేం మనసుకు నచ్చితే చాలు. ఆనందంగా గడిపే ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు ఈరోజుల్లో కొందరు. అందుకే సుదూర తీరాల్లో డెస్టినేషన్ ఈవెంట్స్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే అప్పులు చేసి మరీ ఆనందంగా గడిపే క్షణాలైతే మాత్రం తర్వాత సమస్యల్లో చిక్కుకోవచ్చు. కాబట్టి తగిన జాగ్రత్తలూ ముఖ్యమే అంటున్నారు నిపుణులు. డెస్టినేషన్ ఈవెంట్స్‌కు సాధారణ ఖర్చులతోపాటు ట్యాక్స్‌లు, సర్వీస్ చార్జీలు, ఈవెంట్ ఆర్గనైజర్లకు చెల్లింపులు వంటివి చాలానే ఉంటాయి. కాబట్టి ఎంచుకునే బ్యూటిఫుల్ లొకేషన్‌తో పాటు బడ్జెట్ నిర్వహణపై (Budget management) ముందుస్తు అవగాహనతో సిద్ధం అయితే సుదూర తీరాల్లో ఆనందంగా గడిపే మధుర క్షణాలను మిస్ అవుతామనే ఇబ్బందులేవీ ఉండవు.






