Beauty Tips : చిన్న వయసులో వృద్ధాప్య ఛాయలా..? యంగెస్ట్ లుక్స్ కోసం టిప్స్ ఇవిగో..!

by Javid Pasha |

Beauty Tips : చిన్న వయసులో వృద్ధాప్య ఛాయలా..? యంగెస్ట్ లుక్స్ కోసం టిప్స్ ఇవిగో..!

Beauty Tips : చిన్న వయసులో వృద్ధాప్య ఛాయలా..? యంగెస్ట్ లుక్స్ కోసం టిప్స్ ఇవిగో..!
X

దిశ, ఫీచర్స్ : వయసు చిన్నదే అయినప్పటికీ చూడ్డానికి పెద్ద వారిలా కనిపిస్తుంటారు కొందరు. యంగ్ ఏజ్‌లో లోనే వృద్ధాప్య ఛాయలు ఇబ్బంది పెడుతుంటాయి. హార్మోన్ల అసమతుల్యతో, విటమిన్ల లోపమో, పర్యావరణ పరిస్థితులో ఈ విధమైన ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్‌కు కారణం అవుతుంటాయి. దీనివల్ల నలుగురిలో కలిసిపోవడానికి ఇబ్బంది పడుతుంటారు పలువురు. మరికొందరు తమ ఏజ్ విషయంలో ఇతరులు చేసే కామెంట్లతో గిల్టీగా ఫీలవుతుంటారు. వయస్సును ఎవరూ వెనక్కి అయితే తేలేరు కానీ, యంగెస్ట్ లుక్ రావడానికి కొన్ని టిప్స్ పనిచేస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

ఆహారపు అలవాట్లు

జీవన శైలి కూడా వ్యక్తుల శరీరం, అందం విషయంలో కీలకపాత్ర పోషిస్తుంది. కొందరు హెల్తీ ఫుడ్ కంటే జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తింటుంటారు. బాడీ ఫిట్‌నెస్‌పై ఇంట్రెస్ట్ పెట్టకుండా నచ్చింది తింటూ ఉంటారు. దీనివల్ల అధిక బరువు పెరుగుతారు. సాధారణంకంటే ఎక్కువగా లావు కావడంవల్ల కూడా నిజమైన వయస్సుకంటే, ఎక్కువ వయస్సు గలవారీగా కనిపిస్తారు. ఇలాంటి వారు ఆరోగ్య కరమైన ఆహారం మితంగా తీసుకోవడం, రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయడంతో బరువు, లావు తగ్గి యంగెస్ట్ లుక్‌లోకి రావచ్చు.అందుకు అనుగుణంగా జీవన శైలిని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

హెయిర్ స్టైల్

హెయిర్ స్టైల్స్ కూడా లుక్స్‌ని, ఏజ్‌ను డామినేట్ చేస్తుంటాయి అంటారు నిపుణులు. కొన్ని రకాల పోకడలు పెద్ద ఏజ్ వారిలా కనిపించేందుకు కారణం అవుతాయి. కాబట్టి మీ హెయిర్ స్టైల్ మీ మొహానికి నప్పిందా? దానివల్ల మీరు యంగ్‌గా కనిపిస్తున్నారా? పెద్దవారిలా కనిపిస్తున్నారా? ఒకసారి పరిశీలించుకోండి. ప్రస్తుతం రకరకాల హెయిర్ స్టైల్స్ ఉన్నాయి. మీరు యవ్వనంగా కనిపించే స్టైల్‌ను ఎంచుకొని ఫాలో అయిపోతే సరి.

మేకప్ వల్ల కూడా..

తరచుగా మేకప్ చేసేవారు, కొన్నిసార్లు చేయకపోవడం వల్ల పెద్ద ఏజ్ వ్యక్తుల్లా కనిపిస్తారు. అసలు మేకప్ చేసే అలవాటు లేనివారికి ఇలాంటి సమస్య ఉండకపోవచ్చు. కాబట్టి ట్రెండీ అండ్ ట్రెడీషనల్ మేకప్ స్టైల్‌ను ఫాలో అయ్యేవారు తమకు ఏ మేకప్ వల్ల యంగెస్ట్ లుక్ వస్తుందో చెక్ చేసుకొని అనుసరిస్తే వృద్ధాప్య ఛాయలను కవర్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు.

స్కిన్ కేర్ రొటీన్స్

స్కిన్ కేర్ రొటీన్స్ ఫాలో అవకపోతే కూడా చర్మంపై ముడతలు, మచ్చలు వంటివి ఏర్పడి ఏజ్ బార్ కనిపిస్తుంది. కాబట్టి తరచుగా బయటకు వెళ్లిరాగానే స్నానం చేయడం లేదా మొహం కడుక్కోవడం, మేకప్ చేసి ఉంటే ఇంటికి వచ్చాక ఎక్కువసేపు అలాగే ఉండకుండా రిమూవ్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీ స్కిన్‌ను బట్టి ఏ మేకప్ వేయాలో, ఏది చేయకూడదో, ఏ క్రీములు వాడాలో, ఏది వాడకూడదో కూడా తెలిసి ఉండాలి. హెల్తీ టిప్స్ ఫాలో అయితే యంగెస్ట్ లుక్ మీ సొంతం.

డ్రెస్సింగ్ స్టైల్

వేసుకునే దుస్తులను బట్టి కూడా వయస్సు కాస్త అటూ ఇటూ కనిపిస్తుంది. కంఫర్ట్‌గా ఉన్నప్పటికీ కొన్ని రకాల డ్రెస్సింగ్ స్టైల్ మీరు పెద్దవారిలా కనిపించేందుకు కారణం అవుతుంది. మహిళలకు అయితే రౌండ్ నెక్స్ కాస్త ఏజ్‌బార్ అనిపించేలా చేస్తాయి. కాబట్టి క్లోజ్డ్ నెక్‌డ్రెస్‌లు లేదా షర్టులు ట్రై చేయవచ్చు. అలాగే మీ స్కిన్ టోన్‌కి, శరీరానికి ఏ దుస్తులు వేసుకుంటే యంగ్‌గా కనిపిస్తారో వాటిని ఎంచుకోవడం బెటర్.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story