ప్రేమ కాదు.. భ్రమ! రిలేషన్‌షిప్‌లో వీటిని గుర్తించకపోతే నష్టపోతారు!

by Javid Pasha |   (  Updated:2026-01-09 12:06:49  IST  )

ప్రేమ అవసరమే కానీ మీరు ప్రేమ అని భావించే ప్రతీదీ ప్రేమకాకపోవచ్చు. కొన్నిసార్లు తీవ్రమైన భావోద్వేగాలు కూడా అలాగే అనిపిస్తుంటాయి!

ప్రేమ కాదు.. భ్రమ! రిలేషన్‌షిప్‌లో వీటిని గుర్తించకపోతే నష్టపోతారు!
X

దిశ, ఫీచర్స్ : రిలేషన్‌షిప్‌లో ఆనందంగా ఉండటానికి ప్రేమ చాలా ముఖ్యం. పరస్పరం అర్థం చేసుకోవడంలో, ఆపదల నుంచి బయట పడేయడంలో, సంతోషంగా జీవించడంలో, కలిసి మెలిసి కష్టాలను ఎదుర్కోవడంలో ఇది సహాయపడుతుంది. అయితే కొన్నిసార్లు ప్రేమకు, తాత్కాలిక భావోద్వేగాలకు మధ్య తేడా తెలియకపోవడంతో కొందరు తర్వాత ఇబ్బంది పడుతుంటారు. మానసిక నిపుణులు ప్రకారం.. చాలామంది ప్రేమ, అనుకూలతగా భావించే కొన్ని రిలేషన్‌షిప్ నమూనాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

టెంపరరీ ఎమోషన్స్ ప్రేమ కాదు

ప్రేమ అవసరమే కానీ మీరు ప్రేమగా భావించే ప్రతిదీ ప్రేమకాకపోవచ్చు. అలాంటి వాటిలో తీవ్రమైన భావోద్వేగాలు కూడా ఉన్నాయి. కొందరు ఎదుటి వ్యక్తి ఉన్న పరిస్థితిని చూసి లేదా సందర్భాన్ని బట్టి వెంటనే ఎమోషనల్ అయిపోతుంటారు. ఎక్కడా లేని ప్రేమను చూపుతుంటారు. ఆ క్షణంలో వీరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే.. అవతలి వ్యక్తికి అన్ని విధాలా హెల్ప్ చేసేందుకు సిద్ధపడతారు. ఇది చూసీ వామ్మో నిజంగా ఇంత ప్రేమ ఉందా? అనుకుంటారు ఎవరైనా.. అయితే ఆ సందర్భం అయిపోయాక మాత్రం ఇక పట్టించుకోరు. అంటే ఇది నిజమైన ప్రేమ కాదు. ఎప్పుడూ స్థిరమైన ఆలోచనలు లేకపోవడం, జెలసీ, ఎమోషనల్ డ్రామా లేదా ఓవర్ వెల్మింగ్ ఫీలింగ్స్ ప్యాషనేట్ లవ్ అని భావిస్తారు చాలామంది. కానీ ఇవి ఎమోషనల్‌గా అలసిపోయేలా చేసి, అనారోగ్యకరంగా మారుతాయి. ప్రేమ ఉండాలి. కానీ అంది ఇంత గందరగోళంగా మాత్రం ఉండాల్సిన అవసరం లేదు.

గిఫ్ట్‌లు, సర్‌ప్రైజ్‌లతో..

నిజమైన ప్రేమలో కూడా సైర్‌ప్రైజ్‌లు, సడెన్ ట్విస్టులు ఉంటూ ఉంటాయి. కానీ తరచుగా అవే కొనసాగించడం, మనసులో ప్రేమ లేకపోయినా పైకి ఉన్నట్లు నిరూపించుకునేలా బిహేవ్ చేయడం, సర్‌ప్రైజ్‌లు, గిఫ్ట్‌లు ఇవ్వడం, గ్రాండ్ సెలబ్రేషన్‌లు, ఖరీదైన దుస్తులు కొనడం ఆధారంగా ప్రేమను కొలవడం కొందరు ప్రేమగా భావిస్తుంటారు. కానీ ఇది నిజమైన ప్రేమ కాదు. సినిమాలు, సోషల్ మీడియాల ప్రభావం ఈ భ్రమకు కారణం అవుతున్నదని నిపుణులు అంటున్నారు. నిజమైన ప్రేమ ఎప్పుడూ అతి ప్రదర్శనలు, అతిగా చెప్పుకోవడంపై ఆధారపడదు. మీ గురించి ఎప్పుడో ఒకసారి కాకుండా ఎప్పుడూ కేర్ తీసుకోవడం, నమ్మకంగా ఉండటం, హానెస్ట్ కమ్యూనికేషన్‌లు మాత్రమే సంబంధాన్ని నిలబెట్టగలవు.

వ్యక్తిత్వాన్ని కోల్పోవడం

రిలేషన్‌షిప్‌లో తనను తాను కోల్పోవడం, సంబంధంలో ఉన్నప్పుడు వ్యక్తిగత అవసరాలను ఇగ్నోర్ చేయడం, సాధారణ నైతిక విలువలను మార్చడం లేదా లేదా ఇండివిడ్యువాలిటీని సాక్రిఫైస్ చేయడం మెచ్యూరిటీ లేదా సెల్ఫ్‌లెస్‌నెస్ అని కొందరు భావిస్తారు. కానీ ఇది ఎమోషనల్ డిస్టెన్స్‌కు, అసంతృప్తికి దారితీస్తుంది. ఆరోగ్యకరమైన సంబంధాల్లో వ్యక్తిగత అవసరాలను విస్మరించాల్సిన అవసరం లేదు. మీరు తమను తాము కోల్పోయేలా అవతలి వ్యక్తి మీపై నియంత్రణ ప్రదర్శించడం, మీ ఆసక్తులను, అభిప్రాయాలను పట్టించుకోకపోవడం, అణచివేయడం నిజమైన ప్రమకాదు. పైగా ఇది మిమ్మల్ని మీరు కోల్పోయేలా చేస్తుంది.

నిబంధనలు పెట్టడం

సమాజం, ఫ్యామిలీ లేదా కల్చరల్ రూల్స్‌ను కఠినంగా అనుసరించడం, అనుసరించాలని బలవంతం చేయడం కూడా కొందరు ప్రేమగా భ్రమ పడుతుంటారు. నిజానికి అలా చేయడం వ్యక్తిగత ఆసక్తులను, భావాలను, స్వతంత్రను దెబ్బతీస్తుంది. రిలేషన్‌షిప్‌లో అనుకూలత అంటే అర్థం చేసుకోవడం ద్వారా ఆనందంగా జీవించడం తప్ప, ఐడియల్ మోల్డ్‌లో ఫోర్స్ చేయడం కాదు.

నిజాలు దాచడం

అవతలి వ్యక్తి బాధపడతారనో, ఇబ్బందిగా ఫీల్ అవుతారనో అవసరమైన విషయాలను కూడా చర్చించకుండా ఉండటం కూడా ప్రేమ కాదు. ఇది అనవసరంగా సమస్యలను క్రియేట్ చేయడం లాంటిదే. అలాగే మీ భావోద్వేగాలను సైతం అవతలి వ్యక్తి మేనేజ్ చేయడం, అవసరాలను వారే డిసైడ్ చేయడం కొందరు ప్రేమగా భ్రమపడతారు. కానీ మిమ్మల్ని ఎమోషనల్ డిపెండెన్సీలోకి నెడుతుంది. అన్‌హెల్తీ బౌండరీలను క్రియేట్ చేస్తుంది. అలాగే సంబంధంలో క్లిష్టమైన సమస్యలను అవాయిడ్ చేయడం మంచిది కాదు. చాలామంది రిలేషన్‌షిప్‌లలో కష్టమైన మాటలు లేదా సమస్యలను చర్చించకుండా మానేస్తారు. ఇది మెచ్యూరిటీ లేదా మంచి స్వభావం అని భావిస్తారు. కానీ వాస్తవానికి, ఇది ప్రేమ లేదా అనుకూలతకు సంకేతం కాదు. సమస్యలను ఓపెన్‌గా మాట్లాడకపోతే, మనసులో పేరుకుపోయే కోపం, సంతోషం వంటి భావాలు, అసంతృప్తులు అలాగే ఉండిపోతాయి. దీనివల్ల ఇద్దరి మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ పెరుగుతాయి. ఉదాహరణకు, పార్ట్‌నర్ ఏదైనా తప్పు చేసినా, దాన్ని చెప్పకుండా మౌనంగా ఉండటం వల్ల సమస్య పెద్దదవుతుంది. ఇది సంబంధాన్ని బలహీనపరుస్తుంది.

Next Story