Health : ఉదయం లేవగానే శరీరంలోని ఆ ప్లేస్‌లో నొప్పి..! దేనికి సంకేతమో తెలుసా..?

by Javid Pasha |   (  Updated:2025-07-23 10:12:56  IST  )

Health : ఉదయం లేవగానే శరీరంలోని ఆ ప్లేస్‌లో నొప్పి..! దేనికి సంకేతమో తెలుసా..?

Health : ఉదయం లేవగానే శరీరంలోని ఆ ప్లేస్‌లో నొప్పి..! దేనికి సంకేతమో తెలుసా..?
X

దిశ, ఫీచర్స్ : ఉదయం లేవగానే పొత్తి కడుపులో ఒకవైపు మాత్రమే నొప్పిగా అనిపిస్తోందా? ఇది తరచుగా జరుగుతోందా? అయితే బీకేర్‌ఫుల్. ఎందుకంటే.. మీ మూత్ర పిండాల పనితీరు సరిగ్గా లేదని చెప్పగల లక్షణాల్లో ఇది కూడా ఒకటి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతోపాటు ఉదయం పూట తీవ్రమైన అలసట, నడుము నొప్పి, పక్కటెముకల కింది భాగంలో నొప్పి వంటివి తరచుగా వస్తుంటాయి. ఇంకా ఏయే సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

*మూత్ర పిండాల పనితీరు : మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటనే విషయం తెలిసిందే. ఇవి శరీరంలో చెడు రక్తాన్ని వడబోసి అందులోని వ్యవర్థాలను యూరిన్ ద్వారా బయటకు పంపడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే కిడ్నీల పనితీరు ఏమాత్రం మందగించినా అనారోగ్యాలు సంభవిస్తాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కూడా అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

*తీవ్రమైన నొప్పి : ఉదయంపూట పక్కటెముకలు లేదా వీపు భాగంలో తీవ్రమైన నొప్పి మొదలై అది గజ్జలు లేదా తొడలకు వ్యాపిస్తుంది. అలాగే మధ్య మధ్యలో నొప్పి తీవ్రంగా వచ్చి, కొంత సమయం తగ్గి మళ్లీ రావచ్చు (renal colic).

*యూరిన్‌లో మార్పులు : మూత్రంలో రక్తం (హెమటూరియా) పడటం, రంగు మారడం కూడా కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయనడానికి సంకేతాలు. అలాగే యూరిన్ కలర్ గులాబీ, ఎరుపు లేదా గోధుమ రంగులో కనిపించవచ్చు. దీంతోపాటు దుర్వాసన కూడా వస్తుంది. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం లేదా చాలా తక్కువ పరిమాణంలో మూత్రం రావడం కూడా కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని తెలిపే సంకేతాలే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

*వికారం, వాంతులు : ఉదయం లేవగానే వికారం, వాంతులు రావడం, జలి జ్వరం వచ్చి కాసేపటి తగ్గడం, మళ్లీ రావడం వంటివి కూడా కిడ్నీల పనితీరు మందగించిందని లేదా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని తెలియజేసే ప్రధాన సంకేతాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే కాళ్లు, చీలమండల భాగాలు, ముఖం లేదా చేతులలో తరచుగా వాపు రావడం కూడా కిడ్నీలు సరిగ్గా పనిచేయడం వల్ల సంభవిస్తుంది.

*నివారణ : కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం లేదా వాటి పనితీరు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. తగిన చికిత్స ద్వారా పరిష్కారాన్ని అందిస్తారు. అయితే పరిస్థితి ఇంత వరకు రాకుండా ఉండాలంటే రోజువారి జీవితంలో తగిన జాగ్రత్తలు, నివారణ చర్యలు అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. రోజుకు 2.5-3 లీటర్ల నీరు తప్పక తాగాలి. దీంతో కడ్నీల్లో ఉండే చిన్న చిన్న రాళ్లు మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి. అలాగే ఉప్పు, ఆక్సలేట్ (పాలకూర, బీట్‌రూట్), ప్యూరిన్ (మాంసం, చేపలు) ఎక్కువగా ఉండే ఆహారాలను కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు తక్కువగా తినాలి. జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్‌, ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story