Doctor's advice : సెక్స్ కోరికలు తగ్గాయి.. పెళ్లంటేనే భయమేస్తోంది!

by Javid Pasha |

రెండేళ్ల నుంచి జననాంగంలో రక్త ప్రసరణ సరిగ్గా లేదనిపిస్తున్నది. మునుపటిలా సెక్స్ కోరికలు కూడా లేవు.. ఏం చేయమంటారు?

Doctors advice : సెక్స్ కోరికలు తగ్గాయి.. పెళ్లంటేనే భయమేస్తోంది!
X

ప్రశ్న : డాక్టర్ నా వయసు 27 సంవత్సరాలు. రెండేళ్ల నుంచి చర్మం మీద వెంట్రుకలు పల్చబడిపోతున్నాయి. తల, జననాంగాల నుంచి వెంట్రుకలు రాలిపోతున్నాయి. గొంతువద్ద కొద్దిగా వాపు, పొట్ట ఉబ్బినట్టు ఉంటున్నాయి. లావు కూడా అయ్యాను. ముఖం గుండ్రంగా మారింది. తరచూ తలనొప్పి, ఒళ్లు నొప్పి, ఆయాసం వస్తున్నాయి. కళ్లకింద చర్మం ఎండిపోయి నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి. ఉద్రేకం, చిరాకు కోపం ఎక్కువ అవుతున్నాయి. నీరసంగా అనిపిస్తూ ఒక్కోసారి శక్తి కోల్పోయినట్లు అనిపిస్తున్నది. నన్ను చాలా భయానికి గురిచేస్తున్న అనుమానం ఏమిటంటే.. రెండేళ్ల నుంచి జననాంగంలో రక్త ప్రసరణ సరిగ్గా లేదనిపిస్తున్నది. మునుపటిలా సెక్స్ కోరికలు కూడా లేవు. పెళ్లి చేసుకోవాలంటేనే భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం ఏమిటో సూచించండి? - విశాల్, నల్గొండ

జవాబు : మీరు చెప్పే లక్షణాలన్నీ హైపో థైరాయిడ్ సమస్యను సూచిస్తున్నాయి. కాబట్టి మీరొకసారి ఎండోక్రినాలజిస్ట్‌ని కలవాలి. థైరాయిడ్ ప్రొఫైల్‌తో పాటుగా.. సెక్స్‌ విషయంలో ప్రాబ్లం ఉందంటున్నారు కాబట్టి, మీరు ఆర్.బీ.ఎస్. సి.బీ.పీ.ఎల్. ఎఫ్.టీ రీనల్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, ఆండ్రోజెన్ ప్రొఫైల్ (సెక్స్ హార్మోన్ లెవెల్స్ ) టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. థైరాయిడ్ ప్రొఫైల్‌తో మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందో లేదో తేలిపోతుంది. ఒకవేళ ఉంటే జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ఒకసారి మందులు వాడటం మొదలు పెడితే మీ లక్షణాలు తగ్గుతాయి. ఇక థైరాయిడ్ సమస్యకి, సెక్స్ సమ్యకి సంబంధం ఉంటుంది గనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు ఎండోక్రినాలజిస్ట్‌ని కలిసి, ఆ తర్వాత సెక్స్ సమస్యకు యూరో- ఆండ్రాలజిస్ట్‌ని, సెక్సాలజిస్ట్‌ని కలవండి. వారి సలహాలు, సూచనలు పాటించండి.

డాక్టర్ భారతి

సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ &

సెక్సువల్‌ కౌన్సెలింగ్

86885 19225

Next Story