- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Health Tips : ఎడతెరిపి లేని వానలతో సీజనల్ వ్యాధులు : ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు..
నీటి, ఆహార కాలుష్యాలు వంటివి ఏర్పడటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది.

దిశ, ఫీచర్స్ : ఇటీవల దేశ వ్యాప్తంగా పలుచోట్ల వానలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు, వరదల కారణంగా జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పరిసరాల అపరిశుభ్రత, నీటి, ఆహార కాలుష్యాలు వంటివి ఏర్పడటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొందరు జలుబు, గొంతునొప్పి, అలర్జీలు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరోగ్య నిపుణుల సూచనలేమిటి? ఇప్పుడు చూద్దాం.
వర్షాకాలంలో వచ్చే వ్యాధులు
*టైఫాయిడ్ : కలుషితమైన నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది.
*కలరా : మురుగు నీటితో కలిసిన తాగునీరు తాగడం వల్ల సంక్రమిస్తుంది.
*హెపటైటిస్ A, E : కలుషిత నీరు లేదా ఆహారం ద్వారా వ్యాపిస్తాయి.
*విరేచనాలు (డయేరియా) : బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల కలుషిత నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది.
దోమల వ్యాప్తితో వచ్చే వ్యాధులు
*డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా : కాలనీలు, రోడ్లు, ఇండ్ల ముందు గుంతలు, డ్రమ్ముల్లో నీటి నిల్వతో దోమలు పెరిగి వ్యాధులు వ్యాపిస్తాయి.
*శ్వాసకోశ సంబంధిత వ్యాధులు : వాతావరణంలో తేమ, చల్లని గాలులవల్ల జలుబు, ఫ్లూ, ఆస్తమా తీవ్రతరం కావచ్చు.
*చర్మ వ్యాధులు : తడి వాతావరణం వల్ల ఫంగల్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు వంటివి వస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
*ఫిల్టర్ చేసిన నీటిని లేదా గోరువెచ్చని లేదా కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
*కలుషితమైన నీటిని తాగకుండా జాగ్రత్త పడండి. సురక్షితమైన కాచి వడబోసిన నీటిని లేదా బాటిల్ వాటర్ లేదా RO వాటర్‌ను ఉపయోగించండి
* తాజాగా, శుభ్రంగా ఉన్న ఆహారాలే తీసుకోవాలి. ఉడికీ ఉడకని ఆహారం అస్సలు తినకూడదు.
*బయటి ఆహారం, ముఖ్యంగా రోడ్‌సైడ్ ఫుడ్స్‌ను అవాయిడ్ చేయాలి. పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగి ఉపయోగించాలి.
*నిల్వ నీటివల్ల దోమలు పెరిగి వ్యాధులకు కారణం అవుతాయి. కాబట్టి మీ ఇంటి ముందు, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కుండీలు, టైర్లు, డ్రమ్ముల్లో నీటిని ఖాళీ చేయాలి.
*దోమల బెడద నుంచి తప్పించుకోవడానికి దోమ తెరలు, రిపెల్లెంట్లు ఉపయోగించవచ్చు. చేతులు, కాళ్లు కప్పి ఉంచే దుస్తులను ధరించండి. దీంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి. జలుబు, జ్వరం వంటివి వస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
*గమనిక : పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






