విపరీత కరణి.. అనారోగ్య నివారిణి!

by Javid Pasha |   (  Updated:2025-11-14 11:04:30  IST  )

విపరీ కరణి అంటే నేలపై వెల్లకిలా పడుకుని కాళ్లను నిటారుగా గోడకు ఆనించి పైకి ఎత్తే పోజ్ (Legs-up-the-wall). ఇదొక రిస్టోరేటివ్ యోగాసనం.

విపరీత కరణి.. అనారోగ్య నివారిణి!
X

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎటువంటి ఖర్చులేని, ఇంట్లోనే స్వయంగా చేసుకోగలిగే వ్యాయామాల్లో యోగాసనాలు ఒకటి. వీటిలోనూ పలు రకాలు ఉంటాయి. ఒక్కో రకమైన ఆసనం లేదా భంగిమ ఒక్కో విధమైన హెల్త్ బెనిఫిట్స్ కలిగిస్తుందని నిపుణులు చెబుతారు. అలాంటి వాటిలో విపరీత కరణి(Legs up the wall) కూడా ఒకటి. యోగాలో దీనిని విశ్రాంతి భంగిమ(Resting posture)గా పేర్కొంటారు. వివిధ అనారోగ్యాల నుంచి కాపాడే సర్వరోగ నివారిణిగా ఇది పనిచేస్తుందని కూడా అంటుంటారు. అదెలాగో చూద్దాం.

రక్త ప్రసరణ మెరుగు

విపరీ కరణి అంటే నేలపై వెల్లకిలా పడుకుని కాళ్లను నిటారుగా గోడకు ఆనించి పైకి ఎత్తే పోజ్ (Legs-up-the-wall). ఇదొక రిస్టోరేటివ్ యోగాసనం. చేయడం చాలా సులభం. శరీరాన్ని ‘L’ ఆకారంలో ఉంచి చేసే ఈ ఆసనంవల్ల రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. శరీరానికి విశ్రాంతినిస్తుంది. అంతేకాకుండా కాళ్లను పైకి ఎత్తడం వల్ల రక్తం గుండె వైపు సులభంగా తిరిగి ప్రవహిస్తుంది. దీనివల్ల కాళ్లు, పాదాల్లో ఉబ్బు లేదా వాపు(swelling), అసౌకర్యం తగ్గుతాయి.

స్ట్రెస్ & ఆందోళనలకు చెక్

విపరీత కరణి పోజ్ పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల స్ట్రెస్ హార్మోన్లు తగ్గి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. ప్రశాంతత ఏర్పడి శరీరాన్ని నిద్రకు సిద్ధం చేస్తుంది. నిద్ర లేమి సమస్యలు ఉన్నవారికి ఎంతో ఉపయోగకరం.

వెరికోస్ వీన్స్‌కు ఉపశమనం

ఎక్కువ సమయం నిలబడి పనిచేసేవారు, గర్భిణులు, వేరికోస్ వెయిన్స్ ఉన్నవారికి విపరీత కరణి పోజ్ వ్యాయామం ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ఇది పాదాల్లో అదనపు ద్రవం(excess fluid)ను డ్రెయిన్ చేసి నరాల వాపును తగ్గిస్తుంది.

పీరిడ్ పెయిన్ నుంచి రిలీఫ్

కొన్ని అధ్యయనాల ప్రకారం.. విపరీత కరణి పోజ్ అనేది పెల్విక్ ఏరియాలో రక్త ప్రవాహాన్ని మెరుగు పరచడం వల్ల వల్ల పీరియడ్ నొప్పి (menstrual cramps) నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే లోయర్ బ్యాక్ పెయిన్, కండరాల నొప్పి, టెన్షన్స్ తగ్గుతాయి. అంతేకాకుండా మెరుగైన రక్త ప్రసరణ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.

ఎలా చేయాలి?

గోడ పక్కన నేలపై వెల్లకిలా పడుకోండి. కాళ్లను నిటారుగా గోడకు ఆనించి పైకి ఎత్తండి. శరీరం ‘L’ ఆకారంలో ఉండేలా సర్దుకోండి. చేతులు పక్కన ఉంచి, కళ్లు మూసుకుని డీప్ బ్రీత్ తీసుకోండి. 5 నుండి 15 నిమిషాల వరకు అలాగే ఉండండి. విపరీత కరణి యోగా అయిపోయినట్టే.

ఎవరు చేయవచ్చు?

గర్భిణులు, అథ్లెట్లు, వృద్ధులు, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ చేయవచ్చు. కానీ గ్లాకోమా, హై బ్లడ్ ప్రెజర్ (అన్‌కంట్రోల్డ్), గర్భ ధారణ మొదటి త్రైమాసికంలో ఉన్న స్త్రీలు మాత్రం డాక్టర్ సలహా తీసుకోవాలి.

విపరీత కరణి ఒక సరళమైన, శక్తివంతమైన యోగా పోజ్. ఇది రక్త ప్రసరణ, విశ్రాంతి, నిద్ర, జీర్ణం, మెన్స్ట్రువల్ హెల్త్, వెన్ను ఆరోగ్యం.. అన్నింటినీ మెరుగుపరుస్తుంది. రోజూ 10 నిమిషాలు చేస్తే శరీరం-మనసు రెండూ తేలికగా ఉంటాయి. Link

Next Story