వృత్తి నటన.. ప్రవృత్తి రచన.. ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీల కలం నుంచి జాలు వారిన రచనలివే..

by Javid Pasha |

వృత్తి నటన.. ప్రవృత్తి రచన.. ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీల కలం నుంచి జాలు వారిన రచనలివే..

వృత్తి నటన.. ప్రవృత్తి రచన..  ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీల కలం నుంచి జాలు వారిన రచనలివే..
X

దిశ, ఫీచర్స్ : ఆలోచించి చూడు పరిష్కారం దొరుకుతుంది అంటారు పెద్దలు. మానవ జీవితంలోని అనేక సందర్భాల్లో ఇది వర్తిస్తుంది. ఆసక్తి ఉండాలే గానీ.. అనుకున్నది సాధించడానికి మార్గాలు మస్తు దొరుకుతాయి. లక్ష్యం ఉండాలే గానీ.. వృత్తి ఏదైనా ప్రవృత్తిలోనూ రాణించవచ్చు. అదే నిరూపించారు ప్రముఖ సెలబ్రిటీలు కొందరు. ఎప్పుడూ ఆడిషన్లు, షూటింగ్‌లు, మీటింగ్‌లతో కూడిన బిజీ లైఫ్‌లో సైతం స్ఫూర్తినిచ్చే రచనలోనూ రాటుదేలారు. లక్ష్యాన్ని అధిగమించి అదరహో అనిపించారు. ఇంతకీ వారెవరు? ఎలాంటి రచనలు చేశారో ఇప్పుడు చూద్దాం.

ప్రియాంక చోప్రా : Unfinished

బాలీవుడ్ బ్యూటీ, ప్రపంచం మెచ్చిన సెలబ్రిటీ ప్రియాంక చోప్రా గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆమె తన ఆత్మకథను ‘అన్‌ఫినిష్డ్‌(Unfinished)’ అనే పుస్తకంగా రాశారు. ఒక చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన తాను సెలబ్రిటీగా, నటిగా ఎదిగిన తీరును ఇందులో పొందుపరిచారు. జీవితంలోని సవాళ్లను, సక్సెస్‌లను, నేర్చుకున్న గుణపాఠాలను ఆసక్తిదాయకంగా మలిచారు. అడ్డంకులను అధిగమించి కలలను ఎలా సాకారం చేసుకోవాలో వెల్లడించారు. మొత్తానికి ‘Unfinished’ ఈ తరానికి స్ఫూర్తిని, ప్రేరణను అందిస్తుంది. ప్రియాంక చోప్రా నిజాయితీకి, ధైర్యానికి అద్దం పడుతుంది.

అలియా భట్: Ed Finds a Home

నటనలో అభిమానులను అలరించే అలియా భట్ తన తొలి పుస్తకం ఎడ్ ఫైండ్స్ ఎ హోమ్ (Ed Finds a Home)తో పిల్లలకు సంబంధించిన సాహిత్యంలోకి అడుగు పెట్టారు. అందులోని ప్రధాన కథ పేరు కూడా అదే. ఈ హార్ట్ టచింగ్ స్టోరీ ఒక చిన్న తిరుగుబాటు కుక్కపిల్ల( small rebellion) ఎడ్ చుట్టూ తిరుగుతుంది. ఇది లవ్, ఫ్రెండ్‌షిప్, అలాగే ప్రపంచంలో తన స్థానాన్ని కనుగొనడం గురించి పిల్లలకు బోధిస్తుంది. అందమైన ఇలస్ట్రేషన్లతో ఈ పుస్తకం పిల్లల పుస్తకాల షెల్ఫ్‌కే అదనపు ఆకర్షణీయంగా నిలుస్తుంది.

3. కరణ్ జోహార్ : Unsuitable Boy

ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రైటర్, కాస్ట్యూం డిజైనర్, టెలివిజన్ ప్రముఖుడు అయినా కరణ్ జోహార్ అందరికీ సుపరిచితమే. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కుచ్ కుచ్ హోతా హై సినిమాతో దర్శకునిగా ఎంట్రీ ఇచ్చి ఒక్కో అడుగు ఎదుగుతూ వచ్చాడు. అయితే ఆయన తన ఆత్మకథను అన్‌సూటబుల్ బాయ్(Unsuitable Boy) పేరుతో పుస్తకంగా రాశారు. సినీ పరిశ్రమలో తన జీవన పయనం గురించి అనేక విషయాలపై నిర్మొహమాటంగా వివరించారు. అంతేకాకుండా తన పర్సనల్ స్టోరీస్, సంబంధాలు, ఎదుర్కొన్న సవాళ్లు, సక్సెస్ వంటి అంశాల గురించి ఆసక్తికరంగా వివరించారు.

4. కరీనా కపూర్ : Kareena Kapoor Khan, Pregnancy Bible

అందాల భామ కరీనాకపూర్ ఖాన్ నటనలో బిజీగా ఉన్నప్పటికీ.. తన గర్భధారణ అనుభవాలను కరీనా కపూర్ ఖాన్ ప్రెగ్నెన్సీ బైబిల్ (Kareena Kapoor Khan, Pregnancy Bible) పేరుతో పుస్తకంగా రాశారు. ఇది గర్భిణులకు ఆరోగ్యకరమైన సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని మంచి సలహాలను అందిస్తుంది. కొత్త తల్లులకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ప్రెగ్నెన్సీ జర్నీలో సపోర్ట్ కోరుకునేవారు తప్పక చదవాల్సిన పుస్తకమిది.

5. హుమా ఖరేషి : Things We Don't Tell the People We Love

2012లో గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ మూవీతో సినీ అరంగ్రేటం చేసిన హుమా ఖురేషి హిందీతోపాటు తమిళ్, మరాఠీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె రచించిన ‘Things We Don't Tell the People We Love’ పుస్తకం ప్రేమ, సంబంధాలు, మనకు సన్నిహితులైన వ్యక్తులు దాచే రహస్యాలను అన్వేషించే హార్ట్ టచింగ్ వ్యాసాల సమాహారం. అందులో ఆమె భావోద్వేగపరమైన వర్ణనలు మానవులు నిజజీవితంలోని ఒడిదుడుకులకు అద్దం పడతాయి. పాఠకుల హృదయాలను హత్తుకుంటాయి. ఆలోచింపజేస్తాయి.

6. అనుపమ్ ఖేర్ : Your Best Day is Today

అనుపమ్ ఖేర్ రాసిన ప్రేరణాత్మక పుస్తకం పేరు ‘యువర్ బెస్ట్ డే ఈజ్ టుడే’ పాఠకులను ఆకట్టుకోవడమే కాకుండా వారిలో ఆత్మ విశ్వాసం నింపుతుంది. తమ బలహీనతలను అధిగమించే మార్గం చూపి, తమ బలాలను కనుగొనమని ప్రోత్సహిస్తుంది. ఈ పుస్తకం భిన్న కథనాలు, అంతర్దృష్టులతో (Full of insights) నిండి ఉంది. స్వీయ అంగీకారం(Self-acceptance), ఆత్మగౌరవంగా నడుచుకోవడమే అసలై సంతోషమని, అదే నిజమైన సక్సెస్‌అని గుర్తు చేస్తుంది.

7. ఆయుష్మాన్ ఖురానా : Cracking the Code

బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా తన పుస్తకం క్రాసింగ్ ది కోడ్ (Cracking the Code)లో తన నటనా జీవిత ప్రయాణాన్ని అలవోకగా, ఆసక్తికరంగా, సృజనాత్మకంగా చెప్పుకొచ్చారు. ఒక్కో కథనం పాఠకుడిని ఆకట్టుకోవడమే కాకుండా జీవిత సత్యాలను, సందేశాలను బోధిస్తుంది. అభిరుచిని, వృత్తిని కొనసాగించడంలో భయం లేకుండా ముందుకు సాగమని ప్రోత్సహిస్తుంది.

Next Story