- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్ : చాలా మంది డయాబెటిస్ బాధితులు దానిని అదుపులో ఉంచుకోవడానికి ఏం తినాలనే దానిపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. ఇది అవసరమే.. కానీ భోజనం తర్వాత ఏం చేస్తాయాలనేది కూడా చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తిన్న తర్వాత అనుసరించే సులభమైన మూడు పద్ధతుల ద్వారా డయాబెటిస్‌ను కంట్రోల్లో పెట్టుకోవచ్చునని చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
1. కాలికొనవేళ్లపై నిలబడి..
భోజనం చేసిన వెంటనే 10 నిమిషాల పాటు అరికాళ్ల వేళ్లపై నిలబడటం(Calf Raises) చేయడంవల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరకుండా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పిక్క కండరాలు (Calf muscles - hind legs), పెద్ద కండరాలు కావడంతో, అవి రక్తం నుంచి గ్లూకోజ్‌ను నేరుగా గ్రహించి ఇంధనంగా ఉపయోగిస్తాయి. అధ్యయనాల ప్రకారం.. ఇలా చేస్తే గ్లూకోజ్ పెరుగుదల 52% వరకు తగ్గవచ్చు. పైగా ఇది చాలా సులభం కూడాను. నిలబడి కాళ్ల వేళ్లపై.. పైకి లేచి, నెమ్మదిగా కిందికి రావడం అనేది ఇంట్లో, ఆఫీసులో ఎక్కడున్నా చేయవచ్చు. దీనికోసం ప్రత్యేకించి ఎటువంటి సామగ్రి అవసరం లేదు. పైగా ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తుంది.
2. తిన్న 10 నిమిషాల తర్వాత..
మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేశాక 10 నుంచి 15 నిమిషాల తర్వాత తేలికగా నడవడం గ్లూకోజ్ నియంత్రణకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. నడక సమయంలో కండరాలు ఎక్కువ గ్లూకోజ్‌ను గ్రహిస్తాయి. ఇన్సులిన్ మరింత సమర్థవంతంగా పని చేసేలా చేస్తాయి. పరిశోధనలు చెబుతున్నట్టు ఇలా నడిస్తే రక్తంలో గ్లూకోజ్ స్థాయి 30% వరకు తగ్గుతుంది. అంతేకాకుండా ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహారం తిన్నవెంటనే వచ్చే వికారం, కడుపునొప్పి, ఇతర ఇబ్బందులు వంటివి తగ్గుతాయి.
3. మీల్స్‌కి ముందు ఇలా..
భోజనానికి ముందు ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వినెగర్‌ను కలిపి తాగడం వల్ల కార్బోహైడ్రేట్లు రక్తంలోకి వేగంగా చేరకుండా నెమ్మదిస్తుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను ఆలస్యం చేసి, గ్లూకోజ్ స్పైక్‌ను 30% వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే వినెగర్‌లో ఉండే ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. కాబట్టి దీనిని భోజనానికి 10-15 నిమిషాల ముందు తీసుకోవాలి. ఈ మూడు పద్ధతులు కలిపి ఉపయోగిస్తే మరింత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుది. అయితే ప్రతీ వ్యక్తి శరీరం వేర్వేరుగా స్పందించవచ్చు కాబట్టి, డాక్టర్ సలహాతో మాత్రమే ప్రయత్నించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






