- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎరుపు రంగు పండ్లల్లో పోషకాలు ఫుల్.. శీతాకాలంలో తింటే మీ గుండె సేఫ్!
సీజనల్ ప్రాబ్లమ్స్ నివారించడంలో కొన్ని రెడ్ కలర్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గుండెకు బలాన్నిస్తాయి.

దిశ, ఫీచర్స్: చలికాలంలో పొడి వాతావరణం వల్ల కొన్నిసార్లు రోగాల బారిన పడే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా గొంతు, జలుబు, దగ్గు, శ్వాసకోశ వంటి సమస్యలు వస్తుంటాయి. దీంతో పాటుగా గుండె ఒత్తిడి పెరగడంవల్ల ఇబ్బందులు తలెత్తుంటాయి. ఇతర సీజన్లతో పోలిస్తే చలికాలంలో గుండెపోటు రేటు 53 శాతానికి పెరుగుతుందని బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ అధ్యయనం కూడా పేర్కొంటున్నది. అయితే ఇలాంటి సీజనల్ ప్రాబ్లమ్స్ నివారించడంలో కొన్ని రెడ్ కలర్ ఫుడ్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. అవేంటో చూద్దాం.
*దానిమ్మ: దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, ధమనుల్లో బ్లాక్స్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో ఉంచుతుంది.
*క్రాన్ బెర్రీస్ :క్రాన్ బెర్రీస్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఎన్నో సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సీడెంట్, శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.
*రెడ్ యాపిల్: రెడ్ యాపిల్‌లో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారు ప్రతి రోజూ 2 యాపిల్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ 50 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సీడెంట్లుగా పనిచేసే ఫ్లేవనాయిడ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
*దుంపలు:దుంపల్లో విటమిన్లు, యాంటీ ఆక్సీడెంట్లు, మినరల్స్, నైట్రేట్లు వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె కండరాలను బలోపేతం చేయడంలో ఉపయోగపడతాయి.
*రెడ్ క్యాబేజీ:చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. గుండె నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్ - సి, కె, యాంటీ ఆక్సీడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను అదుపు చేయడంలో సహాయపడతాయి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులనుు సంప్రదించగలరు.






