- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మాయిలకు బ్రదర్ ఎందుకు ముఖ్యం..? షాకింగ్ అధ్యయనం!
అమ్మాయిలకు బ్రదర్ ఎందుకు ముఖ్యం..? షాకింగ్ అధ్యయనం!

నిరాశ నిన్ను ఆవహించినప్పుడు
ఆశల హరివిల్లయి వికసిస్తాడు..
ఒంటరివై కంటతడి పెడుతున్నప్పుడు
నేనున్నాను అని భుజం తడతాడు
సమస్యల సుడిగుండాల్లో చిక్కుకున్నప్పుడు
పరిష్కారమార్గమై ధైర్యం నింపుతాడు..
అతడే బ్రదర్ అంటే..
దిశ, ఫీచర్స్
*అమ్మాయిలు లేదా మహిళలు సోదరులను కలిగి ఉండటం వల్ల జీవితంలో చాలా సంతోషంగా, ధైర్యంగా ఉంటారని పరిశోధకులు అంటున్నారు. అంతేకాదు బ్రదర్స్ కలిగి ఉన్న అమ్మాయిల్లో ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం, స్వీయ స్పృహ, ఇతరులపై జాలి, దయ కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. వీరు ఇతరులపై అసూయ భావాన్ని కలిగి ఉండరు అని, ప్రతీ విషయంలో నెగెటివ్‌గా జడ్జ్ చేయరని వెల్లడించారు. సోదరులు కలిగి ఉండటం అనేది అమ్మాయిల్లో చిన్నప్పటి నుంచే ఎక్కువ సామాజిక నైపుణ్యాలు కలిగి ఉండటానికి దోహదం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
*సోదరులు కలిగి ఉండటం అమ్మాయిల మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని కూడా అధ్యయనం పేర్కొన్నది. యవ్వనంలో మాసిక ఒత్తిళ్లు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు బ్రదర్స్‌ను చూసి సిస్టర్స్ ధైర్యంగా ఉంటారట. దీంతో వారిలో ఒంటరితనం, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాదు సోదరులతో కలిసి మెలిసి ఉండటం, వారితో కలిసి ఆడుకోవడం అమ్మాయిల్లో సామాజిక నైపుణ్యాలను మెరుగు పరుస్తుంది. ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. భావోద్వేగ స్థిరత్వం, స్వీయ అవగాహన, విశ్వాసం వంటివి పెంపొందుతాయి.
*జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ సైకాలజీ స్టడీ ప్రకారం కూడా బ్రదర్స్ కలిగి ఉన్న అమ్మాయిలు తమ జీవితంలో స్ట్రెస్ అండ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్‌ను మేనేజ్ చేయడంలో మెరుగైన సామర్థ్యం కలిగి ఉంటున్నారు. సోదరులు ఒక రకమైన ఎమోషనల్ సపోర్ట్ సిస్టమ్‌గా తమ అమ్మాయిలకు సపోర్టుగా నిలుస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో అమ్మాయిలను తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడంలో ధైర్యంగా ఉంటారు.
*సోదరులను కలిగి ఉండటం అమ్మాయిల్లో తమకంటూ ఓ రక్షణ ఉందనే భావన ఏర్పడుతుందట. ఇది కుటుంబంలోనే కాకుండా బయటి ప్రపంచంలో కూడా వారు ధైర్యంగా ఉండటానికి దోహదం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బాహ్య ఒత్తిడులు ఎదుర్కోవడంలో, ఆపదల నుంచి గట్టెక్కడంతో సోదరులు కలిగి ఉన్న అమ్మాయిలు ఎక్కువ ధైర్యంతో ముందడుగు వేస్తారు.
*సమాజంలో ఇతర అబ్బాయిలను అంచనా వేయడంలో, అర్థం చేసుకోవడంలో సోదరులు కలిగి ఉన్న అమ్మాయిలు చక్కటి అవగాహనను, జెండర్ ఈక్వాలిటీ దృక్పథాన్ని కలిగి ఉంటారు. సోదరులు కలిగిన ఉండటం అమ్మాయిల వ్యక్తిత్వ వికాసానికి, సానుకూల దృక్పథం ఏర్పడటానికి ముఖ్య కారణం అవుతుంది. సమాజంలో సమానత్వం కోసం పోరాడేందుకు ధైర్యాన్ని ఇస్తుంది. వ్యక్తిగత అభివృద్ధిలో, ఒత్తిడి నిర్వహణలో సోదరులతో ఉన్న అనుబంధం కీ రోల్ పోషిస్తుంది. అందుకే ప్రతీ అమ్మాయి తనకంటూ ఓ బ్రదర్ ఉండాలని కోరుకుంటుందని అంటున్నారు నిపుణులు.






