ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన బీచ్‌లు.. కానీ.. మహిళలకు మాత్రమే!

by Javid Pasha |   (  Updated:2026-04-19 07:49:17  IST  )

అక్కడ పురుషుల ప్రవేశం పూర్తిగా నిషేధం. కేవలం మహిళలనే అనుమతిస్తారు. లగ్జరీ, వెల్‌నెస్ రిట్రీట్‌గానూ అవి ప్రత్యేతక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన బీచ్‌లు.. కానీ.. మహిళలకు మాత్రమే!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా వివిధ పర్యాటక ప్రాంతాల్లోని సముద్ర తీరాలను చూడటానికి అందరూ ఇష్టపడుతుంటారు. టూరిస్టులను అలరింజేసే అలాంటి అందమైన బీచ్‌‌లు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. కానీ కేవలం మహిళలను మాత్రమే అనుమతించే అత్యంత రిలాక్స్‌డ్‌గా ఉండే బీచ్‌లు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ఇక్కడ పురుషుల ప్రవేశం పూర్తిగా నిషేధం. కేవలం స్త్రీలను మాత్రమే అనుమతిస్తారు. మహిళల సేఫ్టీ, ప్రైవసీ, స్వేచ్ఛను అందించాలనే ఉద్దేశంతోనే వీటిని ఏర్పాటు చేశారు. ఇంతకీ అవెక్కడ ఉన్నాయి? వాటి ప్రత్యేకతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

లా ఫెమ్ బీచ్, ఈజిప్ట్

లా ఫెమ్ బీచ్ ఈజిప్ట్ ఉత్తర తీరంలోని మెరీనా-5 రిసారర్ట్‌లో ఉంది. అలెగ్జాండ్రియా నుంచి సుమార 100 కి.మీ దూరంలో ఉన్న ఈ బీచ్ పూర్తిగా మహిళలకు మాత్రమే. పురుషులకు ప్రవేశం లేదు. అయితే 8 ఏళ్లలోపు అబ్బాయిలను మహిళలు తమ వెంట తీసుకెళ్లవచ్చు. సుమారు 120 నుంచి 800 మీటర్లు సుదీర్ఘమైన ఇసుక తీరం, సన్‌బెడ్స్, మ్యూజిక్, జుంబా, బెల్లీ డాన్స్, యోగా వంటి ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇక మహిళలు హిజాబ్ తీసేసి బికినీ లేదా స్విమ్ సూట్ వేసుకొని స్వేచ్ఛగా ఈత కొట్టవచ్చు. ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా స్ట్రిక్ట్‌. లోపలికి వెళ్లే ముందు బ్యాగ్‌లు చెక్ చేసి కెమెరాలు ఉంటే సీజ్ చేస్తారు. అక్కడ ఉండే సెక్యూరిటీ, నిర్వాహకులు అందరూ స్త్రీలే.

సరిసు లేడీస్ బీచ్, టర్కీ

అంటాల్యా కోన్యాల్టి జిల్లాలోని ఈ బీచ్‌ను అంటాల్యా మెట్రోపాలిటన్ మున్సిపాలిటీ నడుపుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు పూర్తిగా మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఆ తర్వాత మిక్స్ అవుతుంది. ఇక్కడి లైఫ్ గార్డులు, సెక్యూరిటీ, రెస్టారెంట్ స్టాఫ్ అందరూ మహిళలే ఉంటారు. మీట్ రెస్టారెంట్లు, పేస్ట్రీ షాపులు, హెయిర్ సెలూన్, స్పా, టర్కిష్ బాత్, మార్కెట్లు, బౌటిక్స్, స్పోర్ట్స్ ఫీల్డ్స్, పిల్లల ప్లే ఏరియాలు ఉన్నాయి. మహిళలు ఎలాంటి ఆందోళన లేకుండా సమయం గడపవచ్చు.

సూపర్‌షీ ఐలాండ్, ఫిన్‌లాండ్

బాల్టిక్ సముద్రంలో రేస్‌బర్గ్ సమీపంలో ఉన్న 8.4 ఎకరాల ప్రైవేట్ ద్వీపం పేరే సూపర్‌షీ ఐలాండ్. ఇక్కడ పురుషుల ప్రవేశం పూర్తిగా నిషేధం. కేవలం మహిళలనే అనుమతిస్తారు. లగ్జరీ వెల్‌నెస్ రిట్రీట్‌గా దీనిని రూపొందించారు. యోగా, మెడిటేషన్, కయాకింగ్, హైకింగ్, ఫిన్నిష్ సౌనా, ఫార్మ్-టు- టేబుల్ భోజనాలు ఉంటాయి. అయితే ముందుగా అప్లికేషన్+ఇంటర్వ్యూ ప్రాసెస్ తర్వాతనే అనుమతి ఉంటుంది. ఈ ద్వీపాన్ని బయటి ప్రపంచ ఒత్తిడి నుంచి పూర్తి డిటాక్స్ కోసం ఏర్పాటు కేటాయించారు.

గోవా వుమెన-ఓన్లీ స్విమ్మింగ్ జోన్స్, ఇండియా

గోవా ప్రముఖ బీచ్‌లైన అరంబోల్, బాగా, కోల్వా, కలంగుట్ వంటి చోట్ల డ్రిష్టి మెరైన్ 2025లో ప్రారంభించిన ప్రత్యేక స్విమ్మింగ్ జోన్లు ఉన్నాయి. ఇవి పూర్తి బీచ్‌లు కాదు. అయితే బీచ్‌లలో ఒక భాగం మాత్రమే ప్రత్యేకంగా మహిళలకే కేటాయించారు. హరాస్‌మెంట్స్(Harassment), క్యాట్ కాలింగ్ వంటి సమస్యలు పెరిగినందున ఇలా ఏర్పాటు చేశారని చెబుతారు. సోలో ఫిమేల్ ట్రావెలర్లు ఇక్కడి స్విమ్మింగ్ జోన్లపై ఆసక్తి చూపుతుంటారు.

అల్ మమ్జర్ కార్నిష్, దుబాయ్

అల్ మమ్జర్ కార్నిష్ అనేది దుబాయ్‌లో మొదటి పబ్లిక్ వుమెన్-ఓన్లీ బీచ్. చుట్టూ ఫెన్స్ కలిగి ఉంటుంది. ఇక్కడ కూడా పురుషుల ప్రవేశం పూర్తిగా నిషేధం. మహిళలను మాత్రమే అనుమతిస్తారు. నిర్వాహకులు, సెక్యూరిటీ అంతా మహిళలే. నైట్ స్విమ్మింగ్, మార్నింగ్ యోగా, సన్‌సెట్ వాక్స్, ఫిట్‌నెస్ సెషన్లు ఉంటాయి. మహిళలు స్వేచ్ఛగా విహరించేందుకు ఇది ఎంతో అనుకూలం.

Next Story