- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Socks cleaning tips : సాక్స్‌పై బురద మరకలా? ఈజీగా తొలగిపోయే చిట్కాలివిగో.. !
Socks cleaning tips : సాక్స్‌పై బురద మరకలా? ఈజీగా తొలగిపోయే చిట్కాలివిగో.. !

దిశ, ఫీచర్స్ : అసలే బిజీ లైఫ్.. నగర జీవితంలో ప్రతిరోజూ సాక్స్ ఉతుక్కునే టైమ్ ఉండకపోవచ్చు. అయితే రోజు మొత్తం షూ ధరించి ఉండటం వల్ల, నడుస్తు్న్నప్పుడు దుమ్మూ ధూళి, బురద వంటివి పడటంవల్ల సాక్స్‌పై మరకలు పడుతుంటాయి. దీంతో కొందరు నెలకోసారి కొత్త సాక్స్ కొనుగోలు చేస్తుంటారు. ఇలా చేస్తే ప్రతినెలా ఒక చిన్న అదనపు ఖర్చు పెరిగినట్లే. అలా జరగకూడదంటే.. ప్రతిరోజూ సాక్స్ పరిశుభ్రంగా ఉండాలి. అయితే వాటిపై బురద మరకలు ఈజీగా తొలగిపోవాలంటే ఏం చేయాలో చూద్దాం.
* సాక్స్‌పై బురద మరకలే కాదు, ఏ మరకలైనా సరే.. ఈజీగా వదిలిపోవాలంటే సాక్సును వేడి నీళ్లు, బేకింగ్ సోడాతో శుభ్రం చేస్తే చేస్తే చాలు. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. వేడి నీటిలో బేకింగ్ సోడా వేసి అందులో సాక్సులను కాసేపు నానబెట్టాలి. ఆ తర్వాత నీటితో కడగాలి.
* బ్లీచింగ్ పౌడర్ కూడా బురద మరకలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఒక చిన్న బకెట్ లేదా టబ్‌లో వేడినీళ్లు తీసుకొని, అందులో బ్లీచింగ్ పౌడర్ వేసి మరకలు పడిన భాగాన్ని ముంచి అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత నీటితో ఎప్పటిలాగే కడిగేస్తే చాలు. మరకలు నిమిషాల్లో మాయం.
* ఆల్కహాల్ కూడా బురద మరకలను పోగొట్టడంలో ఉపయోగపడుతుంది. ఒక మగ్గులో నీటిని తీసుకొని, కొంచెం ఆల్కహాల్, అలాగే నిమ్మకాయ రసం మిక్స్ చేసి, ఆ మిశ్రమంలో సాక్స్‌ను నానబెట్టాలి. కాసేపటి తర్వాత తీసి సాధారణంగా ఉతకాలి. ఎంతటి మొండి మరకలైనా ఇట్టే వదిలిపోతాయి.






