Doctor's Advice : కాపురంలో గొడవలతో ఇద్దరిమధ్య దూరం..! ఏం చేయమంటారు?

by Javid Pasha |

కుటుంబ భారం, బాధ్యతలు, పిల్లల పెంపకం, ఉద్యోగంలో పని భారం, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ రీత్యా దూరంగా ఉండాల్సి రావడం వంటివి కూడా భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతాయి.

Doctors Advice : కాపురంలో గొడవలతో ఇద్దరిమధ్య దూరం..! ఏం చేయమంటారు?
X

ప్రశ్న : మేడం నాకు పెళ్లయి రెండేళ్లయింది. కానీ ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది కానీ గొడవల మూలంగా దూరమవుతున్నాం. మా మధ్య సాన్నిహిత్యం పెరగాలంటే ఏం చేయాలి? వి.కె. రంగనాథం. కాకినాడ.

జవాబు : వివాహం తర్వాత దంపతుల మధ్య చాలా రకాల కారణాలవల్ల దూరాలు పెరుగుతాయి. కుటుంబ భారం, బాధ్యతలు, పిల్లల పెంపకం, ఉద్యోగంలో పని భారం, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ రీత్యా దూరంగా ఉండాల్సి రావడం వంటివి కూడా భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతాయి. దీంతో సెక్స్ లైఫ్ కూడా దూరం అవుతుంది. ఈ సమస్య నుంచి బయట పడటానికి ఒక చక్కటి మార్గం ఉంది. అదే ‘7- 7-7 రూల్’ అంటే.. ప్రతీ 7 రోజులకొకసారి కలిసి బయటికి వెళ్లడం, 7 వారాలకు ఒకసారి రాత్రిపూట కలిసి ఉండేలా ప్లాన్ చేసుకోవడం, 7 నెలలకొకసారి రొమాంటిక్ హాలిడే టూర్‌ని ప్లాన్ చేసుకోవడం. దీన్నే ‘ట్రిపుల్ సెవెన్ రూల్’ అంటారు. ప్లాన్ చేసుకోవాల్సిన రోజులను, తేదీలను కూడా కలిసి నిర్ణయించుకోవాలి. దీనిని ఫాలో అవడంవల్ల దంపతులిద్దరూ తమ మధ్య దూరంగా ఉండటంవల్ల తలెత్తే సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకరితో ఒకరు గాఢంగా కనెక్ట్ అవుతారు. భావోద్వేగ పరంగానూ దగ్గరవుతారు. దంపతుల మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది. ప్రతీ ఏడాది ఈ మూడు పద్ధతులలో కలిసి గడపడమనేది దంపతుల మధ్య దూరాల్ని పెంచే అనేక చిక్కుముళ్లను విప్పుతుంది. మొత్తానికి ట్రిపుల్ సెవెన్ సూత్రం పాటించడంవలన ఒకరి అవసరాలు ఒకరు తెలుసుకుంటూ, తీర్చుకుంటూ ఉండటంవల్ల రొమాంటిక్ సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆందోళన, ఒంటరితనం, ఒత్తిళ్లు దూరమై ఆనందంగా ఉంటారు.

డాక్టర్ భారతి

సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ &

సెక్సువల్‌ కౌన్సెలింగ్

86885 19225

Next Story