Snake bite : వామ్మో పాములు..! ఇండ్లలోకి రాకూడదంటే ఏం చేయాలో తెలుసా?

by Javid Pasha |   (  Updated:2025-05-24 13:10:02  IST  )

Snake bite : వామ్మో పాములు..! ఇండ్లలోకి రాకూడదంటే ఏం చేయాలో తెలుసా?

Snake bite : వామ్మో పాములు..! ఇండ్లలోకి రాకూడదంటే ఏం చేయాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : వర్షాకాలం.. ఇది పాముల సంచారానికి అనువైన సీజన్ కూడా.. చెట్లు, పొదలు వంటి గుబురు ప్రదేశాల్లో, జన సంచారం తక్కువ ఉన్నచోట్ల తిరుగుతుంటాయి. పాములు కోల్డ్-బ్లడెడ్ జీవులు’ కాబట్టి కూల్ వెదర్‌లో తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి వెచ్చని ప్రదేశాలను వెతుకుతుంటాయి. ఈ క్రమంలో గ్రామాలు, అటవీ ప్రాంతాల సమీపంలోని నివాసాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పాముల బెడద నుంచి రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

ఇలా చేయండి

* ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త, పొదలు, పాత సామాన్ల నిల్వలను తొలగించి, ఎలుకల సంచారాన్ని అరికట్టాలి.

*పాములు సంచారానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లోని వారు వీలైనంత వరకు రాత్రిపూట, సాయంకాలం తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. అలాగే గోడలకు బీటలు, గ్యాప్‌లు, ఇంటి చుట్టు పక్కల మట్టిలో రంధ్రాలు వంటివి ఉంటే మూసివేయాలి.

*పాములకు సహజ వికర్షకాలుగా పనిచేసే నాఫ్తలీన్, వెనిగర్, ఎర్ర మిరియాలు, నిమ్మరసం, వెల్లుల్లి, లవంగాలు లేదా కాక్టస్ వంటి మొక్కలను ఇంటి చుట్టూ ఉంచడం వల్ల కూడా పాములు ఇండ్లల్లోకి రాకుండా ఉంటాయి.

* రాత్రిపూట టార్చ్‌లైట్ వాడటం, పెద్ద శబ్దాలు చేయడం వల్ల కూడా పాములు భయపడి పారిపోతాయి.

కాటు వేస్తే ఏం చేయాలి.. ?

* తక్షణ చికిత్స: పాము కాటు వేసిన వెంటనే ఆందోళన చెందకుండా, కాటు వేసిన ప్రాంతాన్ని కదలకుండా ఉంచి, గుండె వైపు విషం వెళ్లకుండా తాడుతో కట్టి, సమీప ఆస్పత్రికి వెళ్లాలి.

*నాటు వైద్యం వద్దు : నోటితో విషం పీల్చడం, మంత్రాలు పటించడం వంటివి చేయకూడదు. బదులుగా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి.

*విషం గుర్తింపు : పాము కరిచిన చోట రెండు కంటే ఎక్కువ గాట్లు ఉంటే విషం లేని పాము కావచ్చు. కానీ వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

*స్నేక్ క్యాచర్స్: ఇంట్లో పాము కనిపిస్తే, హడావుడి చేయకుండా స్నేక్ క్యాచర్స్‌కు కాల్ చేయాలి. ముందుగానే వారి నంబర్లు సేకరించి పెట్టుకోవడం ఉత్తమం.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. మరిన్ని వివరాలు అవసరం అనుకుంటే నిపుణులను సంప్రదించండి.

Next Story