- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంతోషకరమైన జీవితానికి 5 సూత్రాలు.. వీటిని పాటిస్తే లైఫ్ బిందాస్!
ప్రతీ విషయంలో కేవలం నెగెటివ్ కోణాలనే వెతుకుతూ పోతే అన్నీ లోపాలే కనిపిస్తాయని, మానసిక ప్రశాంతత దూరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

దిశ, ఫీచర్స్ : ఉరుకులూ పరుగుల జీవితంలో అనేకమంది స్ట్రెస్‌కు గురవుతుంటారు. ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడంలో అవస్థలు పడుతుంటారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే ఎదురయ్యే సవాళ్ల నడుమ సతమతం అవుతుంటారు. ప్రతీ ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవాలు సాధారణమే అయినప్పటికీ కొందరు ఓవర్ థింకింగ్ వల్ల అతిగా ఆందోళన చెందుతుంటారు. ఇంకెవరికీ లేని సమస్యలు తమకే ఉన్నట్టు ఊహించుకొని బాధపడుతుంటారు. దీంతో నిరాశ, నిరుత్సాహం, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలా జరగకూడదంటే రోజువారీ జీవితంలో పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన టిప్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. శారీరక శ్రమ
శారీరక శ్రమకు ఎప్పుడైతే దూరమవుతారో అప్పుడు ఒత్తిడి, ఆందోళన రెట్టింపవుతాయి. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామాలు లేదా మీకు నచ్చిన ఏదో ఫిజికల్ యాక్టివిటీని కలిగి ఉండటం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, మెడిటేషన్, జిమ్‌లో వర్కవుట్స్ ఇలా ఏదో ఒక యాక్టివిటీని డైలీ అరగంట ప్రాక్టీస్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు.
2. ఎమోషనల్ కంట్రోలింగ్..
కొందరు ప్రతీ చిన్న విషయానికి అతిగా స్పందిస్తుంటారు. అతిగా భావోద్వేగాలకు లోనవుతుంటారు. కానీ ఇది ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కోపం, ఆవేశం, అతి ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు వంటి విషయాల్లో అతి భావోద్వేగాలు అనర్థానికి దారితీస్తాయి. రక్తపోటు పెరిగేందుకు తద్వారా ఇతర అనారోగ్యాలకు సంభవించేందుకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి భావోద్వేగా మీ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. యోగా మెడిటేషన్, ప్రకృతితో కనెక్ట్ అవడం వంటివి అందుకు సహాయపడతాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
3. ఒంటరిగా కాసేపు..
ఎప్పుడూ సామాజిక జీవితమే సర్వస్వం కాదు. కాసే నిశ్శబ్దంగా ఒంటిరగా గడపడంవల్ల మీ బాడీ, మైండ్ రిలాక్స్ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒత్తిడి మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు కాసేపు ఒంటరిగా కూర్చొని రిలాక్స్ అయ్యే ప్రయత్నం చేయండి. నిశ్శబ్ద వాతావరణంలో కూర్చొని మీకు మీరు మనసులో ప్రశ్నించుకోవడం, లోతుగా ఆలోచించడం చేయండి. అప్పుడు మీ సమస్యలకు కారణాలేమిటో గుర్తిస్తారని, పరిష్కారం ఆలోచిస్తారని నిపుణులు అంటున్నారు. పైగా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీస్‌కి ఒంటరిగా గడుపుతూ రిలాక్స్ అవ్వడమే అసలైన మెడిసిన్ అంటారు. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే.. ఉదయం లేదా సాయంకాలం కాసేపు మీకంటూ సమయం కేటాయించుకోండి.
4. క్వాలిటీ స్లీప్
తలనొప్పి, మైగ్రేన్, ఒబేసిటీ వంటి పలు రకాల అనారోగ్యాలు నిద్రలేమితో ముడిపడి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే సరిగ్గా నిద్రపోకపోతే మరుసటి రోజు ఆ ప్రభావం మీ పనిపై పడుతుంది. క్వాలిటీ ప్రొడక్టివిటీ తగ్గవచ్చు. దీర్ఘకాలంపాటు నిద్రలేమిని ఎదుర్కొనేవారు మానసిక, శారీరక అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువ. అందుకే ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఏదో ఒక సమయంలో నాణ్యమైన నిద్రను కవర్ చేయాలంటారు నిపుణులు.
5. పాజిటివ్ థింకింగ్
ప్రతీ విషయంలో నెగెటివ్ కోణాలనే వెతుకుతూ ఉంటే అన్నీ లోపాలే కనిపించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. దీనివల్ల మీలో మనశ్శాంతి కరువవుతుంది. ఇతర అనారోగ్యాలకు, అనర్థాలకు దారితీస్తుంది. అందుకే సహజంగా ఎదురయ్యే ప్రతీ సమస్యకు అతిగా రియాక్ట్ అవడం, అతిగా ఆలోచించడం, ముఖ్యంగా నెగెటివ్‌గా ఆలోచిస్తూ భయపడటం మిమ్మల్ని నిజంగానే సమస్యల్లోకి నెట్టే చాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతీ విషయంలో కేవలం నెగెటివిటీ పనికిరాదు. పాజిటివ్ దృక్పథంతో ఆలోచించి చూడండి. అప్పుడు అనేక సానుకూలతలు కనిపిస్తాయని సైకాలజిస్టులు అంటున్నారు. పైగా ఇది మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






