- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హృదయవిదారక ఘటన.. ఒకే చితిపై నలుగురు స్నేహితుల అంత్యక్రియలు
ఒకే చితిపై నలుగురు స్నేహితుల అంత్యక్రియలు జరిపిన హృదయవిదారక ఘటన అందరిని కన్నీరు పెట్టిస్తుంది. ఈ విషాద ఘటన హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ జిల్లాలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఒకే చితిపై నలుగురు స్నేహితుల అంత్యక్రియలు జరిపిన హృదయవిదారక (Heartbreaking) ఘటన అందరిని కన్నీరు పెట్టిస్తుంది. ఈ విషాద ఘటన హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ జిల్లాలో చోటు చేసుకుంది. చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్న, కలిసి ఆడుకున్న నలుగురు స్నేహితులు ఒకే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరందరి అంత్యక్రియలు ఒకే చితిపై నిర్వహించగా, ఆ దృశ్యం చూసిన వారందరూ కంటతడి పెట్టారు. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం.. ఈ నలుగురు యువకులు ఒక వేడుక ముగించుకుని ఇంటికి వస్తుండగా, వారి వాహనం ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో నలుగురు తీవ్ర గాయలతో అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పరస్పర అంగీకారంతో నలుగురికీ ఒకే చితిపై దహన సంస్కారాలు నిర్వహించారు. వారి నిర్ణయంతో గ్రామంలో ప్రస్తుతం తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. వివాహ వేడుకల కోసం సిద్ధమైన ఆ కుటుంబాల్లో ఒక్కసారిగా ఆనందం అంతా మాయమైపోయింది. చిన్నప్పటి నుంచి విడదీయరాని స్నేహితులుగా ఉన్న వారిని చివరి ప్రయాణంలో కూడా ఒకే చోట వీడ్కోలు పలకడం గ్రామాన్ని కలిచివేసింది.






