Health : ఇంట్లో ఉండేవే కానీ.. కొన్నిసార్లు ఇవి హానికరం!

by Javid Pasha |

Health : ఇంట్లో ఉండేవే కానీ.. కొన్నిసార్లు ఇవి హానికరం!!

Health : ఇంట్లో ఉండేవే కానీ.. కొన్నిసార్లు ఇవి హానికరం!
X

దిశ, ఫీచర్స్ : మనం తినే ఆహారాలే మనం హెల్తీగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే ప్రస్తుతం అన్‌హెల్తీ ఫుడ్స్ కూడా జీవితంలో భాగమైపోతున్నాయి. వీటివల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం, హైకొలెస్ట్రాల్, ఒబేసిటీ వంటి వ్యాధుల ముప్పును పెంచుతున్న వాటికి మనం తరచుగా వంటగదిలో వాడే కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా కారణం అవుతున్నాయి. అవేంటో చూద్దాం.

ఫ్రోజెన్ వెజిటేబుల్స్

ఫ్రోజెన్ వెజిటేబుల్స్.. అంటే అప్పటికప్పుడు ఫ్రెష్‌గా కొనుక్కొచ్చి వండటానికి టైమ్ లేక చాలా రోజులుగా నిల్వ ఉంచిన కూరగాయలను తీసి వండేస్తుంటారు కొందరు. ఎండిన ఆకు కూరలు, కాయగూరలను వాడేస్తుంటారు. కానీ ఇది ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. అప్పటికే పోషకాలు లోపించి ఉంటాయి కాబట్టి ఉపయోగం ఉండదు. పైగా కొన్ని రకాల నిల్వ పదార్థాలు, కూరగాయలు ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీయవచ్చు. అలాగే శుద్ధి చేసిన కృత్రిమ చక్కెరలు కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

ఇన్‌స్టంట్ జ్యూస్‌లు

పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచిది. పైగా వాటి తయారీ చాలా సులువు కూడా. అయితే ఇంట్లో తాజా పండ్లతో చేసినప్పుడే అటువంటి ప్రయోజనం కలిగిస్తాయి. కానీ మార్కెట్లలో లభించే వాటి ద్వారా ఇలాంటి చాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్యాకేజ్డ్ పండ్ల రసాల్లో శుద్ధి చేసిన చక్కెర కృత్రిమ చక్కెరలు, రంగులు, రుచులను కలుపుతుంటారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి అవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, ఊబకాయం, డయాబెటిస్ వంటి సమస్యలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రాసెస్డ్ ఆయిల్

కొందరు ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడటం గానీ, మార్కెట్లో దొరికే శుద్ధి చేసిన నూనెను గానీ వాడుతుంటారు. వాస్తవానికి వీటిలో అప్పటికే పోషకాలు నాశనం అయి ఉంటాయి. పైగా కొన్నింటిలో రసాయనాలు, అన్ శాచురేటెడ్ కొవ్వులు వంటివి కలుస్తాయి. కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. అధికంగా ఉపయోగిస్తే గుండె జబ్బుల రిస్క్ పెరగవచ్చు. పిండి వంటకాల్లో వాడే ఒక రకమైన పిండి తయారీ ప్రక్రియలో కొన్నిసార్లు బెంజీన్ వంటి కెమికల్స్ కలుపుతుంటారు. పిండి తెల్లగా, సన్నగా రావడానికి ఎక్కువగా ప్రాసెస్ చేస్తుంటారు. కాబట్టి రెగ్యులర్‌గా వాడటం పోషకాహార లోపానికి, తద్వారా ఇతర అనారోగ్యాలకు దారితీయవచ్చు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story