- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Health : ఊబకాయంతో క్యాన్సర్ రిస్క్..2035 నాటికి మరింత పెరిగే చాన్స్!
ఒకప్పుడు ఇండియాలో అధిక బరువు లేదా ఊబకాయం వంటివి పెద్ద సమస్యగా ఉండేది కాదు, కానీ ఇటీవలి సంవత్సరాల్లో ఇక్కడ కూడా ఇది పెరుగుతూ వస్తోందని నిపుణులు చెబుతున్నారు.

దిశ, ఫీచర్స్ : మారుతున్న ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవన శైలి, నిరంతర ఒత్తిడి.. ఇలా కారణాలేమైనా ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయం(Obesity) బాధితుల సంఖ్య పెరుగుతోంది. వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషణ్ రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచ జనాభాలో 38 శాతం మంది అధిక బరువు లేదా ఒబేసిటీతో బాధపడుతున్నారు. అయితే ఇది పలు అనారోగ్యాలతో పాటు 40% క్యాన్సర్ రిస్క్‌ను కూడా పెంచుతున్నది. పరిస్థతి ఇలాగే కొనసాగితే 2035 నాటికి ప్రపంచ జనాభాలో 51% మంది ఒబేసిటీ బారిన పడే అవకాశం ఉంది. అందుకే అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
*ఒకప్పుడు ఇండియాలో అధిక బరువు లేదా ఊబకాయం వంటివి పెద్ద సమస్యగా ఉండేది కాదు, కానీ ఇటీవలి సంవత్సరాల్లో ఇక్కడ కూడా ఇది పెరుగుతూ వస్తోందని నిపుణులు చెబుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య గత సర్వేల ప్రకారం.. భారత దేశంలోనూ ప్రతీ 16 మంది మహిళల్లో ఒకరు, ప్రతీ 25 మంది పురుషుల్లో ఒకరు చొప్పున ఒబేసిటీ బారిన పడుతున్నారు. అట్లనే ప్రతీ సంవత్సరం ఒబేసిటీ రేట్ 5.2 శాతం పెరుగుతోంది. కాగా ఈ సమస్యతో పురుషులకంటే మహిళలు మరింత ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఊబకాయం లేదా అధిక బరువు కారణంగా వీరిలో 7 రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ 40 % పెరిగిందని నివేదికలు పేర్కొంటున్నాయి.
*ఊబకాయంతో ఉన్న మహిళలకు జన్మించే పిల్లలకు కూడా పెద్దయ్యాక స్ట్రోక్, డయాబెటిస్, ఆస్తమా, గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కుగా ఉందని నిపుణులు అంటున్నారు. దీంతోపాటు హార్మోన్లలో మార్పులు, హెచ్చు తగ్గులు, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్), మెనోపాజ్ స్టేజ్ వంటివి కూడా మహిళల్లో ఊబకాయం పెరగడానికి కారణం అవుతున్నాయి.
*ఊబకాయానికి మరో ప్రధాన కారణం శారీరక శ్రమలేకపోవడంతోపాటు మానసిక ఒత్తిడి. దీనివల్ల కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది జీవక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో తినే రుగ్మతలు (Eating disorders) పెరుగుతాయి. అలాగే ఫుడ్ సరిగ్గా జీర్ణం కాకపోవడంవల్ల, అధి కొవ్వు రూపంలో శరీరంలోనే నిల్వ ఉండిపోతుంది. ఇది కూడా అధిక బరువుకు కారణం అవుతుంది. క్రమంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. కాబట్టి ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్త పడాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకోసం ఆరోగ్యకరమైన జీవన శైలిని, ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






