చలికాలంలో కలలు ఎక్కువగా వస్తున్నాయా.. కారణాలు ఇవే..?

by Taduka Kalyani |

చలికాలం మొదలైనప్పటి నుంచి చాలామందికి కలలు ఎక్కువగా వస్తుంటాయి.. స్పష్టంగా గుర్తుంటాయి కూడా అయితే ఇది ఏదైనా అనారోగ్య లక్షణమా? లేక సహజమైన మార్పేనా

చలికాలంలో కలలు ఎక్కువగా వస్తున్నాయా.. కారణాలు ఇవే..?
X

దిశ, వెబ్ డెస్క్: చలికాలం మొదలైనప్పటి నుంచి చాలామందికి కలలు ఎక్కువగా వస్తుంటాయి.. స్పష్టంగా గుర్తుంటాయి కూడా అయితే ఇది ఏదైనా అనారోగ్య లక్షణమా? లేక సహజమైన మార్పేనా? అనే అనుమానాలకు వైద్య నిపుణులు స్పష్టత ఇస్తున్నారు. చలికాలంలో నిద్ర లోతుగా పడటం వల్ల నిద్ర దశ ఎక్కువసేపు కొనసాగుతుంది. ఈ దశలోనే ఎక్కువగా కలలు వస్తాయి. వేసవితో పోలిస్తే చలిలో శరీర ఉష్ణోగ్రత తగ్గడం, మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఎక్కువగా విడుదల కావడం వల్ల మెదడు మరింత యాక్టివ్‌గా పనిచేస్తుందని తెలిపారు. అలాగే చలిలో బరువైన దుప్పట్లు వాడటం, నిద్ర మధ్యలో ఒక్కసారైనా మేల్కొనడం వల్ల వచ్చిన కలలు స్పష్టంగా గుర్తుండిపోతాయని వైద్యులు చెబుతున్నారు. మానసికంగా ఆలోచనలు, ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారిలో భయంకరమైన కలలు కూడా ఎక్కువగా రావచ్చని హెచ్చరిస్తున్నారు.

వైద్య నిపుణుల మాటల్లో, చలికాలంలో కలలు ఎక్కువగా రావడం సాధారణమైన శారీరక ప్రక్రియ మాత్రమే తప్ప, దీనిని వ్యాధిగా భావించాల్సిన అవసరం లేదన్నారు. అయితే కలల వల్ల నిద్రకు అంతరాయం కలుగుతూ, రోజువారీ జీవనంపై ప్రభావం చూపితే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిదని సూచించారు. నిద్ర బాగా రావాలంటే నిద్రకు ముందు మొబైల్ వినియోగం తగ్గించడం, గోరువెచ్చని ఆహారం తీసుకోవడం, చలి గాలి నేరుగా తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

Next Story