Health Tips : కీళ్ల నొప్పులుంటే వింటర్‌లో స్విమ్మింగ్ చేయకూడదా?

by Javid Pasha |   (  Updated:2024-12-06 07:47:58  IST  )

Health Tips : కీళ్ల నొప్పులుంటే వింటర్‌లో స్విమ్మింగ్ చేయకూడదా?

Health Tips : కీళ్ల నొప్పులుంటే వింటర్‌లో స్విమ్మింగ్ చేయకూడదా?
X

దిశ, ఫీచర్స్: చలికాలంలో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో కీళ్ల నొప్పులు ఒకటి. వాతావరణంలో మార్పులు, తేమ శాతం పెరగడం, శరీరంలో విటమిన్ డి, విటమిన్ కె లోపించడం వంటివి ఇందుకు కారణం అవుతుంటాయి. అయితే క్రీడాకారులతోపాటు చాలా మంది రోజువారీ వ్యాయామాల్లో భాగంగా స్విమ్మింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ చలికాలంలో కూల్ వెదర్, కీళ్లనొప్పుల కారణంగా చేయవచ్చా.. లేదా? చేస్తే ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా? అన్న సందేహాలు కూడా పలువురిని వెంటాడుతుంటాయి. దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

* కీళ్ల నొప్పులు లేదా ఆర్థరైటిస్ ఇష్యూస్ ఉన్నవారు స్విమ్మింగ్ చేస్తే నొప్పి మరింత అధికం అవుతుందని కొందరు భావిస్తుంటారు. కానీ ఇందులో వాస్తవం లేదంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ముఖ్యంగా చలికాలంలో ఇతర వర్కౌట్లకంటే కూడా స్విమ్మింగ్ చేయడం కీళ్ల ఆరోగ్యానికి మంచిదని, నొప్పులు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. ప్రారంభంలో నొప్పిగా అనిపించినా స్విమ్మింగ్ చేసిన తర్వాత ఉపశమనం లభిస్తుంది. రెగ్యులర్‌గా చేస్తే శరీరం మొత్తం రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కండరాలు, కీళ్లకు ఆక్సిజన్, పోషకాల సరఫరా మెరుగుపడటంతో అవయవాలన్నీ హెల్తీగా ఉంటాయి. కండరాలు దృఢంగా తయారవుతాయి.

* స్విమ్మింగ్ వల్ల ఊపిరితిత్తులకు, గుండెకు చక్కటి వ్యాయామం అందుతుంది. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ సరిగ్గా జరగడంవల్ల మొత్తం శరీరం పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా అధిక బరువు తగ్గాలనుకునే వారికి స్విమ్మింగ్ ఒక బెస్ట్ ఆప్షన్‌. ఎందుకంటే అధిక కేలరీలను బర్న్ చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. రాత్రిపూట మెరుగైన నిద్రను ప్రేరేపించడంలోనూ స్విమ్మింగ్ ప్రేరణగా నిలుస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళనలు వంటివి దూరం అవుతాయి. ఇన్ని రకాల హెల్త్ అండ్ ఫిట్‌నెస్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వింటర్‌లో, కీళ్ల నొప్పులు ఉన్నప్పటికీ స్విమ్మింగ్ చేయడంవల్ల మేలు జరుగుతుంది అంటున్నారు నిపుణులు.

*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story