- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోజుకు 12 గంటలు నిద్రపోయినా మత్తు వదలట్లేదా?.. కచ్చితంగా ఆ సమస్యే!
సాధారణంగా ఎవరైనా ఆరేండు గంటలు నిద్రపోయినా ఫ్రెష్‌గా, యాక్టివ్‌గా కనిపిస్తారు. కానీ.. ఆ సమస్య ఉన్నవారు మాత్రం ఇందుకు భిన్నం!

దిశ, ఫీచర్స్ : రోజుకు పదీ పన్నెండు గంటలు నిద్రపోయినా నిద్రమత్తు వదలట్లేదా? ఏకాగ్రత కుదరట్లేదా? ఏ పనీ చేయాలనిపించడం లేదా? అయితే మీరు హైపర్‌సోమ్నియా బాధితులు కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. ఇదొక న్యూరోలాజికల్ స్లీప్ డిజార్డర్. దీని బారిన పడినవారు డైలీ 12 -15 గంటలు పడుకున్నా.. రాత్రంతా నిద్రపోని వ్యక్తిమాదిరిగా ఇంకా మత్తులోనే ఉంటారు. సాధారణంగా ఎవరైనా 7-9 గంటలు, అంతకంటే తక్కువసేపు నిద్రపోయినా ఫ్రెష్‌గా, యాక్టివ్‌గా కనిపిస్తారు. కానీ హైపర్‌సోమ్నియా ఉన్నవారు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు. ఉదయాన్నే రీఫ్రెష్‌గా నిద్రలేవలేరు. ఎందుకలా జరుగుతుంది? దీనికి పరిష్కారమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
హైపర్‌సోమ్నియా (Hyposomnia) అనేది మెదడులోని స్లీప్-వేక్ రెగ్యులేషన్ సిస్టమ్‌లో అసాధారణత(abnormalities)వల్ల సంభవిస్తుందని ఆరోగ్య చెబుతున్నారు. దీనివల్ల బాధితులు రోజంతా నిద్రమత్తు, ఏకాగ్రతలోపం, శక్తి హీనత వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒక క్లినికల్ రీసెర్చ్ ప్రకారం.. హైపర్ సోమ్నియా ఉన్నవారు ఉదయం నిద్రలేచేటప్పుడు బాడీ, మైండ్ పూర్తిగా రికవర్ కాకపోవడం సాధారణంగా జరుగుతుంది. అంటే ఇక్కడ నిద్ర సమయం ఎక్కువైనా.. నాణ్యత తక్కువగా ఉండటంవల్ల మెదడు సరైన విశ్రాంతి పొందదని నిపుణులు చెబుతున్నారు.
మెదడుకు విశ్రాంతిలేని పరిస్థితులు, నిద్రమత్తు వదలకపోవడం అనేది హైపర్‌సోమ్నియా బాధితుల్లో రోజువారీ పనులు చేసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. అందుకే కొన్ని అధ్యయనాలు స్లీప్ డ్రైవ్ ను నియంత్రించడంలో కీలకంగా ఉండే GABA& డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్‌మిటర్లలో తలెత్తే అసాధారణ సమస్యలుగా పేర్కొంటున్నాయి. దీనినే హైపర్ సోమ్నియాగా నిపుణులు చెబుతన్నారు. ఈ పరిస్థితిలో మెదడు ‘నిద్రపోవాలి’ అనే సిగ్నల్‌ను నిరంతరం ఆపకుండా కొనసాగించడంవల్ల ఎప్పుడూ నిద్రమత్తు ఏర్పడుతుంది. జీవన శైలిలో మార్పులు, ముఖ్యంగా రోజూ ఒకే సమయంలో పడుకోవడం, లేవడం వంటి రెగ్యులర్‌స్లీప్ షెడ్యూల్ పాటించడం, కెఫీన్, ఆల్కహాల్, జంక్‌ఫుడ్స్ వంటివి తగ్గించడం చేయాలి. అయినా ప్రాబ్లం సాలో కాకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.






