- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Health : శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే బీ కేర్‌ఫుల్.. రక్తహీనత వెంటాడుతున్నట్టే!
అధిక అలసట, చిన్న చిన్న పనులకే నీరసించిపోవడం వంటి లక్షణాలు రక్తహీత వల్ల కలిగే లక్షణాలు కావచ్చునని నిపుణులు చెబుతున్నారు.

దిశ, ఫీచర్స్ : అనుకోకుండా కళ్లు తిరుగుతున్నాయా? ఏదైనా వర్క్‌లో ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వగానే తలనొప్పి వేధిస్తోందా? అయితే అది కేవలం ఒత్తిడి వల్లనే కాకపోవచ్చు. మీ శరీరంలో రక్తహీనతవల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మహిళల్లో, పిల్లల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది. కాబట్టి లక్షణాలు కనిపించగానే అలర్ట్ అవ్వాలంటున్నారు నిపుణులు. ఇంకా ఏయే లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
యెస్.. హెల్తీగా ఉండాలంటే శరీరంలో తగినంత రక్తం ఉండాలి. ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడంవల్ల ఇది సాధ్యం అవుతుంది. అయితే వాటి పనితీరు మందగించినప్పుడు, సరిగ్గా రక్తాన్ని ఉత్పత్తి చేయలేవు. దీనివల్ల రక్తహీనత ఏర్పడుతుంది. సాధారణంగా శరీరానికి అందే పోషకాల్లో ఐరన్ లోపించడంవల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కళ్లు తిరగడం, నిద్రలేమి
తరచుగా తలనొప్పి రావడం, కళ్లు తిరగడం, నిద్రపట్టకపోవం వంటి లక్షణాలు శరీరంలో తగినంత రక్తం లేనప్పుడు కనిపిస్తాయి. జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోవచ్చు. అలాగే కొందరిలో ఛాతీలో నొప్పిగా అనిపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఏకాగ్రత లోపించడం, తరచుగా అలసట, చిన్న చిన్న పనులకే నీరసించిపోవడం వంటివి రక్తహీతన ఉన్నవారిలో సాధారణంగా కనిపించే సింప్టమ్స్. ఇలాంటప్పుడు రక్తాన్ని ప్రొడ్యూస్ చేయగల పోషకాహారాలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవసరం అయితే వైద్య నిపుణులను సంప్రదించాలి.
కాళ్లు, చేతుల్లో వణుకు
పిల్లల్లో రక్తహీనత విషయానికి వస్తే వారు ఆహారం తినడానికి ఆసక్తి చూపకపోవచ్చు. కొంతమంది పిల్లలు మట్టి, సున్నం, చాక్ పీస్ వంటివి తినడానికి ఇష్టపడుతుంటారు. కొందరు పెద్దల్లోనూ ఇలాంటి కోరికలు కలుగవచ్చు. దీంతోపాటు తరచుగా కాళ్లు, చేతులు అకారణంగా తిమ్మిరి పట్టడం, అకారణంగా అప్పుడప్పుడు వణకడం వంటి లక్షణాలు ఉంటాయి. మరి కొందరు రాత్రిపూట తరచుగా కాళ్లను కదిలిస్తూనే ఉంటారు. దీనిని రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. రక్తహీనత ఉన్నవారిలో, బాడీలో ఐరన్ లోపం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.
జుట్టు రాలడం, ఆందోళన
జుట్టు చిట్లిపోవడం లేదా రాలడం వంటి ఇబ్బందులు తరచుగా ఎదుర్కొంటున్నట్లయితే కూడా రక్తహీనత వల్లే కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే సాధారణ గది ఉష్ణోగ్రతవద్ద కూడా చలి పెట్టడం, ఆందోళనగా అనిపించడం వంటివి కూడా రక్తహీనత లక్షణాలుగా పేర్కొంటున్నారు. వీటిని గుర్తిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకొని వైద్య నిపుణుల సలహాలను పాటించాలి. ఆహారాల విషయానికి వస్తే నట్స్, ప్రూన్, పచ్చి బఠానీలు, తృణ ధాన్యాలు, పాలు, గుడ్లు, మాంసం, ఆఫ్రికాట్, బ్రోకలీ, ఎండు ద్రాక్షతోపాటు సీజనల్ కూరగాయలు, పండ్లు వంటివి తింటూ ఉండటంవల్ల రక్తహీతన సమస్యను అధిగమించవచ్చు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.






