Fertility Concerns : రోజూ పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నారా? సంతానలేమికి దారితీయొచ్చు!

by Javid Pasha |   (  Updated:2025-02-03 08:03:32  IST  )

Fertility Concerns : రోజూ పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నారా? సంతానలేమికి దారితీయొచ్చు!

Fertility Concerns : రోజూ పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నారా? సంతానలేమికి దారితీయొచ్చు!
X

దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో తిండి తినకుండానైనా ఓ పూట ఉండగలరేమో కానీ.. అందం, ఆకర్షణ వంటి విషయాల్లో కేర్ తీసుకోకుండా మాత్రం ఉండలేరు చాలామంది. బయటకెళ్లినా, ఇంట్లో ఉన్నా నీట్‌గా రెడీ అవ్వడం సహజమే. ఇందుకోసం ప్రతీ ఒక్కరు భిన్నమైనన పద్ధతిని అవలంబిస్తారు. కొందరు నేచురల్‌గా, సింపుల్ రెడీ అయితే, మరికొందరు రకరకాల మేకప్‌లు, పర్ఫ్యూమ్‌లతో అలంకరించుకుంటారు. ఇంకొందరైతే తాము ఎంత మంచి పర్ఫ్యూమ్ యూజ్ చేస్తారో, తాము నివసించే ఇల్లు లేదా గది కూడా అంతే సువాసనలతో వెదజల్లాలని భావించేవారు లేకపోలేదు. ఇందుకోసం రూమ్ ఫ్రెషనర్స్ వాడుతుంటారు. ఏదేమైనా పర్ఫ్యూమ్‌ల వాడకం ఇప్పుడు చాలా కామన్ అయింది. అయితే వీటి అధిక వాడకమే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మరీ ముఖ్యంగా సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు.

పర్‌‌ఫ్యూమ్‌లు, రూమ్ ఫ్రెషనర్లు ఎప్పుడో ఒకసారి వాడితే పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. తరచుగా వాడటంవల్ల స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి, తద్వారా సంతానలేమి సమస్యలను పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. వీటి తయారీలో థాలేట్స్, పారబెన్లు, బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీటోల్యూన్, ఫార్మాలిహైడ్స్, ఆక్సినాల్స్, సింథటిక్ వంటి ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తారు. ఇవి శరీరంలోని నేచురల్ హార్మోన్లను నిరోధిస్తాయి. కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌కు దారితీస్తాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

స్త్రీలపై ప్రభావం

అధిక పెర్ఫ్యూమ్‌ల వాడకం స్త్రీలలో హార్మోన్ల ఉత్పత్తి, రుతుక్రమం, అండోత్సర్గం, పునురుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి సమస్యలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా అండాశయ ఫోలికల్స్‌ను దెబ్బతీస్తాయడం వల్ల గర్భధారణ అవకాశాలను తగ్గిస్తాయి. మహిళల్లో ఎగ్ క్వాలిటీని, దాని డెవలప్ మెంట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అబార్షన్ అయ్యే రిస్క్‌ను పెంచుతాయి. కాబట్టి రెగ్యులర్‌గా వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

పురుషులపై ప్రభావం

స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఈ రోజుల్లో అందరూ పెర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నారు. ఇక వీటి అధికవాడకం పురుషులపై చూపే ప్రతికూల ప్రభావాన్ని పరిశీలిస్తే.. స్పెర్మ్ కౌంట్‌ను, క్వాలిటీని, మొబిలిటీని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తరచుగా పర్ఫ్యూమ్ వాసనలకు గురికావడం, శరీరంపై వాటిని అప్లై చేయడం వంటివి చేస్తూ ఉండేవారిలో డీఎన్ఏ దెబ్బతినే చాన్స్ ఉంటుందని చెబుతున్నారు. శృంగాక కోరికలు తగ్గడానికి కూడా కారణం అవుతాయి. మొత్తానికి పురుషుల్లో సంతానోత్పత్తి ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపే చాన్స్ ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇలా చేయడం బెటర్

పర్‌ఫ్యూమ్‌ల అధిక వాడకం ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ఉండాలంటే వాటిని వాడకపోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. అలా సాధ్యం కాదనుకునేవారు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సూచిస్తున్నారు. అంటే కెమికల్స్ లేని పర్ఫ్యూమ్స్ వాడొచ్చు. సింథటిక్ వాసనలకు బదులుగా మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన సుంగంధ పరిమళ ద్రవ్యాలను యూజ్ చేయవచ్చు అంటున్నారు.ఇక రూమ్ ఫ్రెషనర్స్‌కి బదులుగా ఇంట్లోకి బయటి నుంచి చల్లటి గాలి వచ్చేలా చక్కటి ఏర్పాట్లు చేసుకోవడం, కిటికీలు తెరవడం, వెంటిలేషన్‌ను మరింత మెరుగు పర్చడం వంటివి చేయవచ్చు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story