- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టేస్టీగా ఉంటాయని సమోసాలు.. జిలేబీలు తరచుగా తింటున్నారా..? ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి జాగ్రత్త..!
టేస్టీగా ఉంటాయని సమోసాలు.. జిలేబీలు తరచుగా తింటున్నారా..? ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి జాగ్రత్త ..!

దిశ, ఫీచర్స్ : ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నాయి. సమయం లేకనో, రుచిగా ఉంటాయనో బయట స్నాక్స్, స్వీట్స్ వివిధ ఆహార పదార్థాలు తినేవారి సంఖ్య పెరుగుతోంది. చాలామంది ఇష్టపడే వాటిలో స్నాక్స్, జిలేబీలు కూడా ఉన్నాయి. కానీ నిజానికివి ఆరోగ్యానికి ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే సమోసాలు, జిలేబీలు రుచిగా ఉన్నప్పటికీ, జిలేబీలో చక్కెరలు, సమోసాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక అనారోగ్యాలను కలిగిస్తాయి. ఇంకా ఏయే సమస్యలను పెంచుతాయో చూద్దాం.
సమోసాలతో తలెత్తే సమస్యలు
*సమోసాలను తయారు చేసే ప్రక్రియ సహజంగానే అనారోగ్యంతో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే బయట వ్యాపారం కోసం వీటిని తయారు చేసేవారు నకిలీ నూనెలను ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంది. అంతేకాకుండా డీప్ ఫ్రై చేయడానికి హైడ్రోజనేటెడ్ అయిల్‌ను లేదా ఒకసారి వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడటం చేస్తుంటారు. ఈ పరిస్థితి హానికరమైన ట్రాన్స్‌ఫ్యాట్‌ను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి పరోక్షంగా ఆర్టెరీ బ్లాక్స్, గుండె జబ్బులు వంటి సమస్యలను పెంచుతాయి.
*సమోసాల్లోని ట్రాన్స్ ఫ్యాట్స్ తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొవ్వులను, అంటే ‘బ్యాడ్ కొలెస్ట్రాల్’ను పెంచుతాయి. కాబట్టి వీటిని తరచుగా తినడంవల్ల ధమనుల నుంచి అథెరోస్క్లెరోటిక్ ఫలకాన్ని తొలగించడానికి సహాయపడే గుడ్ కొలెస్ట్రాల్‌ను నివారిస్తాయి. దీంతో చెడు కొలెస్ట్రాల్, ఇతర పదార్థాలు ఆర్టెరీస్ వాల్స్‌పై పేరుకుపోవడం, గుండె కరొనరీ ధమనుల వ్యాధికి దారితీయడం వంటి పరిణామాలు స్ట్రోక్, హార్ట్ ఎటాక్ రిస్క్‌ను పెంచుతాయి. అంతేకాకుండా ట్రాన్స్‌ఫ్యాట్స్ శరీరంలో వాపును పెంచుతాయి. దీంతో రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీయస్తాయి. సమోసాలలో వాడే పిండి కూడా ఒక సాధారణ కార్బొహైడ్రేట్ కావడంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
జిలేబీలు తింటే తలెత్తే సమస్యలు..
*బయట రోడ్ సైడ్, అలాగే బేకరీల్లో దొరికే జిలేబీలు కూడా తరచుగా తినడం ప్రమాదకరం అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే ఇవి అధిక చక్కెరతో నిండి ఉంటాయి. చక్కెర పాకంలో నానబెట్టిన డీప్ ఫ్రైడ్ స్వీట్ కాబట్టి, హై గ్లైసెమిక్‌తో కూడిన సాధారణ చక్కెరలను అధికంగా కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో జిలేబీలు తరచుగా తింటే రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. టైప్-2 డయాబెటిస్ రావడానికి దారితీస్తాయి.
*జిలేబీల్లోని అధిక చక్కెరలు రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి, అంటే ఫ్యాటీ లివర్ సమస్య వృద్ధి చెందడానికి దారితీస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. హై షుగరింగ్ కంటెంట్ వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, క్రానికల్ లో గ్రేడ్ ఇన్‌ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి రక్త నాళ వ్యవస్థను బలహీన పరుస్తాయి. అధిక రక్తపోటు పెరగడానికి, ధమనుల పనితీరు మందగించడానికి కారణం అవుతాయి. కాబట్టి తరచుగా జిలేబీలు, సమోసాలు తినడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. బదులుగా పండ్లు, తృణ ధాన్యాలు, పీచు పదార్థాలు, ఆలివ్ ఆయిల్, నట్స్ సహా లో ఫ్యాట్స్ ప్రొటీన్లు ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






