- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తింటే పచ్చకామెర్లు వస్తాయా?

దిశ, ఫీచర్స్ : నాన్ వెజ్ ప్రియులు అధికంగా ఇష్టపడే ముఖ్యమైన ఆహారంలో చికెన్ ఒకటి. పైగా ఆరోగ్యానికి మంచిది కాబట్టి తినాలని పోషకాహార నిపుణులు కూడా చెబుతుంటారు. అయితే ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం చికెన్ తిన కూడదని, తింటే పచ్చకామెర్లు వస్తాయని పలువురు నమ్ముతుంటారు. ఇంతకీ ఇది నిజమేనా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
కామెర్లు వస్తాయా?
చికెన్‌లో చాలా పోషకాలు ఉంటాయి. కూరగా వండుకొని తినడంవల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందుతాయి. దీంతోపాటు కాల్షియం, ఐరన్, సోడియం, విటమిన్ ఎ కూడా ఉండటంవల్ల అధిక బరువు తగ్గడంలో, కండరాల బలోపేతానికి మంచిది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కేలరీలు, కొవ్వులు కూడా తక్కువగా ఉంటాయి. అయితే ఇన్ని విధాలుగా మేలు చేస్తున్న చికెన్ జ్వరం వచ్చినప్పుడు తింటే పచ్చ కామెర్లు ఎందుకు వస్తాయి? ఇది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు పోషకాహార నిపుణులు. కాబట్టి జ్వరం వచ్చినా మీకు తినాలనిపిస్తే ఎంచక్కా చికెన్ తినవచ్చు.
ఇదీ సంగతి
జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినడంవల్ల ఎటువంటి నష్టం ఉండదు. కాకపోతే.. ఫీవర్ వల్ల వ్యక్తి నీరసంగా మారుతారు. ఆహారం సరిగ్గా తీసుకోలేని పరిస్థితిలో జీర్ణక్రియ మందగిస్తుంది. అలాంటప్పుడు కొందరికి చికెన్ తింటే త్వరగా జీర్ణం కాకపోవడంవల్ల కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. ఇలాంటి మాత్రమే తినకపోవడం ఒక బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. అయితే ప్రత్యామ్నాయంగా చికెన్ గ్రేవీని తినడం లేదా సూప్ తాగడం వంటివి చేయవచ్చు. ఎందుకంటే ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. ఒకవేళ జ్వరం వచ్చినప్పటికీ ఆహారం తినగలిగే శక్తి ఉన్నప్పుడు చికెన్ కూడా హ్యాపీగా లాగేయవచ్చు. పైగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనివల్ల తగిన శక్తి లభించి జ్వరం నుంచి త్వరగా కోలుకునే చాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే తప్ప చికెన్ తినడంవల్ల పచ్చ కామెర్లు వస్తాయనేది కేవలం ఒక అపోహ మాత్రమే.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






