కండరాల బలహీనత, వెన్ను నొప్పిని పోగొట్టే గింజలు.. వీటిని తింటే ఆ సమస్యలన్నీ దూరం!

by Javid Pasha |

నల్ల శనిగలలోని ఫైబర్ జీర్ణ క్రియతోపాటు శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగు పరిచి, కండరాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది.

కండరాల బలహీనత, వెన్ను నొప్పిని పోగొట్టే గింజలు.. వీటిని తింటే ఆ సమస్యలన్నీ దూరం!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగానే పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో శనగలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో నల్ల శనగలు (black chickpeas) మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయని మీకు తెలుసా? ఆహారంలో భాగంగా వీటిని తీసుకోవడంవల్ల కండరాల బలహీనతతో సంబంధం ఉన్న వెన్ను నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఏయే ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

*నల్ల శనగల్లో (black chickpeas) ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు కండరాల మరమ్మతులో సహాయపడతాయి. బలాన్ని పెంచుతాయి. శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. వీటిలోని ఫైబర్ జీర్ణ క్రియతోపాటు శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగు పరిచి, కండరాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉండటం మూలంగా కండరాల సంకోచాన్ని ప్రేరేపిస్తాయి. రిలాక్సేషన్‌ను అందించి కండరాల తిమ్మిరి లేదా నొప్పి తగ్గడంలో సహాయపడతాయి.

*ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి నల్ల శనగలను ఆహారంలో భాగంగా తీసుకోవడంవల్ల ఇవి హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. అంతేకాకుండా కండరాలకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. దీనివల్ల కండరాల బలహీనత తగ్గుతుంది. ఇక నల్ల శనిగలను సలాడ్‌లలో లేదా సూప్‌లలో చేర్చడం ద్వారా రుచి, పోషకాలు రెండూ పెరుగుతాయి. ఉడికించిన శనిగలను కొద్దిగా ఉప్పు, మిరియాలు లేదా ఇతర మసాలాలతో కలిపి స్నాక్‌గా తినవచ్చు. మొత్తానికి శనగల్లోని పోషకాలు, ప్రోటీన్లు కండరాల బలహీనతను తగ్గించి, వెన్ను నొప్పిని దూరం చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. Link

Next Story