గుండె ఆరోగ్యానికి సూపర్ చిట్కా.. నిద్రకు ముందు ఏం చేయాలంటే..

by Javid Pasha |

నిద్రకుముందు 5-10 నిమిషాలు నెమ్మదిగా, నియంత్రిత శ్వాసను తీసుకోవడం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

గుండె ఆరోగ్యానికి సూపర్ చిట్కా.. నిద్రకు ముందు ఏం చేయాలంటే..
X

దిశ, ఫీచర్స్ : మనిషి ప్రాణంతో ఉండాలంటే గుండె కూడా ఆరోగ్యంగా ఉండాలి. దాని పనితీరులో ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలకే ముప్పు సంభవిస్తుంది. అందుకే హార్ట్‌హెల్త్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలంటారు వైద్య నిపుణులు. హాని చేసే ఆహారాలకు, అలవాట్లకు దూరంగా ఉండాలని చెబుతుంటారు. అందుకోసం గుండె బలాన్ని పెంచే చిట్కాలు, వ్యాయామాలు పాటించాలని సూచిస్తుంటారు. అలాంటి వాటిలో నిద్రకు ముందు నియంత్రిత శ్వాస(Controlled breathing) కూడా ఒకటి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో సహాయపడే అత్యంత సులభమైన, ప్రభావవంతమైన అలవాటుగా పేర్కొంటున్నారు.

నియంత్రిత శ్వాస

రాత్రి నిద్రకుముందు 5 నుంచి 10 నిమిషాలు నెమ్మదిగా, నియంత్రిత శ్వాస (Slow, controlled breathing) తీసుకోవడం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అద్భుతంగా సహాయపడుతుంది. పరిశోధనలు చెబుతున్నట్లు గుండెకు స్వయంగా సరిచేసుకునే సామర్థ్యం (Self-correction ability) పరిమితం. కాబట్టి రోజువారీ ఒత్తిడి నుంచి కోలుకోవడానికి రాత్రి అలవాట్లు చాలా కీలకమని హార్ట్ హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఈ స్లో బ్రీతింగ్ మెథడ్ పారాసింపథెటిక్ నరాల వ్యవస్థను(The body's “rest and repair” mode) యాక్టివేట్ చేసి, గుండె పనితీరును నేరుగా మెరుగు పరుస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సాధారణ అలవాటు వల్ల హార్ట్ రేట్ & బ్లడ్ ప్రెజర్ తగ్గుతాయి. కార్డియో‌ వాస్క్యులర్ సిస్టమ్‌పై దీర్ఘకాలిక ఒత్తిడి తగ్గుతుంది. హార్ట్‌రేట్ వేరియబిలిటీ మెరుగుపడి, నిద్ర సమయంలో గుండె రిపేర్ & రివకరీ ప్రాసెస్ సక్రమంగా జరుగుతుంది. ‘నీవు సురక్షితం’ అనే సంకేతాన్ని మెదడుకు పంపి రోజువారీ ఒత్తిడి నుంచి గుండెను సమర్థవంతంగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

ఎలా చేయాలి?

శ్వాసనియంత్రణ అనేది చాలా ఈజీ టెక్నిక్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో భాగంగా 4 సెకన్లు ఊపిరి పీల్చుకోవడం(Inhale) 6–8 సెకన్లు నెమ్మదిగా శ్వాస వదలడం (Exhale) చేయాలి. ఇలా రోజూ రాత్రి పడుకునేముందు 5 నుంచి 10 నిమిషాలు చేస్తే.. మీ గుండె ఆరోగ్యానికి ఏజ్ రిలేటెడ్ రిస్క్ నెమ్మదిస్తుందని చెబుతున్నారు. కాలక్రమేణా గుండె సామర్థ్యం పెరగడమే కాకుండా.. అది స్వయంగా సరైన అనుసరణను అడాప్ట్ చేసుకుని మరింత ఆరోగ్యంగా, బలంగా మారుతుంది. దీర్ఘకాలంపాటు గుండె హెల్తీగా ఉంటుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ఇది వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తు్న్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story