బ్యాంక్ ఉద్యోగం వదిలేసి రూ.10 కోట్లు సంపాదిస్తున్నాడు.!

by Daayi Srishailam |

ఇలాంటి వారి నుంచే కదా యువత స్ఫూర్తి పొందాల్సింది.?

బ్యాంక్ ఉద్యోగం వదిలేసి రూ.10 కోట్లు సంపాదిస్తున్నాడు.!
X

23 ఏళ్ల యువకుడు ఏం చేస్తుంటాడు.?

ఏ ఇన్‌స్టా‌గ్రామ్ రీల్సో షేర్ చేసుకుంటూ..

లేదా డిగ్రీ పూర్తయి జాబ్ సెర్చింగ్ చేస్తూ ఉంటారు.

కానీ..

ఓ యువకుడు 23 ఏళ్లకే ఉద్యోగాలు సాధించి..

ఉద్యోగంతో సాధించేది ఏముండదని..

స్వతహాగా ఓ సంస్థను ప్రారంభించి..

ఇప్పుడు 10 కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నాడు.

ఇలాంటి వారి నుంచే కదా యువత స్ఫూర్తి పొందాల్సింది.?

- దిశ, ఫీచర్స్

విజయ్ ప్రతాప్ సింగ్‌కు యాత్రలంటే చాలా ఇష్టం. యాత్రలంటే పుణ్యక్షేత్రాలే కాదు.. సాహస యాత్రలు కూడా. ఏ కాస్త సమయం దొరికినా అడవి.. పర్వతాల వెంట ప్రయాణం చేస్తాడు విజయ్. అదే అతడిని సాహస పర్యాటకుడిగా తీర్చిదిద్దింది. తనలాంటి ఎంతోమందికి సాహసయాత్రలను సులభతరం చేయాలనే ఆలోచన కలిగించింది. ఆ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే "అడ్వెన్‌థ్రిల్".

వాటీజ్ అడ్వెన్‌థ్రిల్.?

అడ్వెంచర్స్ పట్ల ఆసక్తి ఉన్నవాళ్లకు ఇదొక ప్లాట్‌ఫాం. ఔత్సాహిక ట్రెక్కర్స్ గానీ.. మౌంటెనీర్స్ గానీ.. సాహసాలు చేసే యువత.. ఉద్యోగస్తులు ఇలా ఎవరికైనా ట్రెక్కింగ్‌తో మిగతా అడ్వెంచర్స్ పట్ల శిక్షణనిచ్చే ఆర్గనైజేషన్ అడ్వెన్‌థ్రిల్. ఎనీవన్- కెన్- జాయిన్ విధానంలో ప్రోగ్రామ్స్‌ని రూపొందించాడు. వెబ్‌సైట్.. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ రూపొందించి.. మేనేజ్మెంట్ ఇంటర్లను నియమించి మొదటి అడుగులు వేశాడు. స్టార్టింగ్‌లోనే మంచి స్పందన వచ్చింది. మొదట్లో ఒక్కడే పగలు రాత్రి కష్టపడేవాడు. 2020లో కరోనా వల్ల అడ్వెంచర్స్ ఆగిపోయి.. తీవ్ర సమస్యలొచ్చాయి. అయినా వెనకడుగు వేయకుండా వర్చువల్ మారథాన్లను ఏర్పాటుచేసి "అడ్వెన్‌థ్రిల్‌"ను అడ్వెంచర్స్‌కు బ్రాండ్‌గా మార్చాడు.

సేఫ్టీ ట్రెక్కింగ్

2016లో విజయ్‌కు ఢిల్లీకి చెందిన 12 మంది ఎంబీబీఎస్ విద్యార్థులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ట్రెక్ లీడర్ కావాలనే ఆలోచన అప్పుడే ఏర్పడింది. ఆ అనుభవంతో "నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్"లో శిక్షణ తీసుకున్నాడు. సురక్షిత పర్వతారోహణ మీద కాన్సెంట్రేషన్ పెట్టాడు. ఇప్పుడు "అడ్వెన్‌థ్రిల్‌"లో 10 మందితో కూడిన ట్రెయిన్డ్ టీమ్ ఉంది. వాళ్లంతా ఫస్ట్ ఎయిడ్.. రెస్క్యూ.. అడ్వన్స్‌డ్ మౌంటెనీరింగ్ కోర్సుల్లో ప్రావీణ్యం పొందినవారు. 2024లో దృష్టిలోపం ఉన్న భారత ఫుట్‌బాల్ ఆటగాళ్ల కోసం ప్రత్యేక టెక్‌ను విజయ్ చేపట్టడం విశేషం. టీమ్‌తో సహా అందరూ కలిసి ఫుట్‌బాల్ ఆటగాళ్లకు అనుగుణంగా ట్రెక్‌ను రూపొందించారు.

రూ.10 కోట్ల టర్నోవర్

"అడ్వెన్‌థ్రిల్‌" సక్సెస్‌లో ప్రధాన కారణం నాణ్యత. తక్కువ ట్రెక్కింగ్‌లను నిర్వహిస్తూ.. నాణ్యతపై దృష్టిపెట్టిన "అడ్వెన్‌థ్రిల్‌" ఇప్పటివరకు లడఖ్.. హిమాచల్ ప్రదేశ్.. ఉత్తరాఖండ్.. సిక్కిం.. నేపాల్ వంటి ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌లు నిర్వహించింది. ఇప్పటివరకు రూ.10 కోట్ల ఆదాయం సంపాదించింది. గత ఏడాదిలోనే రూ.45 లక్షల టర్నోవర్ నమోదైంది. ఇండియా అంతర్జాతీయ ట్రెక్కింగ్ గమ్యస్థలంగా మారాలంటే సురక్షిత మౌలిక సదుపాయాలు.. శిక్షణాబద్దమైన గైడ్స్ అవసరం అంటాడు విజయ్. దుర్భరమైన పరిస్తితుల్లో కూడా నిఖార్సయిన మార్గాలను మ్యాప్ చేసి.. గ్రామీణ వర్గాలకు ఆదాయ మార్గాలు కల్పించాలనే లక్ష్యంతో "అడ్వెన్‌థ్రిల్‌" ముందుకు వెళ్తోంది.

బ్యాంక్ ఉద్యోగం వదిలేసి

విజయ్ వాళ్లది ఉత్తరప్రదేశ్‌లోని "బులందర్ షహర్". 2005లో "డెహ్రాడూన్" వెళ్లి చదువు కొనసాగించినప్పటకీ ప్రకృతితోనే అతడి అనుబంధం కొనసాగింది. 2012లో "ఉత్తరాఖండ్ యూనివర్సిటీ"లో ఐటీ కోర్సు పూర్తిచేసి.. హైదరాబాద్‌లోని "హెచ్‌సీఎల్‌"లో ఉద్యోగంలో చేరాడు. హైదరాబాద్‌లో భాషా సమస్యలు వచ్చాయి. ఆహార దినచర్య కూడా మారిపోయింది. దీంతో బోర్ కొట్టినప్పుడల్లా అటవీ మార్గాల్లో తిరగడం మొదలుపెట్టాడు. ఆపై "మేనేజ్మెట్ అప్‌టిట్యూడ్ టెస్ట్" (మ్యాట్) రాసి.. చండీగఢ్ యూనివర్సిటీలో "ఇంటర్నేషనల్ బిజినెస్"లో మాస్టర్స్ చేశాడు. తర్వాత "కోటక్ మహేంద్ర బ్యాంక్" చేరాడు. అక్కడ క్లయింట్స్‌తో మాట్లాడుతూ వ్యాపార మెలకువలు నేర్చుకున్నాడు. 23 ఏళ్ల వయసులో బ్యాంక్ ఉద్యోగం మానేసి పర్యతాల వెంట ప్రయాణం చేస్తున్నాడు.

Next Story