- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral: జీతం కోట్లల్లో.. కానీ జీవితంలో ఓడిపోయా..?!

దిశ, ఫీచర్స్ : జీతం ముఖ్యం కాదు.. జీవితం ముఖ్యమని అప్పుడప్పుడూ కొందరు అంటుంటే మనం పెద్దగా పట్టించుకోం కానీ.. ఓ టెకీ ఆవేదన వింటే మాత్రం గుండె తరుక్కుపోతుంది. అయ్యో నిజమే కదా అనిపిస్తుంది. ఉరుకులూ పరుగుల జీవితం మనల్ని ఎలా మార్చేస్తుందో తెలిసొస్తుంది. డబ్బు సంపాదనలో పడి ఏం కోల్పోతున్నామో అర్థమౌతుంది. మనిషి జీవితానికి అర్థం, పరమార్థం అదేనా? అనే సందేహం కలుగుతుంది. ఇకనుంచైనా కొంచెం మారాలనిపిస్తుంది. ఇంతకీ ఏం జరగిందంటే..
‘‘అసలే పోటీ ప్రపంచం.. పేదరికం నుంచి బయటపడాలంటే.. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే.. యువతరం మారాలి. వారానికి 70 గంటలు పనిచేయాలి’’ ఇన్ఫోసిస్ సహ - వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలివి. సోషల్ మీడియాలో ఇప్పుడు దీనిగురించే ఎక్కువగా డిస్కషన్ నడుస్తుండగా.. భిన్నాభిప్రయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎక్కువమంది అధిక పనిగంటలను వ్యతిరేకిస్తుండగా, కొందరు సమర్థిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ టెకీ రోజుకూ 14 గంటలపాటు పనిచేసి, కోట్లల్లో జీతం అందుకున్నప్పటికీ తానేం కోల్పోయాడో చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్ల హృదయాలను కదలించింది. అతని మాటలు వైరల్‌గా మారాయి.
పేరు చెప్పడానికైతే ఇష్టపడలేదు. కానీ మూడేండ్ల కిదట ఓ సంస్థలో తాను సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశానని చెప్పుకొచ్చాడు సదరు ఉద్యోగి. వృత్తిలో భాగంగా యూరోపియన్ యూనియన్, ఆసియా టీమ్‌లను సైతం సమన్వయం చేసేవాడినని, ప్రమోషన్ కోసం రోజుకూ 14 గంటలు పనిచేశానని వెల్లడించాడు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆఫీస్ వర్క్, మీటింగ్స్, టీమ్ ఫాలోయింగ్ అంటూ క్షణం తీరికలేకుండా గడిపేవాడినని తెలిపాడు. బంధువులు, స్నేహితులను కలవడం కూడా మానేశానని, కుటుంబంలో జరిగే వేడుకలను, శుభకార్యాలను, కుటుంబ అవసరాలను త్యాగం చేసి ఉద్యోగానికి పరిమింతం అయ్యానని పేర్కొన్నాడు.
‘‘బీజీ షెడ్యూల్ వల్ల నా భార్య ప్రసవ సమయంలో కూడా పట్టించుకోలేదు. నాకు కూతురు పుట్టినప్పుడు కూడా ఉద్యోగ బాధ్యతల్లో ఉండి.. భార్యను, బిడ్డను చూడ్డానికి వెళ్లలేదు. దీంతో నా భార్య మానసికంగా కుంగిపోయింది. డిప్రెషన్‌కులోనైంది. కౌన్సెలింగ్ కోసం డాక్టర్లను కలిసేందుకు కూడా ఆమెకు తోడుగా వెళ్లలేపోయాను. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది రూ. 7.8 కోట్ల వార్షిక వేతనం అందుకోబోతున్న కానీ ఏం లాభం.. నేను సంతోషంగా లేను ఎందుకంటే నా భార్య నాతో విడాకులు కోరుతోంది. జీవితంలో ఏం కోల్పోయానో అర్థమైంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఎంత జీతం వస్తే ఏం లాభం దేనికోసం అయితే మూడేండ్లు ఆరాటపడ్డానో అదే తన పర్సనల్ లైఫ్‌లో అలజడి రేపిందని సదరు టెకీ పేర్కొన్నాడు. జీతం, ఉద్యోగం, ప్రమోషన్ కోసం పడే తపనలో తాను వ్యక్తిగత ఆనందాన్ని, జీవితాన్ని, చివరకు భార్యను కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన చెందిన అతను ‘‘నా లైఫ్‌లో ఏం చేస్తున్నానో అని నన్ను నేను ప్రశ్నించుకోకుండా ఉండలేకపోతున్న’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు పని ఒత్తిడి, పర్సనల్ లైఫ్ గురించి చర్చించుకుంటున్నారు.
సందేశం : ఆ టెకీ ఆవేదన అందరికీ కనువిప్పు కావాలని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. జీవితంలో బతకడానికి ఉద్యోగం, ప్రమోషన్, జీతం ముఖ్యమే కావచ్చు. కానీ.. అలాంటి పరిస్థతిని ఎదుర్కొంటూ జీతం, ఉద్యోగమే లోకంగా బతుకుతూ కుటుంబాన్ని, వ్యక్తిగత ఆనందాన్ని, ప్రాణంగా ప్రేమించే బంధాలను దూరం చేసుకుంటే.. చివరికి మిగిలేది శూన్యమే. మనశ్శాంతి కోల్పోవడం, మనేవోదన తప్ప ఇంకేముండదు. అందుకే జర పైలం! అధిక పని ఒత్తిడి, క్షణం తీరికలేని జీవనశైలి ప్రమాదకరం అంటున్నారు నెటిజన్లు.