Health : డెత్ రిస్క్‌ను పెంచుతున్న బెల్లీ ఫ్యాట్.. ఏ విధంగా అంటే?

by Javid Pasha |   (  Updated:2025-10-16 12:18:37  IST  )

పొట్ట చుట్టూ అధిక కొవ్వు పేరుకు పోవడం గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఇది డెత్ రిస్క్‌ను పెంచుతున్నట్లు అధ్యయనంలో తేలింది.

Health : డెత్ రిస్క్‌ను పెంచుతున్న బెల్లీ ఫ్యాట్.. ఏ విధంగా అంటే?
X

దిశ, ఫీచర్స్ : శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ప్రమాదమే. కానీ పొట్టు చుట్టూ పేరుకుపోవడం ఇంకా ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే ఇది డెత్ రిస్క్‌ను పెంచుతుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ (BMJ)లో పబ్లిషైన మెటా-అనాలసిస్ అధ్యయనం పేర్కొన్నది. ఇందులో భాగంగా శరీరంలో ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ డెత్ రిస్క్‌పై ఎలా ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవడానికి రీసెర్చర్స్ దాదాపు 25 లక్షలమందిపై నిర్వహించిన 72 కోహార్ట్ స్టడీలను విశ్లేషించారు. ఈ సందర్భంగా వారు పొట్ట చుట్టూ అధిక కొవ్వు (Abdominal fat or central obesity) ఉన్నవారిలో డెత్ రిస్క్ పెరుగుతున్నట్లు గుర్తించారు. ఎందుకంటే ఇది గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుంది.

మరోవైపు, తొడలు, తుంటి చుట్టూ అధిక కొవ్వు (Peripheral fat or gluteo-femoral fat) కలిగి ఉన్నవారు మరింత కాలం జీవిస్తారని పరిశోధకులు అంటున్నారు. ఎందుకంటే ఈ ఫ్యాట్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. వెయిస్ట్-టు-హిప్ రేషియో (WHR), అలాగే వెయిస్ట్-టు-హైట్ రేషియో(WHtR) మరణం త్వరగా సంభవించే ప్రమాదాన్ని అంచనా వేయడంలో బీఎంఐ (Body mass index) కంటే బలమైన ప్రిడిక్టర్లుగా నిరూపితమయ్యాయి. అయితే బీఎంఐ(BMI) కొవ్వును కండరాల నుంచి వేరు చేయలేదు కాబట్టి అది తప్పుదోవ పట్టిస్తుందని రీసెర్చర్స్ అంటున్నారు. ఉదాహరణకు అథ్లెట్స్‌లో బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉండి కూడా ఆరోగ్యం మంచిగానే ఉంటుంది. ఇది స్మోకింగ్, ఫిజికల్ యాక్టివిటీ, ఆహార అలవాట్లు వంటి ఫ్యాక్టర్లను నియంత్రించిన తర్వాత కూడా స్థిరంగా ఉంటుంది. అంటే బాడీలో ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ స్వతంత్రంగా మరణ రిస్క్‌ను ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

Next Story