- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Love Failure : ప్రేమలో ఫెయిల్ అయ్యారా.. అయితే అస్సలు బాధ పడొద్దు .. హ్యాపీగా ఉండాలంటున్న నిపుణులు
కొందరైతే ప్రేమే లోకంగా బతుకుతుంటారు.. తేడా వచ్చిన రోజు ప్రాణాలు కూడా తియ్యడానికి , పోగొట్టుకోవడానికి వెనుకాడటం లేదు

దిశ, వెబ్ డెస్క్ : " ప్రేమ " అనేది ఎప్పుడు ఎవరి మీద కలుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇది రెండు అక్షరాల పదమే కానీ, రెండు జీవితాలను కూడా నాశనం చెయ్యగల శక్తీ దీనికి ఉంది. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎంతో మంది ప్రేమలో ఫెయిల్ అయి చనిపోయారు. లవ్ ఫెయిల్యూర్ అయితే చావు ఒక్కటే పరిష్కారం కాదు.. ఇంకా హ్యాపీగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
ప్రేమ ఎంత సంతోషాన్ని ఇస్తుందో అంత కంటే రెట్టింపు బాధని కూడా ఇస్తుంది. లవ్ లో పడిన మొదట్లో " పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది " అన్నట్టు డ్యూయెట్ సాంగ్ వేసుకోవాలనిపిస్తుంది. రోజులు గడిచే కొద్దీ " ఎందుకిలా నను వేధిస్తున్నావ్ " అంటూ ఇంకో పాట వేసుకుంటారు. ముందుకు వెళ్లే కొద్దీ ఆలోచనలు మొత్తం మారిపోతాయి. " నిజమేనా.. నిజమేనా మన కథ ముగిసినే " అంటూ చివరిలో ఒక ఎమోషనల్ సాంగ్ వేసుకుని ఇద్దరూ బ్రేక్ అప్ చెప్పుకుంటారు. ప్రేమలో ఉన్నప్పుడు లవర్స్ తెలియని మత్తులో ఉంటారు. కొందరైతే ప్రేమే లోకంగా బతుకుతుంటారు.. తేడా వచ్చిన రోజు ప్రాణాలు కూడా తియ్యడానికి , పోగొట్టుకోవడానికి వెనుకాడటం లేదు. అయితే, దీని మీద పరిశోధనలు చేసిన నిపుణులు షాకింగ్ నిజాలు వెల్లడించారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఈ ప్రపంచంలో ప్రేమలో ఫెయిల్ అయి జీవితంలో గెలిచినా వాళ్లే ఎక్కువ ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం, వీరిలో చాలా మంది కోట్లకు పడగలెత్తే బిజినెస్ లు చేస్తున్నారట. వారు గెలవడానికి ప్రధాన కారణం " ప్రేమ " అని వెల్లడించారు. లవ్ చేసిన పాత పార్ట్నర్ కు సంబంధించిన ఫోన్ నెంబర్లను, ఫోటోలను డిలీట్ చేసి లైఫ్ మీద విరుచుకుపడ్డారట. కొన్ని రోజులు బాధ పడినా క్రమంగా .. వారి మైండ్ సెట్ ను మార్చుకుని బిజినెస్ మీద పెట్టారని తెలిపారు. కాబట్టి, ప్రేమలో ఫెయిల్ అయితే హ్యాపీగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రాణాలు తీసుకుని మీ కుటుంబ సభ్యులను బాధ పెట్టకండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






