- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video : రాకెట్ అప్పగింతలు ఎప్పుడైనా చూశారా .. పుట్టింటోళ్ళు వెలిగించారు .. కొత్త జంట గాల్లోకి ఎగిరిపోయారు? ( వీడియో )
కానీ, ఇక్కడ రాకెట్ అప్పగింతలు అంటూ ఏకంగా రాకెట్ లో నవ దంపతులను పంపించారు

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో పెళ్ళికి సంబంధించిన చాలానే చూస్తుంటాం.. కొన్ని సీరియస్ గా ఉంటే, మరి కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. ఇప్పటి వరకు మనం పెళ్ళిలో అప్పగింతలు చూశాము.. కానీ, ఇక్కడ రాకెట్ అప్పగింతలు అంటూ ఏకంగా రాకెట్ లో నవ దంపతులను పంపించారు.
ప్రస్తుతం, ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో " పెళ్లి తర్వాత వధువును అత్తింటి వారికి అప్పగిస్తారు. దీనిని మనం అప్పగింతలుగా పిలుస్తుంటాము. అయితే, అందరూ కారులో అప్పగిస్తారు కానీ, ఇక్కడ రాకెట్ లో పంపించడం ఆశ్చర్యంగా ఉంది. ఇంటిల్లిపాది ఎమోషనల్ అవుతూ వారి అమ్మాయిని , అల్లుడికి అప్పగించడానికి రాకెట్ మీద కూర్చోబెట్టి.. పుట్టింటోళ్ళు అగ్గిపుల్లని తీసుకుని వెలిగిస్తారు. అంతే దెబ్బకి కొత్త జంట గాల్లోకి ఎగిరిపోయారు" .ఈ వీడియోలో అబ్బాయి అమ్మయిలా చీర కట్టుకుని పెళ్ళి కూతురిలా రెడీ అయ్యాడు. ఇది చూడటానికి చాలా చాలా కామెడీగా ఉంది. దీనిని చూసిన నెటిజన్స్ " భలే ఉంది ఈ రాకెట్ అప్పగింతలు మేము ఎప్పుడూ చూడలేదంటూ" ఫన్నీ ఎమోజిస్ పెడుతున్నారు.






