నగ్నంగా రన్నింగ్.. బీచ్‌లో అలా దొరికిపోయిన నటుడు.. ఇప్పుడు హితబోధ...

by Sujitha Rachapalli |   (  Updated:2025-02-13 13:23:07  IST  )

బాలీవుడ్ యాక్టర్ మిళింద్ సోమన్ చాలా సార్లు వివాదాల్లోకి ఎక్కాడు. బీచ్‌లో నగ్నంగా రన్నింగ్ చేయడం నుంచి తన కన్నా 26ఏళ్ల చిన్నదైనా అంకితను పెళ్లి చేసుకుని మరో కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు.

నగ్నంగా రన్నింగ్.. బీచ్‌లో అలా దొరికిపోయిన నటుడు.. ఇప్పుడు హితబోధ...
X

దిశ, ఫీచర్స్ : బాలీవుడ్ యాక్టర్ మిళింద్ సోమన్ చాలా సార్లు వివాదాల్లోకి ఎక్కాడు. బీచ్‌లో నగ్నంగా రన్నింగ్ చేయడం నుంచి తన కన్నా 26ఏళ్ల చిన్నదైనా అంకితను పెళ్లి చేసుకుని మరో కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. వీరిద్దరు పెళ్లి చేసుకుని పదేళ్లు పూర్తి కాగా ఈ కపుల్ హ్యాపీ కపుల్‌గా ఎలా ఉండగలుగుతున్నారో చెప్పుకొచ్చిన వీడియో వైరల్ అవుతుంది. అవును.. ఒకప్పుడు నగ్నంగా బీచ్‌లో కనిపించిన అతన్ని అంకిత ఎలా అర్థం చేసుకుంది? ఈ పదేళ్లలో ఎలాంటి ఇష్యూస్ తలెత్తలేదా? ఒకవేళ సమస్యలు వచ్చినా ఎలా పరిష్కరించుకుంటారు? చూద్దాం.

మిళింద్ భార్యను పొగడ్తల్లో ముంచెత్తాడు. 26ఏళ్ల ఏజ్ గ్యాప్ అంటే ప్రతి విషయంలోనూ భిన్నంగా ఉంటాం. టేస్ట్, జనరేషన్ అప్‌డేట్, ట్రెండ్‌కు అనుగుణంగా పరుగెత్తడం ఇలా అన్నింట్లో అంకిత ముందుంటుందని.. ఆమె నుంచి చాలా నేర్చుకుంటానని తెలిపాడు. ఆమె అస్సామీ.. తను మహారాష్ట్రియన్.. ఇలా కల్చర్‌లోనూ డిఫరెన్స్ ఉంది. అయినా సరే ఒకరి కల్చర్‌ను మరొకరం గౌరవిస్తూ.. సెలబ్రేట్ చేసుకుంటాం. నిజానికి ఇలా భిన్నంగా ఉండటం.. చాలా విషయాల్లో మనల్ని అప్‌డేట్ చేసుకునేలా చేస్తుంది. మనుషులను మరింత అర్థం చేసుకునేందుకు హెల్ప్ చేస్తుంది.

ఇక అంకిత భర్త గురించి మాట్లాడుతూ.. ఇలా ఏజ్ గ్యాప్ ఉండటం వల్ల మనం చాలా నేర్చుకోవచ్చు. చాలా మెచ్యూర్డ్‌గా ప్రవర్తించేందుకు చాన్స్ ఉంటుంది. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ మనం కొన్ని జీవిత పాఠాలు నేర్చుకుంటాం. కానీ మన పార్ట్‌నర్ మనకన్నా పెద్దవాడై ఉన్నప్పుడు.. వాటిని అనుభవించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు.. ఆటోమేటిక్‌గా అర్థమైపోతాయి. ఇతరులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా పరిపూర్ణంగా ఉంటామని చెప్పుకొచ్చింది. మొత్తానికి హ్యాపీ కపుల్‌గా ఉండేందుకు ఇలా అండర్‌‌స్టాండ్ చేసుకోవడమే ప్రధానపాత్ర పోషిస్తుందని చెప్పింది అంకిత.

Next Story