- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇయర్‌బడ్స్ యూజర్స్‌కు షాక్.. మొత్తం వినేస్తున్న హాకర్స్!
by B.Srinivas |
బ్లూటూత్ ఇయర్‌బడ్స్, ఆడియో గ్యాడ్జెట్స్‌ను హైజాక్ చేసి హ్యాకర్స్ మీ సంభాషణలు వింటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

X
దిశ, ఫీచర్స్: ప్రస్తుతం మొబైల్ వాడేవారిలో 70శాతం మంది వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ యూజ్ చేస్తున్నారు. ఇతరులకు డిస్ట్రబెన్స్ కలిగించపోవడంతోపాటు ఫోన్ కాల్స్, సాంగ్స్, మూవీస్, రీల్స్ వంటివాటిలో ప్రైవసీకోసం బ్లూటూత్ ఆడియో గ్యాడ్జెట్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఆడియో డివైజ్ యూజర్స్‌కు షాక్ ఇచ్చే న్యూస్ వెలుగులోకి వచ్చింది. హాకర్స్.. ఆడియో గ్యాడ్జెట్స్ హైజాక్ చేసి, మీ ఇంటరాక్షన్ మొత్తం వింటున్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయని బ్లూటూత్ ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్‌లు ప్రమాదంలో ఉంటున్నాయని కొత్త పరిశోధన అధ్యయనం వెల్లడించింది. ఏ కంపెనీకి చెందిన మొబైల్ అయినా కేటుగాళ్లు ఈజీగా హైజాక్ చేస్తున్నట్లు బెల్జియంలోని KU Leuven యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఫాస్ట్ పెయిర్ ఎఫెక్ట్..
గూగుల్ ప్రవేశపెట్టిన ‘Fast Pair’ టెక్నాలజీతో బ్లూటూత్ డివైజ్‌లను ఈజీగా ఆండ్రాయిడ్ ఫోన్‌లకు కనెక్ట్ చేయొచ్చు. అంతేకాదు చుట్టుపక్కల ఉండే ఏదైనా నయా బ్లూటూత్ డివైజ్‌ను ఇది ఈజీగా గుర్తిస్తుంది. ఈ టెక్నాలజీ ఆధారంగానే హ్యాకర్లు దారుణాలకు పాల్పడుతున్నారు. ‘Whisper Pair’ అనే పేరుతో తమ చుట్టూ ఉన్న ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్‌లను సైలెంట్‌గా హ్యాక్ చేస్తున్నారు. మీ సంభాషణలు వినడంతోపాటు మీ డివైజ్‌లకు రకరకాల సౌండ్స్ పంపించడం, కాల్స్ కట్ చేయడం, Find My Device నెట్‌వర్క్‌ను యూజ్ చేసి మీరు ఎక్కుడున్నారో గుర్తించడం వంటివి వారి కంట్రోల్‌లోకి తీసుకుంటున్నట్లు నిపుణులు తెలిపారు.

జాగ్రత్తలేంటి?
- ఆడియో గ్యాడ్జెట్‌ను గూగూల్ అకౌంట్‌కు సరిగ్గా లింక్ చేయండి. ఇలా చేసినట్లైతే హ్యాకర్స్ మీ పర్మిషన్ లేకుండా హైజాక్ చేయలేరు.
- మీ ఫోన్‌కు ఏదైనా కొత్త డివైజ్ నుంచి అకస్మాత్తుగా లింక్ వస్తే దాని ఎట్టిపరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు. లేదంటే వెంటనే రిజెక్ట్ చేయండి.
- మొబైల్ యూజ్ చేయకపోతే వెంటనే బ్లూటూత్ ఆఫ్ చేయండి. వైర్డ్ హెడ్‌ఫోన్స్ యూజ్ చేసినప్పుడు కూడా బ్లూటూత్ ఆఫ్ చేయడం మరిచిపోవద్దు.
- పర్సనల్ విషయాలు సంభాషించేందుకు వైర్డ్ హెడ్‌సెట్‌ను యూజ్ చేయడం బెటర్.
- మొబైల్ బ్లూటూత్ సెట్టింగ్స్‌లో ‘Paired’ అని కనిపిస్తే వెంటనే ‘Forget Device’ చేయండి.
- సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడూ అప్‌డేట్స్ చేయండి. ఎందుకంటే ఆయా కంపెనీలు ఇలాంటి సెక్యూరిటీ లోపాలను గుర్తించి అప్‌డేట్స్ ద్వారా రక్షణ కల్పిస్తుంటాయి.
- రద్దీ ప్రాంతాలు, ఎయిర్‌పోర్ట్స్, కెఫే, పార్టీస్ వంటి ప్లేసుల్లో బ్లూటూత్ ‘Visible’ మోడ్‌లో ఉండకుండా చూసుకోవాలి.

Next Story