- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కా చెల్లెళ్లతో కలిసి పెరిగినవారు జీవితంలో తప్పక సక్సెస్ అవుతారు..! కారణం ఇదే..
సాధారణ వ్యక్తులకంటే.. సోదరీమణులు(Sisters) కలిగి ఉన్న వారు భావోద్వేగ స్థిరత్వం, మెరుగైన సంభాషణ నైపుణ్యాలు, దయాగుణం వంటి లక్షణాలను ఎక్కవస్థాయిలో అభివృద్ధి చేసుకుంటారు.

దిశ, ఫీచర్స్ : మనం పుట్టి పెరిగిన వాతావరణం, కుటుంబ పరిస్థితి జీవితంపై ప్రభావం చూపుతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే బ్రిఘమ్ యంగ్ యూనివర్సిటీ (Brigham Young University)కి చెందిన ఒక అధ్యయనం మరో కొత్త విషయాన్ని వెల్లడించింది. ఒంటరిగా పెరిగిన వ్యక్తులకంటే అక్కా చెల్లెళ్లు కలిగి ఉండి, వారితో కలిసి పెరిగిన వ్యక్తులు తమ తర్వాతి జీవితంలో ఆనందంగా ఉంటారని, వీరు విజయాలు సాధించే అవకాశం ఎక్కువని పేర్కొన్నది.
అధ్యయన వివరాల ప్రకారం.. సాధారణ వ్యక్తులకంటే.. సోదరీమణులు(Sisters) కలిగి ఉన్న వారు భావోద్వేగ స్థిరత్వం, మెరుగైన సంభాషణ నైపుణ్యాలు, దయాగుణం వంటి లక్షణాలను ఎక్కవస్థాయిలో అభివృద్ధి చేసుకుంటారు. ఇవి పెద్దయ్యాక కూడా ప్రభావం చూపుతాయి. మరింత బలమైన సంబంధాలు, నాయకత్వ సామర్థ్యాలుగా మారుతాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సిస్టర్స్ మధ్య పెరగడం అనేది సోదరులు లేదా సోదరీమణులను వారు తమ భావాలు బయటపెట్టడానికి, సమస్యలు పరిష్కరించడానికి, మానసిక దృఢత్వం పెంచుకోవడానికి ప్రోత్సహిస్తారు. ఈ చిన్న చిన్న ప్రభావాలు కాలక్రమేణా పెద్ద లక్షణాలుగా మారి, విజయానికి సంబంధించిన గుణాలను ఏర్పరుస్తాయి.
నిపుణుల ప్రకారం.. సిస్టర్స్ కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కాదు. వారు తమ తోబుట్టువులకు, సోదరులకు ఒక ఇంటర్నల్ సపోర్ట్ సిస్టమ్‌లా పనిచేస్తారు. మంచి వ్యక్తిత్వాన్ని రూపొందిస్తారు. బాల్యంలో వారితో గడిపిన సమయం, చిన్న చిన్న గొడవలు, రాజీ పడటాలు, విషయాలను పంచుకోవడాలు వంటివన్నీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ను పెంచుతాయి. అందుకేనేమో అక్కాచెల్లెళ్లు ఉన్నవారు అదృష్టవంతులు అంటుంటారు పెద్దలు. Link






