CIBIL స్కోర్‌ బాలేదని.. పెళ్లిపీటలపై పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు కుటుంబం

by Malleboina Mahesh |   (  Updated:2025-02-08 15:28:33  IST  )

ఇటీవల కాలంలో పెళ్లిపీటలపైనే అనేక వివాహాలు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. ఇందుకు వరకట్నం, లవ్ ఎఫైర్స్, కుటుంబ సభ్యుల మధ్య గోడవల వంటి కారణాలు అనేకం ఉంటున్నాయి.

CIBIL స్కోర్‌ బాలేదని.. పెళ్లిపీటలపై పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు కుటుంబం
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో పెళ్లిపీటలపైనే అనేక వివాహాలు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. ఇందుకు వరకట్నం(Dowry), లవ్ ఎఫైర్స్(Love affairs), కుటుంబ సభ్యుల మధ్య గొడవల వంటి కారణాలు అనేకం ఉంటున్నాయి. మరికొన్ని వివాహ ముహూర్తం ఖరారు అయ్యాక వివిధ కారణాల వల్ల రద్దు అవుతుంటాయి. కానీ తాజాగా ఓ వివాహం ఆగిపోయిన తీరు.. దేశవ్యాప్తంగా ఉన్న యువకులను ఆశ్చర్యానికి గురి చేసింది. మహారాష్ట్ర(Maharashtra)లో మరి కొద్ది గంటల్లో వివాహం(marriage) జరగాల్సి ఉండగా.. వరుడి(groom) సిబల్(CIBIL Score) స్కోర్‌ను పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు చెక్ చేశారు. అయితే పెళ్లి కొడుకు సిబిల్ స్కోరు బ్యాడ్ (Bad Cibil Score)గా ఉండటంతో ఏకంగా వివాహాన్ని రద్దు చేసుకొని అంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌(Murtijapur)లో ఇరు కుటుంబాలు మ్యాట్రిమోని(Matrimony) ద్వారా ఈ పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. అయితే పెళ్లి కూతురు మేనమామ మాత్రం అనూహ్యంగా వరుడి CIBIL స్కోర్‌ను తనిఖీ చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో వధువు తండ్రి వరుడి సిబిల్ స్కోర్ చెక్ చేయగా.. అతను వివిధ బ్యాంకుల నుండి అనేక రుణాలు తీసుకున్నాడు. అతని క్రెడిట్ స్కోర్ అతి తక్కువగా ఉంది. దీనికి కారణం అడగ్గా.. పలుమార్లు లోన్లు కట్టడంలో అంతరాయం ఏర్పడటం వల్ల ఇలా జరిగిందని తెలిపాడు. దీంతో వధువు కుటుంబం అతనితో పెళ్లిని వెంటనే రద్దు చేసుకుంది. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించలేని వ్యక్తికి ఆర్థిక క్రమశిక్షణ ఉండదని, తమ అమ్మాయిని ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోలేడని పెళ్లిని రద్దు చేసుకున్నారు. కాగా ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story