బాప్ రే బామ్మ.. 57 ఏళ్ల వయసులో ఫిట్‌‌నెస్ ఐకాన్‌గా నిలిచింది.!

by Daayi Srishailam |

57 ఏళ్ల వయసులో కొత్త జర్నీ స్టార్ట్ చేసింది.

బాప్ రే బామ్మ..  57 ఏళ్ల వయసులో ఫిట్‌‌నెస్ ఐకాన్‌గా నిలిచింది.!
X

భార్యగా..

తల్లిగా..

సంరక్షకురాలిగా..

ఆమె దశాబ్దాలుగా సక్సెస్‌ఫుల్ పాత్ర పోషించింది.

మోనోపాజ్ దశ..

అలసట..

సామాజిక అంచనాలతో సతమతమైన ఆమె..

ఇప్పుడు సోషల్ మీడియా సంచలనం.

57 ఏళ్ల వయసులో కొత్త జర్నీ స్టార్ట్ చేసింది.

ఈ అద్భుతమైన ప్రయాణం తన కలను సాకారం చేసింది.

దిశ, ఫీచర్స్

ఇది డిజిటల్ యుగం. సోషల్‌మీడియా ద్వారా తమ టాలెంట్‌‌‌‌‌‌ను ప్రూవ్ చేసుకొని లేటు వయసులో సక్సెస్ అవుతున్నారెందరో. అలాంటివారిలో ఆశు జైన్ ఒకరు. ఒకప్పుడు సాధారణ గృహణి. ఇప్పుడు ఫిట్నెస్ ఐకాన్.. ఇన్ స్టాగ్రామ్ (@not.just.a.grandma) ఇన్ ఫ్లుయెన్సర్. ఎంటీవీ రోడీస్ పార్టిసిపేంట్. ఎన్నో సవాళ్లను అధిగమించి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

54 ఏళ్లకు కొత్త జర్నీ..

ఆశు జైన్ ఎప్పుడూ ఊహించలేదు 57 ఏళ్ల వయసులో అపరిచితులు తనను గుర్తించి.. సెల్ఫీలు తీసుకుంటారని. తమ కార్యక్రమాలకు సాదరంగా ఆహ్వానిస్తారని. జాతీయ టెలివిజన్లలో తనను గెస్ట్‌గా పిలుస్తారని. ఒకప్పుడు మోనోపాజ్ తర్వాత అలసట.. సామాజిక అంచనాలతో సతమతమైన గృహిణిగా ఉన్న ఆమె.. ఇప్పుడు సెలబ్రిటీ. అందరి కెరీర్ 20-25 ఏళ్లలో స్టార్టయితే.. ఆశుజైన్ జర్నీ 54 ఏళ్లలో స్టార్టయింది. అమ్మమ్మగా మారిన తర్వాత తిరిగి కలలను సొంతం చేసుకుంది. అత్యంత ప్రజాదరణ గల "ఎంటీవీ రోడీస్" ప్రోగ్రాంకి పార్టిసిపెంట్‌గా వెళ్లి అమ్మమ్మల సత్తా ఏంటో చూపించింది.. ఫిట్నెస్ ఐకాన్ గా మారింది.

44 ఏళ్లకు ఎంటెక్

ఎంటీవీ రోడీస్ "ఫిట్నెస్ ఐకాన్" కాకముందు ఆశు చదువులో తన ఫిట్నెస్ ఏంటో చూపించింది ఆశు. మామూలుగా పెళ్లి కాగానే చదువు.. లక్ష్యాలు.. ఆశలు.. ఆశయాలు గల్లంతై గాల్లో కొట్టుకుపోతాయి. పిల్లలు.. కుటుంబం వంటి కొత్త బాధ్యతలతో గృహిణిగా మారుతుంటారు. ఆశు పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. పెళ్లి కాకముందుకు తాను అనుకున్న కలలేవీ సాకారమయ్యేలా కనిపించలేదు. కానీ.. 44 ఏళ్ల వయసులో ఆమె తన చదువును తిరిగి ప్రారంభించింది. మొదట జామియా మిలియా ఇస్లామియా నుంచి ఎంటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఐఐటీ ఢిల్లీ నుంచి 53 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ చేసింది.

వృద్ధాప్యాన్ని అంగీకరించలే

50 ఏళ్లు దాటిన మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా.? ఆశు జైన్‌కు ఎన్నో సమస్యలొచ్చాయి. ఇల్లు.. కుటుంబాన్ని వదిలేసి అస్తమానం పుస్తకాలే పట్టుకుంటే కుదురుతుందా.? ఒకవైపు పరీక్ష తేదీలు.. కుటుంబ ప్రణాళికలు తలుచుకుంటే తల ప్రాణం తోకకొచ్చేది. ఈ గందరగోళంలో 2022లో అధిక రక్తపోటు సమస్య వచ్చింది. డాక్టర్ జీవితకాలం మందులిచ్చాడు. "నువ్వు ముసలిదానవు అయ్యావు అర్థమవుతుందా" అని అందరూ బ్రేకులేసే ప్రయత్నం చేసినా.. వినకుండా స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌పై పరిశోధన చేసింది.

ఇన్‌ఫ్లుయెన్సర్..

రెండున్నర సంవత్సరాల పాటు కొనసాగించింది. ఆ తర్వాత జిమ్‌లో చేరింది. ప్రతీరోజు రన్నింగ్.. సైక్లింగ్ చేసేది. ఈ మార్పు ఆమె శారీరక.. మానసిక శ్రేయస్సుకు సానుకూల ప్రభావం చూపింది. ఉదయం 4 గంటలకు ఒక గ్లాసు నీటితో ఆమె రోజు స్టార్ట్ అవుతుంది. తర్వాత నానబెట్టిన గింజలు తింటుంది. ఆ తర్వాత జిమ్. జుంబా డ్యాన్స్.. రన్నింగ్.. ట్రెక్కింగ్ వంటి వర్కవుట్స్.. రెసిపీస్ చేసి @not.just.a.grandma హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసేది. ఆ రీల్స్ వేలాదిమంది జీవనశైలిని మార్చాయనే ప్రశంసలు అందుకొని.. సోషల్ మీడియా సంచలనంగా మారిపోయింది.

ఎంటీవీ రోడీస్

ఆశూ బామ్మ బాగా ఫేమస్ అయిపోయింది. ఇక టార్గెట్ ఎంటీవీ రోడీస్ రియాలిటీ షో. హైదరాబాద్లో సీజన్ 20 కోసం ఆడిషన్ ఇచ్చి ఎంపికైంది. ఇదొక పవర్ ఫుల్ యంగ్ టాలెంట్ షో. కఠినమైన టాస్క్‌లు ఉంటాయి. సవాలుతో కూడుకున్న పని. ఇంకా తన వయసేమో 50+. అన్నింటినీ అధిగమించి.. అందరి అంచనాలనూ తలకిందులు చేసి రోడీస్ షోకు ఎంపికైంది. దీనికి ఎంపికవడం అంటే కేవలం యువత కేంద్రీకృత రియాలిటీ షోకు ఎంపికడం మాత్రమే కాదు.. జీవితంలో అత్యంత ఉత్తేజకరమైన అవకాశాలు యువతకు మాత్రమే అనే సామాజిక అంచనాను ఛేదించడం అంటుంది ఆశు జైన్.

Next Story