గవర్నర్ సంచలన నిర్ణయం.. ఉదయం 5.30 గంటలకే పాఠశాలలు ప్రారంభం!

by Disha Web Desk 7 |
గవర్నర్ సంచలన నిర్ణయం.. ఉదయం 5.30 గంటలకే పాఠశాలలు ప్రారంభం!
X

వెబ్‌డెస్క్ : సాధారణంగా పాఠశాలలు ఎక్కడైనా ఉదయం 8:30 గంటల తర్వాతనే ప్రారంభమవుతాయి. ఆ సమయం సరిపోకనే విద్యార్థులు హడావిడిగా తయారై పరుగులు పెడుతూ స్కూళ్లకు వెళ్తుంటారు. కానీ తెల్లవారు జామున 5.30 గంటలకే స్కూళ్లను ఓపెన్ చేస్తామంటే..? విద్యార్థులకు నిద్రమత్తు వదులుతుందా..? దుప్పట్ల నుంచి బయటకు వస్తారా..? కానీ గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ఈ స్కూల్ వేళలు ఎక్కడ అమలు అవుతున్నాయో చూద్దాం..!


విద్యార్థుల్లో క్రమ శిక్షణను పెంచేందుకు ఇండినేషియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని టేంగ్‌పారా ప్రావిన్స్‌ నగరంలో తెల్లవారు జామున 5 : 30 గంటలకే పాఠశాలలు ప్రారంభం కావాలని గవర్నర్ విక్టర్ లైస్కోడాట్ ఆదేశాలు జారీ చేశారు. ఇంతవరకు ఎక్కడ లేని స్కూల్ వేళలను 10 ఉన్నత పాఠశాలల్లో తెల్లవారుజామున 5.30 గంటలకే బడులను ప్రారంభించడం ఆ దేశ పౌరులను ఆశ్యర్యపరిచింది. అయితే ఈ విధానం కేవలం 10 పాఠశాల్లోనే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. అది కూడా 12వ తరగతి చదివే విద్యార్థులకు మాత్రమే. ఈ విధానం సక్సెస్ రేటును బట్టి దీనిని అమలు చేయాలా.. రద్దు చేయాలా అనేది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ పాఠశాల పని వేళలు అమలు అవుతున్నాయి. విద్యార్థులు ఆ సమయానికి ఖచ్చితంగా స్కూల్లో ఉండాలని కండీషన్ కూడా పెట్టారు.

అయితే ఈ విధానంపై దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఆ దేశ విద్యారంగ నిపుణుడు ‘మార్కెల్ రోబోట్’ మాట్లాడుతూ... పిల్లలు అంత ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల వారికి నిద్ర సరిపోదు. వారి ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది. అలాగే వారి ప్రవర్తనలో మార్పు రావడమే కాకుండా, విద్యార్థులు ఒత్తిడికి గురవుతారని అభిప్రాయపడ్డారు. విద్యా నాణ్యత, ప్రమాణాలను మెరుగుపరచాలంటే ఎన్నో మార్గాలున్నాయని, ఇది మాత్రం సరైన ప్రణాళిక కాదని అక్కడి నిపుణులు చెపుతున్నారు. సాధారణంగా ఇండోనేసియాలోని పాఠశాలలు ఉదయం 8గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 3.30 గంటలకు ముగుస్తాయి. అలాగే గతంలో అమెరికన్ అకాడమీ ఆఫ్ పీటియాట్రిక్స్ కీలక సూచనలు చేసింది. పాఠశాల వేళలు ఉదయం 8.30 గంటల తర్వాత ఉంటేనే విద్యార్థులకు సరిపడా నిద్ర ఉంటుందని, లేకపోతే విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వెల్లడించింది.

తల్లిదండ్రులదీ అదే అభిప్రాయం

‘మాపిల్లలు ఇంటి వద్ద నుంచి చీకటిగా ఉన్నప్పుడే స్కూలుకి బయల్దేరుతున్నారు. విద్యార్థులకు ఏమైనా అయితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? పిల్లలు ఇంటికి వచ్చేసరికి బాగా అలసిపోతున్నారు.’ అంత పొద్దున్నే బడి ప్రారంభించడం సరికాదని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read..

Pneumonia : ఆ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అయితే న్యుమోనియా కావచ్చు!


Next Story

Most Viewed