- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గూగుల్ సెర్చ్‌లో AI Mode..! లాభమా.. నష్టమా?
గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లోని ఏఐ మోడ్ అప్‌డేట్ వల్ల పబ్లిషర్లు తమ కంటెంట్‌కు, వెబ్‌సైట్‌లకు సంబంధించిన ట్రాఫిక్‌ను కోల్పోతున్నారు.

దిశ, ఫీచర్స్ : మీకు ఇది తెలిసే ఉంటుంది. గతంలో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లోకి వెళ్లి, అవసమైన సమాచారం కోసం టైప్ చేసినప్పుడు సంబంధింత సోర్సెస్ లింకులు క్లి్క్ చేయాల్సి వచ్చేది. ఏ సమాచారం ఏ వెబ్ సైట్‌లో లేదా ఏ బ్లాగ్‌లో ఉందో చదువుకొని అని వెతకాల్సి వచ్చేది. కొన్నిసార్లు అవసరమైన దానిని సేకరించుకోవడంలో రెండు మూడు గంటల సమయం పట్టేది. కానీ ఏఐ పుణ్యమా అని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇక రీసెంట్‌గా గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌లో గత 25 సంవత్సరాలతో పోలిస్తే అతి పెద్ద అప్‌డేట్ తీసుకువచ్చింది. ఏమిటంటే.. సెర్చ్ బార్ ఓపెన్ చేయగానే పక్కనే AI Mode ఆప్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. Google I/O 2026 డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో ప్రకటించిన ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా రోల్ అవుట్ అయింది. అయితే పలువురు దీనిని కాంట్రవర్షియల్ అప్‌డేట్ అని పిలుస్తారు. ఎందుకిలా? దీంతో లాభమా? నష్టమా?
కొత్త అప్‌డేట్ వల్ల లాభాలు
సెర్చ్ బార్ పక్కనే కనిపించే AI Mode ఆప్షన్‌ను ఎంచుకుంటే.. సాధారణ బ్లూ లింక్స్ బదులు, జెమిని 3.5 ఫ్లాష్ ఏఐ మోడల్‌తో పొడవైన సంభాషణలు జరుపుకోవచ్చు. AI Modeలో మల్టీమోడల్ సామర్థ్యం బాగా పని చేస్తుంది. ఫోటోలు, వీడియోలు లేదా ఫైల్స్‌ను అప్‌లోడ్ చేసి ప్రశ్నలు అడగడం ద్వారా మరింత ఖచ్చితమైన, సందర్భోచితమైన సమాధానాలు పొందవచ్చు. ఉదాహరణకు సెలవుల్లో మీరేదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ క్లిక్ చేసిన ఫొటోను అప్‌లోడ్ చేస్తే ఆ స్థలం ఏమిటి? ఎక్కడ ఉందో తదితర వివరాలను తక్షణం చెబుతుంది.
ఏఐ మోడ్ (AI Mode)లో ఒక ప్రశ్న అడిగితే.. వివరంగా జవాబు ఇచ్చి, ఫాలో-అప్ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ‘‘పోస్టర్‌కు సహాయపడే ఎక్సర్‌సైజెస్ ఏమిటి? అని అడిగితే లిస్ట్ ఇస్తుంది. ఇదే సందర్భంలో ఎప్పుడు ఎలా చేయాలి? అని మళ్లీ అడగవచ్చు. ఇంకా ‘Agents’ ఫీచర్ ద్వారా మీకు ఇష్టమైన సెలబ్రిటీ కొత్త అప్‌డేట్ గురించి ఆటోమేటిక్ నోటిఫికేషన్స్ కూడా పొందవచ్చు (ఇది ముందుగా AI Pro & Ultra సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంటుంది).
ఏఐ మోడ్ వల్ల వచ్చే సమస్యలు
ఈ మార్పు వల్ల చాలామంది యూజర్లు బ్లూ లింక్స్ మీద క్లిక్ చేయడం బాగా తగ్గుతోందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ప్యూ రీసెర్చ్ (Pew Research) ప్రకారం ఏఐ సమ్మరీ వచ్చినప్పుడు వివిధ లింక్స్ క్లిక్ రేటు సగానికి సగం తగ్గుతోంది. ఈ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా న్యూస్‌వెబ్ ట్రాఫిక్ భారీగా తగ్గుతోంది. అంతేకాకుండా ఏఐ తప్పులు చేసే అవకాశం ఉందని, గతంలో తప్పుడు సమాచారం ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే సాంకేతికత రోజు రోజుకూ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో చిన్న చిన్న లోపాలు పెద్ద సమస్య కాదని, దానిని సాంకేతికత ఆధారంగానే ఎదుర్కోవచ్చునని కూడా గూగుల్ భావిస్తోంది.
AI Mode అప్‌డేట్ వచ్చినా గూగుల్ యూజర్లు ఇప్పటికీ సాధారణ వెబ్‌సెర్చ్(Web option)ను కూడా ఉపయోగించుకోవచ్చు. మొత్తమ్మీద ఈ కొత్త అప్‌డేట్ గూగుల్‌లోనే ఎక్కువ సమయం గడపడానికి సహాయపడుతుంది. కానీ నమ్మకమైన సమాచారం, వెబ్‌సైట్ల ఆదాయం, యూజర్ల అనుభవంపై పెద్ద ప్రభావం చూపిస్తోంది. అయితే ఈ ఏఐ ఆధారిత సెర్చ్ అప్‌డేట్స్, ఏఐ ఓవర్‌వ్యూలు(AIOverviews), సెర్చ్ ఫలితాలను ప్రదర్శించే కొత్త పద్ధతులు వినియోగదారుల నుంచి, పబ్లిషర్ల(వార్తా సంస్థలు, వెబ్ కంటెంట్ క్రియేటర్స్ ) నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొ్ంటున్నాయి. అయినప్పటికీ ఇది నచ్చని వారు సాధారణ సెర్చ్ కావాలంటే “Web” ఆప్షన్ ఎంచుకోవచ్చు.
వివాదాలు.. మార్పులు
*ట్రాఫిక్ కోల్పోతున్న పబ్లిషర్స్ : గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లోని అప్‌డేట్ (AI mode) వల్ల పబ్లిషర్లు తమ కంటెంట్‌కు, వెబ్‌సైట్‌లకు సంబంధించిన ట్రాఫిక్ కోల్పోతున్నారు. చాలా సెర్చ్‌లకు గూగుల్ నేరుగా పేరాగ్రాఫ్ రూపంలో సమాధానాలను (AI Overviews) అందిస్తోంది. దీనివల్ల వినియోగదారులు డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లను సందర్శించడం తగ్గింది. ఇది పబ్లిషర్స్ ట్రాఫిక్, అలాగే ప్రకటనల ఆదాయాన్ని దెబ్బతీస్తోందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
*నిజమైన సమాచారంపై అనుమానాలు : ఏఐ సారాంశాలు కొన్నిసార్లు తప్పుడు లేదా పాత సమాచారాన్ని ఇస్తుండటం, ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్లకు సరైన క్రెడిట్ ఇవ్వకపోవడం వంటి అంశాలు వివాదాస్పదంగా మారాయి.
*గూగుల్ ఏం చేస్తున్నది : సెర్చ్ ఇంజిన్‌లోని కొత్త అప్‌డేట్ ఆందోళనలను పరిష్కరించడానికి గూగుల్ ఒరిజినల్ వార్తా కథనాలకు ప్రత్యేక క్యారసెల్‌ను (Preferred Sources) అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా నమ్మకమైన, అసలైన రియల్ రిపోర్టింగ్‌కు చెందిన కథనాలకు ప్రయారిటీ ఇచ్చేలా తన అల్గారిథమ్‌లకు ట్రైనింగ్ ఇస్తోంది. సంబంధిత అప్‌డేట్ గురించిన పూర్తి విశ్లేషణలు, నిపుణుల అభిప్రాయాలను గూగుల్ ఏఐ సెర్చ్‌లో కొత్త ఫీచర్, పబ్లిషర్ పేరులో చదవవచ్చు.
*క్యారౌసెల్ (Carousel) అంటే : Google AI Search (AI Mode లేదా AI Overviews)లో ఏఐ సమాధానం ఇచ్చినప్పుడు “... పబ్లిషర్ పేరు లో చదవవచ్చు” అని వస్తే, అది దాని మూలం (Source Citation) అన్నమాట. ఏఐ తను ఇచ్చిన సమాధానాన్ని ఏ వెబ్‌సైట్ లేదా వార్తా సైట్ నుంచి తీసుకుందో కూడా చెప్పడం కోసం ఇలా చూపి్తుంది. ఉదాహరణకు.. “ఈ విషయం గురించి మరిన్ని వివరాలు ఫలానా సైట్‌లో చదవొచ్చు అని సూచిస్తుంది. అంటే.. ఏఐ ఆ సమాచారాన్ని ఆ పబ్లిషర్ (న్యూస్ సైట్/వెబ్‌సైట్) నుంచి తీసుకొని, గ్రహించి ఇచ్చిందని అర్థం.






