Technology : మనిషి శాశ్వతంగా జీవించడం సాధ్యమే..! గూగుల్ మాజీ శాస్త్రవేత్త కుర్జ్‌వీల్ ఏం చెప్పారంటే..

by Javid Pasha |

Technology : మనిషి శాశ్వతంగా జీవించడం సాధ్యమే..! గూగుల్ మాజీ శాస్త్రవేత్త కుర్జ్‌వీల్ ఏం చెప్పారంటే..

Technology : మనిషి శాశ్వతంగా జీవించడం సాధ్యమే..! గూగుల్ మాజీ శాస్త్రవేత్త కుర్జ్‌వీల్ ఏం చెప్పారంటే..
X

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతికత మానవులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తోంది? వివిధ పనులను సులభతరం చేస్తోంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అభివృద్ధికి దోహదం చేస్తోంది. అయితే రాబోయే కాలంలో ఇది మానవ జీవన ప్రమాణాలను మరింత ప్రభావితం చేస్తుందని, ముఖ్యంగా 2030 నాటికి నానో టెక్నాలజీ ద్వారా మనుషులు ఒక విధంగా అమరత్వాన్ని సాధించవచ్చునని ప్రముఖ ఫ్యూచరిస్ట్ అండ్ గూగుల్ మీజీ ఇంజినీర్ రే కుర్జ్‌వీల్(Google scientist Ray Kurzweil) పేర్కొనగా, ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీ ఎన్ని అద్భుతాలు చేస్తుందో తెలిసిందే. దీనికి తోడుగా నానోటెక్నాలజీ కలిసి మరిన్ని అద్భుతాలు చేయనుందనే వానదలు ఇటీవల వినిపిస్తుండగా.. కుర్జ్‌వీల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సాంకేతిక నిపుణుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన నానో టెక్నాలజీ త్వరలో అద్భుతాలు చేస్తుందని, ముఖ్యంగా నానోరోబోట్స్(Nanorobots) మానవ రక్త ప్రవాహంలోకి ప్రవేశించి, కణాలను రిపేర్ లేదా రీప్లేస్ చేయడం (Repairing or replacing cells) ద్వారా వ్యాధులను నయం చేస్తాయని వెల్లడించారు. అంతేకాదు అధిక బరువు పెరగకుండా తినడానికి అనుమతిస్తాయని పేర్కొన్నారు. కచ్చితమైన సాంకేతిక అంచనాలకు పేరుగాంచిన కుర్జ్‌వీల్ జన్యుశాస్త్రం, రోబోటిక్స్, అట్లనే ఏఐ (AI) లను కీలక డ్రైవర్లు(Key Drivers)గా పేర్కొన్నారు. 2005లో ఆయన రాసిన ‘The Singularity Is Near’ పుస్తకంలోనూ ఈ భవిష్యత్ సాంకేతికత గురించి ప్రస్తావించారు. 2023లో టెక్ వ్లాగర్ అడాజియో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఇవి మళ్లీ చర్చకు వచ్చాయి.

కుర్జ్ వీల్ ప్రకారం .. నానోరోబోట్‌లు, 50 -100 నానోమీటర్ల వెడల్పుతో ఉండే చిన్న రోబోట్‌లు, కాగా ఇవి మానవ రక్తప్రవాహంలో ప్రవహించి కణాల స్థాయిలో శరీరాన్ని రిపేర్ చేస్తాయి. అంతేకాకుండా ఇవి వ్యాధులను నివారించడం, వృద్ధాప్యాన్ని ఆపడం, శరీరంలోని పోషకాలను తెలివిగా నిర్వహించడం ద్వారా ఏదైనా తిన్నా బరువు పెరగకుండా ఉండేలా చేస్తాయని మరోసారి కుర్జ్‌వీల్ పేర్కొన్నారు. ఈ సాంకేతికత జన్యుశాస్త్రం, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు(AI)లలోని పురోగతులపై ఆధారపడి ఉంటుందని, 2030 నాటికి మానవ జీవితాన్ని శాశ్వతంగా మార్చగలవని, ఒకవేళ ఆలస్యం అయినా భవిష్యత్తులో మానవుల దీర్ఘాయుష్షును పెంచడంలో లేదా అమరత్వాన్ని సాధించడంలో సాంకేతికత కీ రోల్ పోషిస్తుందని కుర్జ్‌వీల్(Ray Kurzweil) అభిప్రాయడగా.. దీనిపై సోషల్ మీడియాలో పలువురు చర్చిస్తున్నారు.

Next Story