- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మీ మీమ్’.. గూగుల్ ఫొటోస్‌లో మరో AI టూల్!
గూగుల్ ఫొటోస్ తాజాగా ‘Me Meme’ అనే సరికొత్త ఫన్నీ AI ఫీచర్‌ను లాంచ్ చేసింది.

దిశ, ఫీచర్స్: గూగుల్ ఫొటోస్ మరో ఇంట్రెస్టింగ్ AI టూల్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇటీవలే ‘Ask Photos’ అనే AI ఫీచర్‌ను పరిచయం చేసిన గూగుల్.. తాజాగా ‘Me Meme’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. యూజర్స్ తమను తాముగా మీమ్‌గా మార్చుకోవడానికి వీలు కల్పించే విధంగా ఈ సరికొత్త ఫీచర్‌ను రూపొందించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నయా ఫీచర్ ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఫన్నీగా ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చని టెక్ దిగ్గజం ఒక పోస్ట్‌లో పేర్కొంది.
ఎలా క్రియేట్ చేయాలి?
- Me Meme ఫీచర్‌ని ఉపయోగించడానికి ముందుగా Google Photos యాప్‌లో Createలోకి వెళ్లండి.
- మొబైల్ స్క్రీన్‌పై టాప్‌లో కనిపించే మీ మీమ్ ఫీచర్‌లో మీకు నచ్చిన టెంప్లేట్‌ను సెలక్ట్ చేసి మీరు అప్‌లోడ్ చేయాలనుకుంటున్న ఫొటోను సెలక్ట్ చేసుకుని జనరేట్‌పై క్లిక్ చేయండి.
- మీమ్ జనరేట్ అయిన తర్వాత సేవ్ బటన్‌ను నొక్కండి. మీమ్ సరిగాలేదనిపిస్తే ‘రీజెనరేట్’ ఆప్షన్‌ని ఉపయోగించి మళ్ళీ జనరేట్ చేయండి.
ఫస్ట్ ప్రయారిటీ వారికే..
ఈ కొత్త ఫీచర్ మరో వారంలో యునైటెడ్ స్టేట్స్‌లో Android యూజ్ చేసేవారికి వారికి అందుబాటులోకి వస్తోందని గూగుల్ ప్రతినిధి తెలిపారు. ఈ ఫీచర్ ప్రయోగం ఇంకా పూర్తికాలేదని, ప్రస్తుతం క్రియేట్ చేసిన ఫొటోలు రియల్ ఫొటోతో సరిపోలకపోచ్చని, త్వరలోనే దీనిని పూర్తిస్థాయిలో డెవలప్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.






