- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Relationship Insurance : లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ ప్రేమ పరీక్షలో పాస్ అయితే ఊహించలేని సంపాదన.. స్పోటిఫై, నెట్‌ఫ్లిక్స్ కూడా చేరిక
జీవితానికి గ్యారెంటీ లేదు కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తాం.. కానీ ఈ రోజుల్లో ప్రేమకు కూడా గ్యారెంటీ లేదు. లవర్ మూడ్ ఊసరవెల్లిలా ఎప్పుడు కలర్స్ మారుస్తుందో అర్థం కాని పరిస్థితి. పైగా సిట్యుయేషన్‌షిప్

దిశ, ఫీచర్స్ : జీవితానికి గ్యారెంటీ లేదు కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తాం.. కానీ ఈ రోజుల్లో ప్రేమకు కూడా గ్యారెంటీ లేదు. లవర్ మూడ్ ఊసరవెల్లిలా ఎప్పుడు కలర్స్ మారుస్తుందో అర్థం కాని పరిస్థితి. పైగా సిట్యుయేషన్‌షిప్, హుకప్స్ నడుస్తున్న ఎరలో నిజమైన ప్రేమను కనుగొనడం దాదాపు అసాధ్యమే అయింది. ఈ విషయంపై హండ్రెడ్ పర్సెంట్ రీసెర్చ్ చేసిన వ్యక్తి.. దీన్నే బిజినెస్ ప్లాన్‌గా మార్చేశాడు. మీ ప్రేమకు గ్యారెంటీ లేదు కాబట్టి రిలేషన్ షిప్ ఇన్సూరెన్స్ ట్రై చేయండి అని ప్రమోట్ చేస్తున్నాడు. ఫస్ట్ టైమ్ ఇలాంటి వ్యాపారాన్ని తీసుకొచ్చిన ఈ వ్యక్తి ఎవరు? ఎక్కడ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు? చూద్దాం.
చాలా మందిని ఆశ్చర్యపరిచే ఫస్ట్ రిలేషన్‌షిప్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తోంది zikilove వెబ్‌సైట్. యూనిక్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఓ రీల్ రిలీజ్ చేయగా నెటిజన్ల అటెన్షన్ క్యాచ్ చేసింది. ఇందుకోసం ప్రేమలో ఉన్న అమ్మాయి, అబ్బాయి.. తమ ప్రేమ లాంగెటివిటీ మీద బెట్ చేస్తూ కవరేజ్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ‘‘మీరు నిజంగానే మీ సోల్‌మేట్‌ను కనుగొన్నారని అనుకున్నట్లయితే.. ఐదేళ్ల వరకు కొంత ఎమౌంట్ ప్రతీ ఏటా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు పెళ్లి అయితే మేమే మీకు మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి పది రెట్ల డబ్బులు ఇస్తాం. ఒకవేళ బ్రేకప్ అయితే మాత్రం ఏమీ రాదు’’.. ఇదే ఇన్సూరెన్స్ పాలసీ. కాగా ఈ వెబ్‌సైట్ ప్రేమికుల మధ్య ఉన్న బంధాన్ని ఇద్దరు పంచుకుంటున్న మెసేజ్‌లు, స్పోటిఫై ప్లే లిస్ట్, నెట్‌ఫ్లిక్స్ వాచ్ టైమ్ లాంటి యూనిక్ పారామీటర్స్ ఆధారంగా అంచనా వేస్తుంది. అంతేకాదు రిలేషన్‌షిప్ వర్కవుట్ అయ్యేందుకు ఈ ఇన్సూరెన్స్ పాలసీ గేమ్ చేంజర్‌గా పని చేస్తుందని హామీ ఇస్తున్నారు.
ఇక ఈ ప్రమోషన్ ఇంటర్నెట్‌లో భారీ రియాక్షన్స్ అందుకుంది. కొందరు దీనిని ఫన్నీ అండ్ యూనిక్ కాన్సెప్ట్‌గా చూస్తుండగా.. ఇంకొందరు రిలేషన్ సక్సెస్‌పై విచిత్రమైన పందెంగా భావిస్తున్నారు. ‘‘బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎవర్’’ అని ఒకరంటే.. ‘‘పెళ్లి చేసుకున్న తర్వాత రివార్డ్ పొందవచ్చంటున్నారు కాబట్టి భాగస్వామితో రివార్డ్ డబ్బును పరస్పరం పంచుకుని వివాహాన్ని రద్దు చేసుకోవచ్చా’’ అని ఇంకొకరు అడిగారు. ఈ థాట్‌తో వస్తున్న క్రియేట్ నెక్స్ట్ బిగ్ ఎంట్రప్రెన్యూర్ అవుతాడని ఇంకొంత మంది ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.






