మంచి ఆలోచన.. స్కూల్‌‌కు వస్తున్న పిల్లల్ని రిసీవ్ చేసుకుంటున్న టీచర్లు (వీడియో)

by Disha Web Desk 9 |
మంచి ఆలోచన.. స్కూల్‌‌కు వస్తున్న పిల్లల్ని రిసీవ్ చేసుకుంటున్న టీచర్లు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగిశాయి. నిన్నటి(జూన్ 12) నుంచి స్కూళ్లు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు సుదీర్ఘ సెలవుల తర్వాత బడులకు బాటపట్టారు. కొన్ని చోట్ల ఎండ తీవ్రత తగ్గకపోవడంతో ఇంకా ఒంటిపూట బడులను కొనసాగిస్తుండగా.. మరికొన్ని చోట్ల పూర్తిగా కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సమ్మర్ హాలీడేస్ తర్వాత స్కూళ్లు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను రిసీవ్ చేసుకోవడానికి ఓ స్కూల్ యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. స్కూల్ గేటు వద్ద స్వయంగా టీచర్లే పిల్లలకు బొట్టు పెట్టి స్వాగతించడం.. లోనికి ఎంటర్ అయ్యాక సరస్వతి దేవికి దండం పెట్టి తరగతిలోకి వెళ్లేలా ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మంచి ఆలోచన అంటూ నెటిజన్లు ఆ వీడియోలకు కామెంట్లు పెడుతున్నారు.

Also Read: మంగళవారం బెల్లాన్ని ఈ స్థలంలో పాతిపెడితే.. భూ వివాదాలు, కోర్టు కేసులు మాయం!

Next Story

Most Viewed