బియ్యపు గింజపై ఆరు స్వర్ణ లింగాలు

by Chukka Sudharani |

మహాశివరాత్రిని పురస్కరించుకోని సూక్ష్మ కళాకారుడు డాక్టర్ ముంజంపల్లి విద్యాధరాచారి బియ్యం గింజపై ఆరు స్వర్ణ శివలింగాలను రూపొందించాడు.

బియ్యపు గింజపై ఆరు స్వర్ణ లింగాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : సూక్ష్మ కళాకాండాల తయారీ నిపుణుడు మరోసారి తన అద్భుత ప్రతిభను ప్రదర్శించాడు. మహాశివరాత్రి పురస్కరించుకొని బియ్యపు గింజపై స్వర్ణంతో శివ లింగాలను చెక్కి తన సూక్ష్మకళను చాటిచెప్పారు. ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ రికార్డులను నెలకొల్పి, ఎన్నో అవార్డులు పొందిన స్వర్ణకారుడు డాక్టర్ ముంజంపల్లి విద్యాధరాచారి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. రేపు మహాశివరాత్రిని పురస్కరించుకొని బియ్యపు గింజపై నాలుగు మిల్లి గ్రాముల స్వర్ణంతో ఆరు స్వర్ణ లింగాలను చెక్కారు. వీటిని రూపొందించడానికి ఆయన మూడు రోజులలో కేవలం ఐదు గంటల సమయం కేటాయించి తయారు చేయడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ప్రణవ పంచాక్షరి రూపంలో ఒక్కో అక్షరానికి ఒక శివలింగాన్ని తయారు చేశారు. ప్రస్తుతం ఈ స్వర్ణ శివలింగాలు చూసిన ప్రతి ఒక్కరు డాక్టర్ ముంజంపల్లి విద్యాధరాచారిని ప్రశంసలతో ముంచెత్తున్నారు.

Next Story