Viral Video : యముడితో డేటింగ్‌కు పోతున్నా.. ఐసీయూలో బామ్మ చేసిన పనికి అందరూ షాక్..(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-04 12:50:39  IST  )

అమ్మాయిలు అంటేనే అందం. ఎంత క్లిష్టపరిస్థితుల్లో ఉన్నా.. అద్దం కనిపిస్తే చాలు అందాన్ని చూసుకుని మురిసిపోతారనే అర్థం వచ్చేలా బోలెడన్ని సామెతలు కూడా ఉన్నాయి.

Viral Video : యముడితో డేటింగ్‌కు పోతున్నా..  ఐసీయూలో బామ్మ చేసిన పనికి అందరూ షాక్..(వీడియో)
X

దిశ, ఫీచర్స్ : అమ్మాయిలు అంటేనే అందం. ఎంత క్లిష్టపరిస్థితుల్లో ఉన్నా.. అద్దం కనిపిస్తే చాలు అందాన్ని చూసుకుని మురిసిపోతారనే అర్థం వచ్చేలా బోలెడన్ని సామెతలు కూడా ఉన్నాయి. ఈ వీడియో చూస్తే ఇలాంటి వాళ్లను చూసే అమ్మాయిలు.. అద్దం.. అందం.. మధ్య సంబంధాన్ని సామెతల రూపంలో వివరించారని అనిపిస్తుంది. ఐసీయూలో ఉన్న బామ్మ అద్దం చూసుకుంటూ లిప్ స్టిక్ పెట్టుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘యమరాజ్‌తో డేటింగ్‌కు వెళ్లాల్సి ఉంది’ అనే క్యాప్షన్‌తో ట్రెండింగ్‌లోకి రాగా.. కామెంట్ బాక్స్ నిండిపోయింది.

‘‘సాధారణంగా ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యూబ్‌లతో ఉన్న వృద్ధులు బలహీనంగా, నీరసంగా కనిపిస్తారు. కానీ ఈ బామ్మ చేతిలో అద్దం.. అందానికి మెరుపులు రుద్దుతూ యముడిని ఫ్లర్ట్ చేసేందుకు రెడీ అవుతుంది’’, ‘‘ యమరాజ్‌ను మస్తానీలా అట్రాక్ట్ చేస్తుంది’’, ‘‘ వయసు జస్ట్ నంబర్ మాత్రమేనని నిరూపించింది’’, ‘‘ ఈ రోజుల్లోనే ఇలా ఉందంటే అప్పట్లో బామ్మ రెబల్ కిడ్ అనుకుంటా’’ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఇంకొందరు ‘‘ ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయడమంటే ఇదేనేమో’’ అని పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు.

Click For Tweet..

Next Story