కృత్రిమ నాలుకను డెవలప్ చేసిన పరిశోధకులు.. కల్తీ ఆహారాల నివారణలో కీ రోల్!

by Javid Pasha |   (  Updated:2025-10-25 06:10:11  IST  )

గ్లాస్గో యూనివర్సిటీ పరిశోధకులు గ్రాఫీన్ ఆధారిత నానోసెన్సర్లతో కృత్రిమ నాలుకను అభివృద్ధి చేశారు. ఇది మానవ నాలుకపై ఉండే రుచి కణాల మాదిరిగానే సూక్ష్మమైన రసాయన కూర్పులను గుర్తించి రుచిని తెలియజేస్తుంది

కృత్రిమ నాలుకను డెవలప్ చేసిన పరిశోధకులు.. కల్తీ ఆహారాల నివారణలో కీ రోల్!
X

దిశ, ఫీచర్స్ : ఆహారం రుచిగా ఉందా? ఉప్పు సరిపోయిందా లేదా? అనేది తెలుసుకోవాలంటే ఓ టీ స్పూన్‌తో కొద్దిగా తీసుకొని దాని టేస్ట్ చూస్తాం. ఇంట్లో వండేటప్పుడైతే ఇది సాధ్యం. కానీ పెద్ద పెద్ద హోటళ్లలో నిరంతరం అనేక ఆహారాలు వండే క్రమంలో ఇలా ప్రతీ సందర్భంలో చూడటం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఈ సమస్యను అధిగమించడానికి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవచ్చునని నిరూపించారు గ్లాస్గో యూనివర్సిటీ(University of Glasgow)కి చెందిన పరిశోధకులు. అందుకోసం వీరు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కృత్రిమ(artificial tongue) నాలుకను డెవలప్ చేశారు. దాని ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ విధంగా డెవలప్ చేశారు

గ్లాస్గో యూనివర్సిటీ పరిశోధకులు గ్రాఫీన్ ఆధారిత నానోసెన్సర్లతో కృత్రిమ నాలుకను అభివృద్ధి చేశారు. ఇది మానవ నాలుకపై ఉండే రుచి కణాల మాదిరిగానే(Like human taste buds) సూక్ష్మమైన రసాయన కూర్పులను గుర్తించి, కొత్త రుచులను నేర్చుకోగలదు. అయితే ఇది చాలా వేగంగానూ పనిచేస్తుంది. గ్రాఫీన్‌కు సంబంధించిన సెన్సిటివ్ లక్షణాలను ఉపయోగించడం ద్వారా ఈ ఏఐ ఆధారిత నాలుక ఆహారం లేదా ద్రవాల రుచితోపాటు వాటిలోని మంచి, చెడు లక్షణాలను, హానికరమైన రసాయన నమూనాలను సైతం విశ్లేషించగలదు.

ఉపయోగాలు ఏమిటి?

*పరిశోధకులు డెవలప్ చేసిన ఏఐ ఆధారిత కృత్రిమ నాలుక ఆహార ఉత్పత్తులలో కల్తీని గుర్తించడం, లాలాజలం ద్వారా వ్యాధులను నిర్ధారించడం, అలాగే రోబోట్ల సేవలు ఉపయోగించుకుంటున్న హాస్పిటాలిటీ రంగంలో, ఆహారాన్ని సర్వ్ చేయడానికి ముందు రుచిని పరీక్షించడంలో ఉపయోగపడుతుంది. ఆహార భద్రత, వైద్య రంగాలలోనూ ఈ ఆవిష్కరణ ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

*ఏఐ అల్గారిథమ్ సెన్సార్ల నుంచి సేకరించిన డేటాను ఎనలైజ్ చేసి, ఆహార పదార్థాల టేస్ట్ చూడటంలో కొత్త రుచుల గురించి నేర్చుకోవడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇది గ్రాఫీన్ కు సబంధించిన అధిక వాహకత సెన్సిటివిటీని ఉపయోగిస్తుంది. ఉదాహరణకు ఆహార ఉత్పత్తులలో హానికరమైన రసాయనాలు లేదా కలుషిత పదార్థాలను తక్షణమే గుర్తించడం ద్వారా ఈ టెక్నాలజీ ఫుడ్ సప్లయ్ చైన్(food supply chain)లో భద్రతా ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది.

*అదనంగా.. లాలాజల విశ్లేషణ ద్వారా వ్యాధులను ముందస్తుగా గుర్తించడం వంటి మెడికల్ అప్లికేషన్స్(Medical applications)లో ఉపయోగించడంవల్ల రోగనిర్ధారణలో విప్లవాత్మక మార్పులను తీసుకురాగలదని పరిశోధకులు అంటున్నారు. రోబోట్లు ఈ సాంకేతికతను ఉపయోగించి ఆహారం ఆహారం రుచిని మాత్రమే కాకుండా నాణ్యతను అంచనా వేయగలిగితే ఆతిథ్య రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడతాయి.

Next Story