Funny viral : కళ్లద్దాలుంటే కూడా జర రెస్పెక్ట్ ఇవ్వండి బ్రో..!!

by Javid Pasha |   (  Updated:2025-04-04 11:16:58  IST  )

Funny viral : కళ్లద్దాలుంటే కూడా జర రెస్పెక్ట్ ఇవ్వండి బ్రో..!!

Funny viral : కళ్లద్దాలుంటే కూడా జర రెస్పెక్ట్ ఇవ్వండి బ్రో..!!
X

దిశ, ఫీచర్స్ : ‘కాదేదీ కవితకనర్హం’ అన్నట్లు.. కామెడికేం కొదువ లేదు మన సమాజంలో. కూరలో జరంత కారం తక్కువైనా తింటారేమో గానీ.. మాట మాటలో వ్యంగ్యాలు, వెటకారాలు లేకుంటే మాత్రం ముద్ద దిగదు మనలో కొందరికి. అందుకే ఏ నలుగురు ‘జోకు’ల రాయుళ్లు కలిసినా కసితీరా ‘జోకే’సుకుంటూ మస్తు మజా చేస్తుంటారు. అలాంటి ఫన్నీ న్యూస్ ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ.. నెటిజన్ల చూపులన్నీ తనవైపు తిప్పకుంటూ.. కడుపుబ్బా నవ్విస్తోంది. ఇంతకీ ఏంటంటే.. ‘‘కళ్లద్దాలు ధరించే వారికి జర రెస్పెక్ట్ ఇవ్వండి..! ఎందుకంటే మనల్ని చూసేందుకని వారు డబ్బులు చెల్లించి వాటిని కొంటారు!

అదేదో పైశాచికానందం అంటారుగా.. ఇది పైశాచికత్వంలో గొప్ప కావచ్చు. కానీ.. హాస్యానందం కూడా ఉంటుందని మీకు తెలుసా? ఇది రకరకాల రూపంలో వ్యక్తం అవుతూ ఉంటుంది. మాటలు, చమత్కారాలు, చలోక్తులు, సామెతలు.. ట్రెండీ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే మీమ్స్ కూడా. ఇలా డిఫరెంట్ వే ఆఫ్ కామెంట్లు, ఫన్నీ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ.. ప్రజలను ఆకట్టుకుంటుంటాయ్. అలాంటి ఓ హాస్య భరిత డైలాగే ఇప్పుడు పలువురిని కడుపుబ్బా నవ్విస్తోంది. ఏంటంటే.. ‘‘respect people who wear glasses because they paid money to see you’’ ఇగ తెలుగులో చెప్పాలంటే.. ‘‘కళ్లద్దాలు ధరించే వారికి జర రెస్పెక్ట్ ఇవ్వండి..! ఎందుకంటే మిమ్మల్ని చూసేందుకని వారు డబ్బులు చెల్లించి వాటిని కొంటారు’’ ఎట్లుంది వెటకారం!.. కామెడీ అదుర్సా! ఫన్నీ పండిందా!! హహహ!!!

Next Story