- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొరియన్ డ్రామాస్ చూసే అమ్మాయిలకు తెలివి తక్కువ??.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ.. మీరేమంటారు? అధ్యయనం మాత్రం..
కొరియన్ డ్రామాస్(K-Dramas) అంటే చాలా మందికి పిచ్చి ఉంటుంది. రొమాంటిక్, క్యూట్ అండ్ నాటీ కంటెంట్ ఉండటంతో అతిగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఇలాంటి వ్యక్తులకు తక్కువ ఐక్యూ (IQ) ఉంటుందని తాజా అధ్యయనం సూచిస్తుందనే వార్తలు వస్తున్నాయి.

దిశ, ఫీచర్స్ : కొరియన్ డ్రామాస్(K-Dramas) అంటే చాలా మందికి పిచ్చి ఉంటుంది. రొమాంటిక్, క్యూట్ అండ్ నాటీ కంటెంట్ ఉండటంతో అతిగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఇలాంటి వ్యక్తులకు తక్కువ ఐక్యూ (IQ) ఉంటుందని తాజా అధ్యయనం సూచిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన న్యూస్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో చర్చనీయాంశంగా మారింది. నిజంగానే K-Dramas చూస్తే తెలివి తక్కువవాళ్లు అయిపోతారా అనే చర్చ జరుగుతోంది. మా ఫ్రెండ్స్ ఇదే కేటగిరీలోకి వస్తారని చాలా మంది కామెంట్స్ పెడుతుంటే.. కొరియన్ డ్రామాస్ ఇంట్రెస్ట్ ఉన్న వారు ఇదంతా ట్రాష్ అని కొట్టిపడేస్తున్నారు. ఇంతకీ దీనిపై నిజానిజాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
BMC సైకాలజీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం సెలబ్రిటీలను అతిగా ఆరాధించే (celebrity worship) వ్యక్తులు తక్కువ కాగ్నిటివ్ సామర్థ్యాలను కలిగి ఉంటారని సూచించింది. 1763 మందిపై జరిపిన అధ్యయనంలో 30-పదాల వొకాబులరీ టెస్ట్, డిజిట్ సింబల్ సబ్‌స్టిట్యూషన్ టెస్ట్ నిర్వహించింది. అలాగే సెలబ్రిటీ ఆరాధన స్థాయిని కొలిచే ‘‘సెలబ్రిటీ యాటిట్యూడ్ స్కేల్’’ ప్రశ్నాపత్రాన్ని పూర్తి చేయాలని సూచించింది. కాగా సెలబ్రిటీ ఆరాధన స్కేల్‌లో ఎక్కువ స్కోరు సాధించిన వారు కాగ్నిటివ్ టెస్ట్‌లలో తక్కువ పనితీరు కనబరిచారు. అయితే ఈ అధ్యయనం ప్రత్యేకంగా కొరియన్ డ్రామాలపై దృష్టి సారించలేదు. కానీ కొరియన్ సెలబ్రిటీలు లేదా K-డ్రామాల పట్ల ఆసక్తి ఉన్నవారిని సెలబ్రిటీ ఆరాధన కింద పరోక్షంగా చేర్చవచ్చు. దీంతో కొన్ని వెబ్‌సైట్‌లు ఈ అధ్యయనాన్ని తప్పుగా ప్రచారం చేశాయి. కొరియన్ సెలబ్రిటీల ఫ్యాన్స్.. ముఖ్యంగా ఆడవారు తక్కువ IQ కలిగి ఉంటారని సంచలనాత్మకంగా ప్రచురించాయి.
ఇక సెలబ్రిటీ ఆరాధన తక్కువగా ఉండటం కాగ్నిటివ్ సామర్థ్యానికి కారణమా? లేక తక్కువ సామర్థ్యం ఉన్నవారు సెలబ్రిటీలపై ఆసక్తి చూపుతారా? అనేది అస్పష్టంగా ఉంది. రెండవది ఈ అధ్యయనం హంగేరియన్ జనాభాపై జరిగింది. ఇది కొరియన్ డ్రామా ఫ్యాన్‌బేస్‌కు.. ముఖ్యంగా ఆసియా లేదా భారతీయ సందర్భాలకు వర్తించకపోవచ్చు. మూడవది కొరియన్ డ్రామాలపై ప్రత్యేకమైన అధ్యయనం లేనందున.. ఈ ఫలితాలను K-డ్రామా అభిమానులకు వర్తింపజేయడం తప్పుదారి పట్టించడమే. మరోవైపు కొరియన్ డ్రామాలు మానసిక ఆరోగ్యం, సామాజిక సమస్యలు, సాంస్కృతిక అవగాహనను ప్రోత్సహించడంలో సానుకూల ప్రభావం చూపుతాయని పలు అధ్యయనాలు సూచించాయి.






