Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. ప్రేమలో పడితే మోసపోవడం పక్కా..!

by Phanindra |

మోసం చేసే వాళ్ళ కోసం వారి ఎనర్జీనంతా వేస్ట్‌ చేసుకుంటారు. చివరకు, వారి హృదయం ముక్కలవుతుంది.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. ప్రేమలో పడితే మోసపోవడం పక్కా..!
X

దిశ, వెబ్ డెస్క్ : ఒక వ్యక్తి యొక్క లక్షణాలను న్యూమరాలజీ (Numerology) కూడా చెబుతుంది. ఈ శాస్త్రం మొత్తం అంకెలు, సంఖ్యలు గురించి మాట్లాడుతుంటుంది. పుట్టిన రోజు వారు ఎలా ఉంటారో చెప్పొచ్చు. అలాగే, నిజ జీవితంలో వారి వ్యక్తిత్వం, ప్రేమ , రిలేషన్‌షిప్స్‌ ఇలా కొన్నింటిని అంచనా వేయోచ్చు. అయితే, పుట్టిన తేదీల నంబర్స్‌.. జీవితాల మీద ప్రభావం చూపిస్తాయని న్యూమరాలజిస్టులు తెలిపారు. ఏ నెలలోనైనా 2, 5, 7, 11, 12, 14, 17, 20, 24, 25, 27, 29 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎమోషనల్‌గా ఉంటారని న్యూమరాలజీ (Numerology) చెబుతోంది.

ఈ తేదీల్లో పుట్టినవ వారు తమ జీవిత భాగస్వాములను ఎంచుకోవడంలో తప్పు చేస్తారంటూ న్యూమరాలజీ చెబుతోంది. వీరు ఎమోషనల్‌గా లేని మనుషులతో కనెక్ట్ అవుతారు. దీని వలన వారు డబ్బు పోగొట్టుకుంటారు. జీవితం మీద ఎలాంటి హోప్స్ లేని అబ్బాయిలకు ( Mens ) అట్రాక్ట్‌ అవుతారట. వారి ప్రేమలో పడి సమయం మొత్తం వృథా చేస్తారు. ఎమోషనల్‌ ఛాలెంజెస్‌ నుంచి బయటపడిన తర్వాతనే లైఫ్‌లో గ్రోత్‌ని చూస్తారు. వారిని గట్టెక్కించబోయి వీరు ట్రాప్ లో చిక్కుకుంటారు.

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ( Girls ) వారు సెలెక్ట్ చేసుకున్న పురుషులను సరైన మార్గంలో పెట్టగలమని అనుకుంటారు. కానీ, అవతలి వాళ్లు మిమ్మల్ని మార్చగలం అనుకుంటారు. దీని వలన ప్రేమలో ఉన్నంత కాలం గొడవలు అవుతూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలు కూడా మీ దగ్గర దాచి మోసం చేస్తుంటారు. వీరు ఎవర్ని అయితే లవ్ చేస్తారో వారికీ మధ్యలోనే ముగింపు పలుకుతారు. అయినా కూడా వారి పార్ట్‌నర్స్‌లో కొంచం కూడా ఎలాంటి మార్పు ఉండదు. మోసం చేసే వాళ్ళ కోసం వారి ఎనర్జీనంతా వేస్ట్‌ చేసుకుంటారు. చివరకు, వారి హృదయం ముక్కలవుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story